Latest Updates
-
దసరా స్పెషల్ రెడ్ చికెన్.. చికెన్ కర్రీ వండేటప్పుడు ఈ సీక్రెట్ మసాలా వేస్తే టేస్ట్ నెక్ట్స్ లెవల్ అంతే! -
హ్యాపీ విజయదశమి 2026..మీ బంధుమిత్రులకు దసరా విషెస్ చెప్పండిలా.. -
దసరా స్పెషల్..పాకం పట్టే పనిలేకుండా ఈజీగా బెల్లం గవ్వలు చేసుకోండిలా..గుల్ల గుల్లగా భలే రుచిగా.. -
గోధుమ రవ్వ vs బొంబాయి రవ్వ..షుగర్ పేషెంట్ల ఆరోగ్యానికి ఏ ఉప్మా మంచిది? -
మిగిలిపోయిన అన్నంతో హోటల్ స్టైల్ క్రిస్పీ వడలు.. -
కర్ణాటక స్పెషల్ మసాలా చిత్రాన్నం..కేక ఉంటది ట్రై చెయ్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ -
సొంత డబ్బులతో స్కూల్ అభివృద్ధి చేసిన హెడ్ మాస్టర్..నోటీస్ పంపి,ట్రాన్స్ ఫర్ చేసిన గవర్నమెంట్! -
ఎండుమిర్చి టమాటో రోటి పచ్చడి..ఇలా చేశారంటే కంచంలో వేరే కూరలు వద్దనేస్తారు! -
ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! -
రాత్రి మిగిలిపోయిన అన్నంతో క్రిస్పీ దోశ..ఈజీగా చేసుకోండిలా..
దసరా నాడు అపరాజితా దేవి పూజ ఎలా చేయాలి? శుభ ముహూర్తం, మంత్రాలు, శమీ పూజ డీటెయిల్స్..
ఈ ఏడాది దసరా పండుగను అక్టోబర్ 20న మంగళవారం నాడు జరుపుకుంటున్నాం. దీనిని విజయదశమి అని కూడా పిలుస్తాం. చెడుపై మంచి విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను జరుపుకుంటాం. అయితే ఈ పవిత్రమైన రోజున అపరాజితా దేవిని పూజిస్తే జీవితంలో ఓటమి అనేదే ఉండదని మీకు తెలుసా?
అపరాజిత అంటే ఎప్పటికీ ఓడిపోనిది అని అర్థం. మీరు ఏ రంగంలో ఉన్నా సరే.. ఈ అమ్మవారిని భక్తితో ఆరాధిస్తే అఖండ విజయాలు మీ సొంతమవుతాయి. ఆత్మవిశ్వాసం, కార్యసిద్ధి కలగాలంటే దసరా రోజున అపరాజితా దేవి పూజను ఎలా చేయాలి? సక్సెస్ కోసం చేయాల్సిన ఆ రహస్య పరిహారం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

పూజకు సరైన ముహూర్తం ఇదే..
సాధారణంగా విజయదశమి రోజున అమ్మవారి పూజను మధ్యాహ్నం తర్వాత (అపరాహ్ణ కాలంలో) చేయడం ఆనవాయితీ. మీ స్థానిక పంచాంగం ప్రకారం విజయ ముహూర్తం చూసుకుని ఆ సమయంలో పూజను ప్రారంభించడం వల్ల విశేషమైన ఫలితాలు దక్కుతాయి. పంచాంగం విజయ ముహూర్తం అక్టోర్ 20 మధ్యాహ్నాం 1: 58 గంటల నుంచి 2: 43 గంటల వరకు ఉంటుంది.
అపరాజితా దేవి పూజా విధానం
-ముందుగా పూజామందిరాన్ని శుభ్రం చేసుకుని, పీఠంపై అపరాజితా దేవి ప్రతిమను లేదా పటాన్ని ప్రతిష్టించాలి.
-పసుపు, కుంకుమ, అక్షతలు, పూలు, నైవేద్యం సిద్ధం చేసుకోవాలి.
-దీపం వెలిగించి.. అమ్మా నా కుటుంబం, ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అఖండ విజయం ప్రసాదించు అని మనసారా సంకల్పం చేసుకోవాలి.
-అమ్మవారికి నీలిరంగు పూలు (శంఖు పుష్పాలు) అంటే మహా ప్రీతి. 9 లేదా 11 శంఖు పుష్పాలను తీసుకుని అమ్మవారికి సమర్పించాలి. ఆ పూలు దొరకకపోతే మీ దగ్గర ఉన్న పూలతోనే భక్తిగా పూజించవచ్చు.
మీకు తెలిసిన దుర్గా స్తోత్రాలు పఠిస్తూ ధూపదీపాలు సమర్పించి, పండ్లు లేదా సాత్విక ఆహారాన్ని నైవేద్యంగా పెట్టి హారతి ఇవ్వాలి.
అద్భుతాలు సృష్టించే రహస్య పరిహారం
మీరు అనుకున్న పనులు నూటికి నూరు శాతం నెరవేరాలంటే ఈ ప్రత్యేక పరిహారం చేయాలి. పూజలో అమ్మవారికి సమర్పించిన శంఖు పుష్పాలను తీసుకుని.. ఒక శుభ్రమైన పసుపు రంగు వస్త్రంలో జాగ్రత్తగా మూటకట్టాలి. ఆ పూల మూటను మీ పూజా గదిలో కానీ లేదా డబ్బులు దాచే బీరువాలో కానీ భద్రపరుచుకోవాలి. ఈ పరిహారాన్ని ఎవరికీ చెప్పకుండా, అత్యంత గుప్తంగా, నిశ్శబ్దంగా చేస్తే ఆశించిన ఫలితాలు వాయువేగంతో నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
పూజలో ఆడంబరాలు, ఖరీదైన వస్తువులు ఉండాలని ఏమీ లేదు. నిష్కల్మషమైన భక్తే అమ్మవారికి అసలైన నైవేద్యం.
అమ్మవారి దివ్య స్తోత్రం
హారేణ తు విచిత్రేణ భాస్వత్ కనకమేఖలా ..అపరాజితా భద్రరతా కరోతు విజయమ్ మమ.

శ్రీరాముడిని, ఆయుధాలను, జమ్మి చెట్టును కూడా
విజయదశమి రోజున అపరాజితా దేవితో పాటు, శ్రీరాముడిని, ఆయుధాలను, జమ్మి చెట్టును పూజించడం ఎంతో శుభకరం.
సీతాపహరణం చేసిన రావణాసురుణ్ణి శ్రీరాముడు సంహరించి, ధర్మాన్ని నిలబెట్టిన పవిత్రమైన రోజు దసరానే. ఉత్తర భారతదేశంలో దీనిని రామ్ లీలా రూపంలో జరుపుకుని రావణ దహనం చేస్తారు.
ఇక అజ్ఞాతవాస సమయంలో పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై దాచిపెట్టారు. అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత విజయదశమి నాడే ఆ ఆయుధాలను తిరిగి తీసి, జమ్మి చెట్టును పూజించి కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారు. అందుకే ఈ రోజు జమ్మి ఆకును బంగారంగా భావించి పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ. సాయంత్రం వేళ జమ్మి చెట్టు వద్దకు వెళ్లి ప్రదక్షిణలు చేసి, దీపం వెలిగించి పూజించాలి. తర్వాత జమ్మి ఆకులను పెద్దలకు ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకోవాలి.
జమ్మి చెట్టును పూజించేటప్పుడు చదవాల్సిన మంత్రం
శమీ శమయతే పాపం శమీ లోకకంటకమ్..అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శనమ్.(అర్థం: శమీ వృక్షం పాపాలను నశింపజేస్తుంది. శత్రువులను నాశనం చేస్తుంది. అర్జునుడి ధనుస్సును మోసినది, శ్రీరాముడికి ప్రియమైనది అయిన ఈ శమీ వృక్షానికి నమస్కరిస్తున్నాను.)



Click it and Unblock the Notifications
