Latest Updates
-
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు! -
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం! -
బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్.. తెలంగాణ స్టైల్ బగారా రైస్, పనీర్ కర్రీ ఇలా చేసి తింటుంటే స్వర్గమే! -
ఉద్యోగులూ అలర్ట్..మెడ, వెన్ను నొప్పులతో నరకం చూస్తున్నారా? విముక్తి కోసం ఏం చేయాలంటే? -
రైస్, చపాతీలోకి అద్దిరిపోయే బంగాళదుంప ముద్ద కూర.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ అడుగడం గ్యారెంటీ! -
గుడిసెలో ఉండే బిచ్చగాడికి 21 మంది భార్యలు..ఏం బెల్లం పెట్టావ్ రా అయ్యా.. -
ఎలక్ట్రిక్ కెటిల్ ఎలా క్లీన్ చేయాలి? ఈ సింపుల్ ట్రిక్ తో నిమిషాల్లో కొత్తదానిలా మెరుస్తూ.. -
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే? -
కంటిచూపు మెరుగుపర్చి, జుట్టు రాలడం తగ్గించే అసలైన కరివేపాకు కారం పొడి..ఎలా చేసుకోవాలంటే..
July 2024 Festivals: జూలై 2024 నెలలో ముఖ్యమైన పండుగలు మరియు వ్రతాలు
హిందూ క్యాలెండర్ ప్రకారం జూలై నెలలో అనేక పండగలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా జగన్నాథ రథయాత్ర, గుప్త నవరాత్రి, బోనాలు, యోగిని ఏకదశి, ఆషాఢ మాసం మొదలైన ముఖ్యమైన పండుగలు ఈ నెలలో రానున్నాయి. కాబట్టి ఉపవాసాలు మరియు పండుగల పరంగా జూలై నెల చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.ఇంకా ముఖ్యంగా తెలంగాణలో బోనాల పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. అలాగే కోకిల వ్రతం ఉపవాసాలను ఆచరిస్తారు. ఇంకా ఈ మాసంలో యోగిని ఏకాదశి మరియు దేవశయని ఏకాదశి వ్రతం అనే రెండు ప్రధాన ఏకాదశి వ్రతాలను జరుపుకుంటారు. జులై నెలలో విష్ణువును పూజించి వారి అనుగ్రహాన్ని పొందుతారు. జూలై నెలలో ముఖ్యమైన పండుగలు, వ్రతాలు మరియు ఏతేదీల్లో వచ్చాయో ఇక్కడ తెలుసుకుందాం.

యోగినీ ఏకాదశి
యోగినీ ఏకాదశి వ్రతాన్ని జ్యేష్ఠ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి నాడు జరుపుకుంటారు. ఈ రోజున విష్ణువును పూజిస్తారు. విష్ణుమూర్తిని వ్రతం ప్రకారం పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.
అమావాస్య
జ్యేష్ఠ మాసంలో కృష్ణ పక్షంలోని అమావాస్య తిథిని జ్యేష్ఠ లేదా మన్నెట్టినామావాస్య లేదా దర్శ అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజుల్లో పవిత్ర నదీ జలాలతో లేదా పవిత్ర నదులలో స్నానం చేస్తారు.
బోనాల జాతర, గుప్త నవరాత్రులు
ఈ నెలలో జూలై 6 నుండి శని వారం నుండి నార్త్ ఇండియాలో గుప్త నవరాత్రు మరియు వారాహీ నవరాత్రులు ప్రారంభం అవుతాయి. ఈ ఆషాడంలో తెలంగాణా రాష్ట్రంలో బోనాలు ప్రారంభం అవుతాయి.
జగన్నాథ రథయాత్ర ప్రారంభం
ఈ నెలలో జూలై 7 జగన్నాథరథయాత్ర ప్రారంభం అవుతుంది. ఉత్తర భారత దేశంలో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ రథయాత్రకు ప్రత్యేక ప్రాముఖ్యతను ఉంది.
దేవశయని ఏకాదశి
ఆషాఢ మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి తిథిని హరిశయని, దేవశయని, విష్ణు-శయని ఏకాదశి, ఆషాఢ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున శ్రీమహావిష్ణువు నాలుగు నెలల పాటు యోగ నిద్రలోకి వెళతాడు.
కోకిల వ్రతం
ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో శుక్ల పక్షం చతుర్థశి రోజు కోకిల వ్రతం ఆచారిస్తారు. పార్వతి దేవి మరో రూపం కోకిలాదేవి. ఈ రోజున పార్వతీ దేవిని పూజిస్తారు.
గురు పూర్ణిమ
గురు పూర్ణిమ పండుగను ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శుక్ల పక్ష పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఈ రోజున శిష్యులు తమ గురువును పూజించి కానుకలు సమర్పిస్తారు.
సంకష్ట చతుర్థి
ఆషాఢ మాసంలో వచ్చే కృష్ణ పక్ష చతుర్థి తిథిని చంకష్ట చతుర్థిగా జరుపుకుంటారు. ఈ రోజున వినాయకుడిని పూజించడం ద్వారా జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయి. అత్యధికులు ఈ రోజున గణపతిని పూజించి ఉపవాసం ఉంటారు.
కామికా ఏకాదశి
కామిక ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును ఆరాధించడం, వ్రతం చేయడం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయి. ఈ రోజున శ్రీమహావిష్ణువు సమేతంగా లక్ష్మీదేవిని పూజిస్తే సంపదలు పెరుగుతాయని నమ్మకం.



Click it and Unblock the Notifications
