Latest Updates
-
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా..
రోజూ ఈ టైంలో నిద్రపోయే అలవాటుందా.. లక్ష్మీదేవి నిలవాలంటే ఈ పొరపాట్లు అస్సలు వద్దు.!
మీకు సాయంత్రం వేళ నిద్రపోయే అలవాటు ఉంటే సంధ్యా సమయానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నియమాలను తెలుసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అసలు సంధ్యాసమయం అంటే టైమింగ్స్ ఏంటి.. ఆ టైంలో ఎలాంటి పనులు చేయకూడదు.. ఏ పనులు శుభప్రదం.. పండితుల సూచనలు, సలహాలు చూద్దాం..

హిందూ మత సంప్రదాయం ప్రకారం రోజులో కొన్ని ప్రత్యేక సమయాలు, శుభ ఘడియలు ఉంటాయి. వాటికో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. కొన్ని సమయాలు పూజ, వివాహం, శుభకార్యాలకు అత్యంత పవిత్రమైనవి కాగా.. మరికొన్ని సమయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటిదే సంధ్యాసమయం. ఈ సమయం అత్యంత పవిత్రమైనది, శుభప్రదమైనది. ఈ సమయంలో కొన్ని కార్యకలాపాలకు దూరంగా ఉండాలని మతపరమైన విశ్వాసాలు చెబుతున్నాయి.
సంధ్యాసమయం అంటే ఏంటి..
పగలు ముగిసి రాత్రి ప్రారంభమయ్యే కాలం సంధ్యాసమయం. పూర్వ కాలంలో ఆవులు.. అడవుల్లో, పొలాల్లో మేత వేసి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు వాటి గిట్టలు మట్టిలో దుమ్ములేపేవి. పగలు, రాత్రి కలిసే ఈ దుమ్ము రేపే సాయంత్రం సమయాన్ని సంధ్యా సమయం అంటారు. సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య సంధ్యా సమయంగా మన పెద్దలు చెబుతారు. సూర్యాస్తమయం, ప్రదేశాన్ని బట్టి అసలైన సంధ్యాసమయం మారుతుంటుంది.
ఏం చేయకూడదు
హిందూ మత విశ్వాసాల ప్రకారం సంధ్యా సమయంలో తినడం, నిద్రపోవడం గానీ చేయకూడదు. ఈ సమయంలో డబ్బు, పాలు, పెరుగు అప్పుగా ఇవ్వకూడదు. ఈ సమయంలో తులసి మొక్కను తాకడం గానీ, నీరు పోయడం గానీ చేయకూడదు. జడ దువ్వుకోవడం, అల్లుకోవడం, అలంకరించుకోవడం, వంటి శారీరక కార్యకలాపాలు చేయకూడదని పండితుల సలహా.

ఏం చేయాలి..
సంధ్యా సమయంలో ప్రశాంతమైన మనస్సుతో భగవంతుని ధ్యానించుకోవాలి. మంత్రాలు జపించడం, కీర్తనలు పాడటం అత్యంత శుభప్రదం. తులసి దేవి దగ్గర దీపం వెలిగించడం, ఇంటి ప్రధాన ద్వారం వద్ద, గుడిలో నెయ్యి దీపం వెలిగించడం శుభప్రదంగా సంప్రదాయాలు చెబుతున్నాయి. ఈ సమయంలో ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందనే విశ్వాసంతో ప్రధాన ద్వారం తెరిచి ఉంచాలి. ఇంట్లో శాంతిని కాపాడుకుంటూ గొడవలకి దూరంగా ఉండాలి.
నిద్రపోతే ఏమవుతుంది.
సంధ్యా సమయంలో నిద్రపోవడం అనేది అశుభకరం, నిషిద్ధం. దీని వెనుక అనేక మతపరమైన, ఆరోగ్య సంబంధిత కారణాలు ఉన్నాయి. ఈ సమయంలో నిద్రపోతే జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. నీరసానికి దారితీస్తుంది. మతపరంగా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించే సమయంలో నిద్రపోవడం అనేది అశుభకరం. ఇంటి శ్రేయస్సుపై ప్రభావం చూపిస్తుంది. పగలు, రాత్రి మధ్య ఈ పరివర్తన సమయంలో నిద్రపోవడం సోమరితనానికి దారితీస్తుంది. ప్రతికూల ఆలోచనలు, మానసిక అశాంతి కలిగేలా చేస్తుందని మత విశ్వాసాలతో పాటు శాస్త్రీయ కారణాలు చెబుతున్నాయి.



Click it and Unblock the Notifications
