Latest Updates
-
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా? -
రక్తం పట్టడానికి, ఉక్కు లాంటి ఎముకల కోసం తప్పక తినాల్సిన పాత కాలం నాటి బలమైన స్వీట్.! -
తప్పేం లేదు.. ప్రశాంతంగా బతకాలంటే ఈ ఐదు అబద్ధాలు చెప్పడం నేర్చుకోవాల్సిందే.! -
రాఖీ స్పెషల్: నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే కమ్మటి బేసన్ లడ్డూ..చాలా ఈజీగా చేసుకోండిలా -
మీ సోదరుడి రాశి చక్రం ఆధారంగా ఈ రాఖీలు కడితే.. వారి సంతోషానికి ఢోకా ఉండదు.! -
పకోడీలు, బజ్జీలు బోర్ కొట్టాయా? అయితే ఈ కరకరలాడే మునగకాయ స్నాక్ ట్రై చేయండి! -
డిన్నర్, బ్రేక్ ఫాస్ట్ ఏ టైంకి తింటున్నారు? ప్రాణగండం ఉంది జాగ్రత్త! -
సోదరి లేకపోతే ఎవరు రాఖీ కట్టవచ్చు.. రక్షాబంధన్ ఉద్దేశం, నియమాలు తెలుసుకోండి.!
పితృ పక్షాలు ఆచరణ: ఏఏ రోజున శ్రాద్ధకర్మ చేస్తే ఎటువంటి ఫలితాలను లభిస్తాయి..?
పితృ పక్షాలు ఆచరించడం వల్ల కలుగు శుభాలు..లాభాలు..!
మహాలయ పక్ష ప్రారంభం. శుద్ధ పూర్ణిమ పిత్రు పక్షం మొదలయ్యే రోజు. ఈ రోజు నుండి వరుసగా పదిహేను రోజులు పితృ పక్షం మొదలయ్యే రోజు. ఇక్కడ నుండి వరుసగా పదిహేను రోజులు పితృ దేవతలు పూజలకు ఉద్దేశించినవి. పితృ దోషం అంటే ఒక శాపం. గత జన్మలో ఎవరైనా వృద్దులకు కానీ, తల్లిదండ్రులకు కానీ కష్టం కలిగించి ఉంటే, లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాత తరాల వారు కష్టా లపాలవడం పితృ దోషాలకు గురికావడం జరుగుతుంది.
జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్గించవచ్చు. పితృదోషాల వల్ల అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి. ఉదాహరణకు ముఖ్యమైన పనులు పూర్తీ కాక ముందే ఆటంకాలు, వైఫల్యాలు ఎదుర్కోవడం, గౌరవ ప్రతిష్టలకు భంగం కలగడం. కుటుంబంలో స్త్రీకి చిన్ని వయస్సులోనే వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబంలోని వ్యక్తికీ మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండటం, ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం, సంతానం వల్ల తీవ్ర సమస్యలు వంటివి.
ప్రతి మనిషి తన జీవితంలో పితృబుణం తీర్చాలి. దీని వల్ల పితరులు తృప్తి చెందుతారు. వారికి ముక్తి లభిస్తుంది. తమ సంతానం పితృ బుణం తీర్చక పోతే వారికి ముక్తి లభించదు. మహాలయపక్షం రోజుల్లో వారసులు వదిలే తర్పణాలు పితృదేవతలకు ఆకలిదప్పులు తీరుస్తాయి. సంతృప్తి చెందిన పితృదేవతలు ఆశీర్వాదం వంశీకుల ఉన్నతికి కారకమవుతుంది. ఈ పక్షం రోజుల్లో ఇతర శుభకార్యేలేవి ఆరంభం చేయకూడదు. మహాలయ అమావస్య రోజునతర్పణ కార్యక్రమం చేశాక దేవతా పూజలకు శ్రీకారం చుట్టాలి. ఈ పక్షం రోజుల్లో శ్రాద్ధ కర్మ నిర్శిర్తించటం చేత పితరులు తృప్తి కలుగుతుంది.
శ్రాద్ధ మహిమను శాస్త్రాలు సవివరంగా పేర్కొన్నాయి. శ్రాద్ధం చేయటం వల్ల సంతానం ప్రాప్తిస్తుందని స్కాంద పురాణంలో చెప్పబడింది, ఆదర పూర్వకంగా శ్రాద్ధ కర్మతో సంతోషపెడితే వారు తమ సంతత వారి ఆయుష్యు, విద్య ధనం, సంతానం , సమస్తం కలిగి ఉండేట్టు ఆశీర్వదిస్తారు. శ్రాద్ధ కర్మలో నువ్వులు, గూడమిశ్రిత అన్నం సమర్పించిన దానం అక్షయం అవుతుంది. అన్ని దానాలలో కంటే అన్నదానం ప్రధానమైనది, అన్నదానం ఎప్పుడు చేసిన మంచి ఫలితాన్నే ఇస్తుంది. కానీ ఈ మహాలయపక్షంలో చేసే అన్నదానం వల్ల అనంతకోటి యజ్ఝ ఫలితం ప్రాప్తిస్తుంది. అలాగే మఖ నక్షత్రం పితరులకు సంబంధించినది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధ కర్మ అక్షయఫలన్నిస్తుంది. ఈ పక్షంలో ఏ రోజు ఏ శ్రాద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందని వివిధ పురాణాల ఆధారంగా తెలుసుకోవచ్చు...

పాడ్యమి రోజు
పాడ్యమి రోజు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల ధన సంపద లభిస్తాయి

ద్వితీయనాడు
ద్వితీయనాడు శ్రాద్ధ కర్మ చేయుట వల్ల రాజయోగం, సంపద లభిస్తుంది.

తృతీయనాడు
తృతీయనాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల శత్రువులు నశిస్తారు.

చతుర్ధి నాడు
చతుర్ధి నాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల ధర్మ గుణం, ఇష్టకామ్య ప్రాప్తి కలుగుతుంది. అంతే కాకుండా శత్రువుల వ్యూహాలు ముందుగా పసిగట్టగలరు .

పంచమి నాడు
పంచమి నాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల వాళ్ళ ఉత్తమ లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. పుత్రకామన గలవారికి ఫలం లభిస్తుంది.

షష్టి నాడు
షష్టి నాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల దేవతలు పితరులు ప్రసన్నులవుతారు, ఆ వ్యక్తికి సమాజంలో శ్రేష్ఠ గౌరవ లభిస్తుంది.

సప్తమి రోజు
సప్తమి రోజు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల యజ్ఝం చేసిన పుణ్య ఫలం లభిస్తుంది.

అష్టమి నాడు
అష్టమి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే విస్తారంగా సంపద, అనుకూలవతి అయిన భార్య లభిస్తుంది,.

దశమినాడు
దశమినాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల లక్ష్మీ ప్రాప్తి, పశు సంపద వృద్ది చెందుతుంది,

ఏకాదశి నాడు
ఏకాదశి నాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల సర్వ శ్రేష్ట ధాన ఫలం లభిస్తుంది. పాపాలన్నీ నశిస్తాయి, వేద జ్ఝానం ప్రాప్తిస్తుంది, కుటుంబం వృద్ది చెందుతుంది. శ్రాద్ధ కర్తకు అన్నానికి లోటుండదు, అలాగే పుత్ర, పశు, మెధా బుద్ధి, జయ సంపత్తి కలుగుతుంది.

త్రయోదశి
త్రయోదశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే ధనం, సంతతి, ఐశ్వర్యం, దీర్ఘాయువు, ఆరోగ్యం, బంధుమిత్రులలో గౌరవం లభిస్తాయి.

చతుర్థశి నాడు
చతుర్థశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే ఆయుధాల నుండి రక్షణ లభిస్తుంది.

అమావాస్య నాడు
అమావాస్య నాడు శ్రాద్ధా కర్మ చేస్తే వ్యక్తికి సమస్త లాభాలు కలుగుతాయి. అన్ని కోరకలు నెరవేరుతాయి.

ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్ధాలు ఈ మహాలయపక్షం పదిహేను రోజులు చేయలేనివారు ఒక్క మహాలయమైన చేసి తీరాలి.
ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్ధాలు ఈ మహాలయపక్షం పదిహేను రోజులు చేయలేనివారు ఒక్క మహాలయమైన చేసి తీరాలి. ఆర్థిక భావం వల్ల విధ్యుక్తంగా శ్రాద్ధ కర్మలు చేయలేకపోతే, పితృ పక్షంలో కేవలం శాకంతో శ్రాద్ధం చేయవచ్చు. అది కూడా వీలుకాకపోతే గోవుకు గ్రాసం పెట్టవచ్చు. అదీ చేయలేని వారు ఎత్తి, పితృ దేవతలకు నమస్కరించవచ్చు. శ్రాద్ధ కర్మ చేత పితృ దేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది.



Click it and Unblock the Notifications