Latest Updates
-
వాస్తు ప్రకారం ఇల్లు తుడుచుకోవడానికి సరైన టైం ఏది? -
కిచెన్‌లో శ్రమ తగ్గించే చిట్కాలు.. ఈ టెక్నిక్స్‌తో అన్నం అంటుకోదు, పప్పు పొంగిపోదు.! -
టీ తాగితే ఎముకలు కరిగిపోతాయా? ఈ విషయాలు మీకు తెలుసా? -
డైలీ ఐదు చాలు.. వీటిని రాత్రంతా నానబెట్టి తింటే రక్తహీనత బాధే ఉండదు.! -
రాఖీ, కృష్ణాష్టమి స్పెషల్..అచ్చు స్వీట్ షాప్ రుచితో ఇంట్లోనే పర్ఫెక్ట్ సోన్ పాప్డీ చేసుకోండిలా.. -
శుక్ర గోచారం 2026..ఆగష్టు 25 నుంచి ఈ 3 రాశులకు కష్టాలు తప్పవు! -
శ్రావణ మాసం స్పెషల్ మజ్జిగ ఆలు కర్రీ..జన్మ జన్మలు గుర్తిండిపోయే రుచి! -
పాముకాటుకి గురైతే మేల్కొని ఉండాలా.. పొరపాటున కళ్లు మూస్తే ఏం జరుగుతుంది.? -
పిల్లల్లో క్యాన్సర్ తొలి లక్షణాలు..ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన నిజాలు.. -
రాఖీ 2026 స్పెషల్: స్వీట్ షాప్ టేస్ట్‌ను తలదన్నేలా ఇంట్లోనే ఈజీగా కొకొనట్ బర్ఫీ.!
Maha Shivratri 2022:శివరాత్రి వేళ ఈ పరిహారాలు పాటిస్తే.. ఆర్థిక బాధల నుండి విముక్తి లభిస్తుందట...!
మహా శివరాత్రి 2022 సందర్భంగా, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ పరిహారాలు పాటిస్తే, ఆర్థిక సమస్యల నుండి బయటపడొచ్చు.
హిందువులు జరుపుకునే పవిత్రమైన పండుగలలో మహా శివరాత్రి ఒకటి. హిందూ క్యాలెండర్ ప్రకారం, కొన్ని ప్రాంతాల్లో మాఘ మాసంలో మాఘ బహుళ చతుర్దశి నాడు, మరికొన్ని ప్రాంతంలో ఫాల్గుణ మాసంలో క్రిష్ణ పక్షం యొక్క చతుర్దశి తేదీన ఈ పండుగను జరుపుకుంటారు.

ఈ సంవత్సరం మార్చి 1వ తేదీన అంటే మంగళవారం నాడు మహా శివరాత్రి పండుగ వచ్చింది. ఈరోజున ముక్కోటి దేవతలలో సనాతుడైన శివుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే, కోరిన కోరికలన్నీ తీరుస్తాడని భక్తులందరి నమ్మకం.

మీకు ఇప్పటివరకు ఆర్థిక పరంగా ఏమైనా సమస్యలుంటే, మహా శివరాత్రి రోజున జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, కొన్ని పరిహారాలు పాటిస్తే అన్ని సమస్యల నుండి సులభంగా బయటపడొచ్చు. ఈ సందర్భంగా పరిహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

శివరాత్రి రోజున..
మహా శివరాత్రి రోజున జ్యోతిర్మయ రూపంలో ఒక మహాలింగ రూపంలో శివుడు ఉద్బవించాడని చాలా మంది నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున ఈశ్వరుడు తన దర్శనం ద్వారా విశన్నంతటినీ దేదీప్యమానం చేసిన ఈ సమయంలో అస్సలు నిద్ర పోకూడదట.
రాత్రంతా జాగరణ చేసి మేలుకుంటే మంచి ఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు.

బిల్వ పత్రాలు..
పురాణాల ప్రకారం, మహా శివరాత్రి రోజున పద్నాలుగు లోకాల్లో ఉండే పుణ్యతీర్థాలన్నీ బిల్వ మూలంలో ఉంటాయి. అందుకే ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి ఒక్క బిల్వ పత్రాన్ని పరమేశ్వరుడికి సమర్పించి తరించమని శాస్త్రాలు చెబుతున్నాయి. అనంతరం మహా శివరాత్రి రోజున పరమేశ్వరుని ఆలయాల్లో జరిగే పూజల్లో పాల్గొంటే సిరి సంపదలు పెరుగుతాయని వేద పండితులు చెబుతుంటారు.

ఈ పరిహారాలు పాటించండి..
* మహా శివరాత్రి రోజున పరమేశ్వరునికి పెరుగుతో రుద్రాభిషేకం చేస్తే సంపద పెరుగుతుంది.
* ఆ భోలేనాథుడికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది.
* మహా శివరాత్రి రోజున తేనే మరియు నెయ్యితో శివలింగానికి అభిషేకం చేస్తే మీ సంపద పెరుగుతుందని, మీకు శుభ ఫలితాలొస్తాయి.
* మీకు రావాల్సిన బకాయిలు ఉంటే, మహా శివరాత్రి రోజున శివుని వాహనం నంది అంటే ఎద్దుకు పచ్చి మేత తినిపిస్తే మంచి ఫలితాలొస్తాయి.
* మహా శివరాత్రి రోజున సాయంత్రం 108 మహామృత్యుంజయ మంత్రాలు జపించండి.

శివరాత్రి వేళ ఈ పరిహారాలు పాటిస్తే.. డబ్బు సమస్యలు తగ్గిపోతాయి..!
* మీ జాతకంలో గ్రహాల స్థితి బలహీనంగా ఉంటే, మహా శివరాత్రి రోజున మీరు శివ లింగానికి ఆవు పాలతో అభిషేకరం చేసి, ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించాలి.
* ఉద్యోగులకు లేదా వ్యాపారులకు ఏదైనా సమస్య ఉంటే, మహా శివరాత్రి రోజున ఉపవాసం ఉండి, నీటిలో తేనే కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి. దానిమ్మ పువ్వులను సమర్పించాలి.
* మహా శివరాత్రి రోజున పేదలకు సహాయం చేయడం వల్ల జీవితంలోని అన్నిరకాల సమస్యలు తీరతాయి.
* మీరు మీ కోరికలను నెరవేర్చుకోవాలనుకుంటే, మహా శివరాత్రి రోజున, మీరు శివునికి ఇష్టమైన వస్తువులను సమర్పించాలి.
* మహా శివరాత్రి రోజున వెండి కమలంతో శివునికి జలధారతో అభిషేకం చేస్తూ, ఓం నమః శివాయ, ఓం పార్వతీపతయే నమః అనే మంత్రాలను 108 సార్లు జపిస్తే ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది.
హిందువులు పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఫాల్గుణ మాసంలో క్రిష్ణ పక్షం యొక్క చతుర్దశి తేదీన ఈ పండుగను జరుపుకుంటారు.ఈ సంవత్సరం మార్చి 1వ తేదీన అంటే మంగళవారం నాడు మహా శివరాత్రి పండుగ వచ్చింది. ఈరోజున ఈశ్వరుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే, కోరిన కోరికలన్నీ తీరుస్తాడని భక్తులందరి నమ్మకం.
* మహా శివరాత్రి రోజున పరమేశ్వరునికి పెరుగుతో రుద్రాభిషేకం చేస్తే సంపద పెరుగుతుంది.
* ఆ భోలేనాథుడికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది.
* మహా శివరాత్రి రోజున తేనే మరియు నెయ్యితో శివలింగానికి అభిషేకం చేస్తే మీ సంపద పెరుగుతుందని, మీకు శుభ ఫలితాలొస్తాయి.
* మీకు రావాల్సిన బకాయిలు ఉంటే, మహా శివరాత్రి రోజున శివుని వాహనం నంది అంటే ఎద్దుకు పచ్చి మేత తినిపిస్తే మంచి ఫలితాలొస్తాయి.
* మహా శివరాత్రి రోజున సాయంత్రం 108 మహామృత్యుంజయ మంత్రాలు జపించండి.



Click it and Unblock the Notifications