Latest Updates
-
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.!
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్‌లోనే అద్భుత రహస్యం.!
ముఖ సంరక్షణ కోసం మహిళలు సబ్బుల కంటే ఎక్కువగా ఫేస్ వాష్‌లు, స్క్రబ్‌లు ఎక్కువగా ఉపయోగిస్తారు. మార్కెట్‌లో రకరకాల కంపెనీల పేరుతో ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటున్నాయి. అయితే అవి కొందరి ముఖానికి సత్ఫలితాన్ని అందించినా.. మరికొందరి చర్మంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ క్రమంలో ఇంట్లోనే వంటగదిలో దొరికే సాధారణ పదార్థాలతో ముఖాన్ని మరింతగా ఆకర్షణీయంగా, మెరిసేలా చేసుకోవచ్చు.

మన ఇంట్లో కిచెన్‌లోనే లభ్యమయ్యే సహజ పదార్థాలతో స్క్రబ్‌లు, ఫేస్‌వాష్‌లు తయారుచేసుకోవచ్చు. వీటిలో ఎలాంటి కెమికల్స్ ఉండని కారణంగా ముఖంపై ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూపించవు. ఇవి లోతైన శుభ్రతను అందించడంతో పాటు ముఖంపై మృత కణాలను మెరుగ్గా తొలగిస్తుంది. జిడ్డు ఎక్కువగా ఉంటే తొలగించి ముఖం ఎప్పుడూ తాజాగా కనిపించేందుకు దోహదపడుతుంది. అయితే ఈ చిట్కాలు అమలు చేసేముందు ప్యాచ్ టెస్ట్ చేయడం తప్పనిసరి అని బ్యూటీషియన్ నిపుణులు సూచిస్తున్నారు. మరి ఇంట్లోనే ముఖాన్ని శుభ్రం చేసుకునేందుకు, స్క్రబ్ చేసుకునేందుకు వంటగది చిట్కాలను ఇక్కడ తెలుసుకుందాం.. వాటిని ఎలా తయారుచేసుకోవచ్చో చూద్దాం..
శనగపిండి- పెరుగు
చర్మ సంరక్షణలో శనగపిండి కీలక పాత్ర పోషిస్తుంది. పురాతన కాలం నుంచి శనగపిండిని మహిళలు ముఖానికి ప్యాక్‌లా ఉపయోగిస్తున్నారు. అయితే ఇందులో పెరుగు కలపడం ద్వారా మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి. శనగపిండిలో పెరుగు కలిపి ముఖానికి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేయడం ద్వారా ముఖంపై మురికి, అధిక నూనెలను నివారిస్తుంది. ముఖానికి తేమ అంది పొడిబారకుండా కాపాడుతుంది.
కాఫీ పొడి- తేనె మిశ్రమం
కాఫీ పొడి తలనొప్పిని తగ్గించడమే కాదు ముఖానికి మెరుగైన పోషణ అందిస్తుంది. కాఫీ పొడి సహజమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేయడం ద్వారా చర్మానికి తేమను అందిస్తుంది. కాఫీ పొడిలో తేమను కలిపి ముఖానికి స్క్రబ్‌లాగా అప్లై చేసుకోవాలి. నెలకు 2 లేదా 3 సార్లు ఇలా స్క్రబింగ్ చేసుకోవడం ద్వారా చర్మానికి పోషణ అందించి తేమగా ఉంచుతుంది. తాజాగా, మృదువుగా ఉండేలా చేస్తుంది.
బియ్యపు పిండి- పాలు
అతి చవకైన బియ్యపు పిండి ముఖానికి సహజ చికిత్సగా పనిచేస్తుంది. ఇది చర్మంపై మృతకణాలను సులభంగా తొలగిస్తుంది. బియ్యపు పిండిలో కొద్దిగా పాలు కలుపుకొని పేస్ట్‌లా చేసుకోవాలి. దీనిని ముఖానికి సున్నితంగా రాసుకోవాలి. వారానికోసారి ఇలా ఫేస్‌కి అప్లై చేసుకోవడం ద్వారా ముఖంపై మొటిమలను తొలగించి మృదువుగా ఉంచుతుంది.
ఓట్స్- పెరుగు
సున్నితమైన చర్మం ఉన్నవారికి ఓట్స్- పెరుగుతో చేసిన ఫేస్ వాష్ బెస్ట్ ఆప్షన్. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసినట్లయితే పొడిబారకుండా తేమగా, మృదువుగా ఉంటుంది. చర్మం లోతుల నుంచి శుభ్రం చేస్తుంది. మృత కణాలను సమర్థవంతంగా తొలగిస్తుంది.

చక్కెర- కొబ్బరినూనె
చక్కెర రేణువులు చర్మం పై పొరను రక్షిస్తాయి. మృత చర్మ కణాలను తొలగిస్తాయి. చర్మాన్ని తేమగా ఉంచేందుకు కొబ్బరి నూనె దోహదపడుతుంది. ఈ రెండింటి మిశ్రమంతో ముఖంపై సున్నితంగా మర్దన చేసుకోవడం ద్వారా తాజాగా, కాంతివంతంగా ఉంచుతుంది. వారానికోసారి ఈ స్క్రబ్‌ను ఉపయోగిస్తే సత్ఫలితాలిస్తాయి.
నారింజ తొక్క- రోజ్ వాటర్
చాలా మంది నారింజ పండ్లను తిని తొక్కను పడేస్తారు. కానీ నారింజ తొక్క చర్మ సంరక్షణలో దోహదపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి ముఖాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది. నారింజ తొక్కలను మెత్తగా చేసి అందులో రోజ్ వాటర్ కలిపి ముఖానికి సున్నితంగా మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా చర్మం తాజాగా మారుతుంది. కాంతివంతంగా కనిపిస్తుంది. వారానికోసారి ఈ ఫేస్‌వాష్‌ను ఉపయోగిస్తే ముఖ ఛాయ మెరుగుపడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
