Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
Medaram Jatara 2022:ఈ ఏడాది సమ్మక్కసారక్క జాతర ఎప్పుడు? విగ్రహాలు లేకుండా ఉత్సవాలెలా జరుగుతాయో తెలుసా?
2022లో మేడారం జాతర తేదీ, చరిత్ర మరియు ప్రాముఖ్యత ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణలోని మేడారం జాతర ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది. అంతేకాదు ఇక్కడి వన దేవతలు సమ్మక్కసారక్కలను దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుండి భక్తులందరూ తరలి వస్తుంటారు.

గతంలో కరోనా కారణంగా మేడారం జాతరకు రాలేని వారంతా ఈ ఏడాది కరోనా తగ్గుముఖం పట్టడంతో సమ్మక్క సారక్కలను దర్శించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అనేక ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ప్రత్యేక బస్సులను కూడా సిద్ధం చేశారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీ నుండి 19వ తేదీ వరకు అంటే నాలుగు రోజుల పాటు ఈ సంబురాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మేడారం జాతరకు ఎందుకని ఇంత ప్రాధాన్యత దక్కింది? ఇక్కడ సమ్మక్కసారక్కలను వన దేవతలుగా ఎందుకు కొలుస్తారు? అమ్మవారికి సమర్పించే బెల్లాన్ని బంగారంగా ఎందుకు భావిస్తారు? ఇక్కడికి వచ్చే భక్తురాళ్లంతా ఎందుకని దేవతలుగా మారిపోతారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

వన దేవతలుగా..
మేడారం జాతరలో సమ్మక్కసారక్కలను వనదేవతలుగా కొలిచేందుకు గల కారణాలను పరిశీలిస్తే.. ఇక్కడ ఓ కథ ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది. పూర్వకాలంలో కోయదొరలు అడవిలో వేటకు వెళ్లిన సమయంలో, వారికి పెద్ద పులుల కాపలా మధ్య ఓ చిన్నారి కనిపించింది. వారు ఆ చిన్నారిని గుడారానికి తీసుకెళ్లారు. ఆ చిన్నారి వారి దగ్గర ఉన్నప్పటి నుండి అన్నీ మంచి శకునాలే సంభవించాయి. దీంతో ఆ కొండ దేవతే చిన్నారి రూపంలో వచ్చిందని నమ్మారు.

పౌర్ణమి రోజున..
మాఘ మాసంలోని శుద్ధ పౌర్ణమి రోజున ఆ చిన్నారికి సమ్మక్క అని పేరు పెట్టారు. ఆ సమ్మక్కను ఆ ప్రాంతంలోని కోయ చక్రవర్తి మేడరాజు పెంచి పెద్ద చేసినట్టు అక్కడి స్థానికులు చెబుతుంటారు.

మేడారం పాలకుడికి..
మరో కథనం ప్రకారం.. కాకతీయుల కాలంలో అంటే క్రీస్తు శకం 1260 నుండి 1320 కాలంలో, ప్రస్తుత జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పొలవాసను అప్పటి గిరిజన దొర మేడరాజు పాలించేవాడు. తన మేనల్లుడు, మేడారం పాలకుడైన పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశారు. సమ్మక్క,పగిడిద్దరాజులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు జన్మించారు.

కాకతీయులతో యుద్ధం..
ఈ రాజు కాకతీయులకు సామంతుడిగా ఉండేవాడు. అయితే తను కాకతీయ సామ్రాజ్య అధినేత ప్రతాపరుద్రుడు ఆదేశాలను ధిక్కరించాడనే నెపంతో, తనపై చర్యలకు సిద్ధమవుతాడు. ఆ సమయంలో గిరిజనులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే యత్నం చేస్తారు. మాఘ శుద్ధ పౌర్ణమి రోజున కాకతీయ సైన్యం మేడారంపైకి దండెత్తింది. ఈ నేపథ్యంలోనే ములుగు జిల్లా లక్నవరం సరస్సు దగ్గర గిరిజనులకు, కాకతీయ సైన్యానికి యుద్ధం జరిగింది.

వీరోచిత పోరాటం..
ఆ సమయంలోనే సాంప్రదాయ ఆయుధాలతో పగిడిద్ద రాజు, సారలమ్మ, నాగులమ్మ, జంపన్న, గోవిందరాజులు(పగిడిద్ద రాజు అల్లుడు) వీరోచితంగా పోరాడారు. అయితే కాకతీయ సైన్యం దెబ్బకు వీరంతా యుద్ధంలో వీర మరణం పొందారు. ఈ మరణ వార్త విన్న జంపన్న అవమానం తట్టుకోలేక అక్కడి సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటినుండి ఆ సంపెంగ వాగుకు జంపన్న వాగు అనే పేరు వచ్చిందని పెద్దలు చెబుతారు.

సమ్మక్క భక్తుడిగా..
తన కుటుంబ మరణానికి కారణమైన కాకతీయులపై సమ్మక్క తిరుగుబాటు మొదలుపెడుతుంది. ఆమె వీరోచిత పోరాటం చూసి, ప్రతాపరుద్రుడు కోపంతో ఊగిపోతాడు. ఆమెను దొంగ దెబ్బ తీస్తారు. ఆమె తన గాయంతోనే మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టకు వెళ్లి మాయమైపోతుందని పెద్దలు చెబుతారు. ఆ తర్వాత చెట్టు కింద ఓ పుట్ట సమీపంలో కుంకుమ భరిణ కనిపిస్తుందట. దీంతో తన తప్పు తెలుసుకున్న సమ్మక్క భక్తుడిగా మారిపోతాడట.

రెండేళ్లకోసారి..
అనంతరం ప్రతాపరుద్రుడు కోయరాజులు కట్టాల్సిన కప్పాన్ని రద్దు చేసి, సమ్మక్క భక్తుడై కానుకలు సమర్పించాడట. అంతేకాదు అప్పటినుండి ప్రతి రెండేళ్లకోసారి సమ్మక్క, సారలమ్మ జాతర నిర్వహించాలని ఆదేశిస్తాడట. అలా మొదలైన జాతరను ప్రతి ఏటా మాఘ శుద్ధ పౌర్ణమి నాడు సమ్మక్క, సారలమ్మ కుంకుమ భరిణెలతో ప్రత్యేక పూజలతో నిర్వహిస్తారు.

గద్దెలపై ప్రతిష్ట..
సాధారణంగా ఏ గుడి అయినా.. ఏ జాతర అయినా ఎక్కడైనా సరే ఏదో ఒక దేవుడి లేదా దేవత విగ్రహం కచ్చితంగా ఉంటుంది. అయితే ఈ మేడారం జాతరలో మాత్రం ఎలాంటి విగ్రహాలు ఉండవు. నాలుగు రోజుల ఉత్సవం.. నాలుగు రోజుల ఉత్సవం.. ఈ మేడారం జాతర ఫిబ్రవరి 16వ తేదీ నుండి ప్రారంభమవ్వనుంది. ఈ జాతర 16వ తేదీ నుండి 19వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరగనుంది. తొలి రోజు కన్నెపల్లి నుండి సారలమ్మను పూజారులు తీసుకుని జంపన్న వాగు నుండి దాటి వచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు. రెండోరోజున సమ్మక్కను గద్దె మీదకు చేరుస్తారు. సమ్మక్కను కూడా చిలకలగుట్ట మీద నుండి తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు. సరిగ్గా ఈ సమయంలోనే కుంకుమ భరిణి రూపంలో సమ్మక్క ఆగమనంతో అందరూ పులకరించిపోతారు. మూడో రోజు.. మూడో రోజు.. గద్దెలపై సమ్మక్క, సారలమ్మలు కొలువై భక్తులకు దర్శనమిస్తారు. చివరి రోజున దేవతల వన ప్రవేశం ఉంటుంది. ఈ సమయంలో ఆ వనమంతా జనసంద్రంగా మారిపోతుంది. ఈ సమయంలో అమ్మవార్ల ఆగమనంతో భక్తులు పూనకాలతో, శివభక్తుల చిందులతో అక్కడ అంతా కమణీయమైన రమణీయమైన వాతావరణం ఏర్పడుతుంది.
తొలి రోజు కన్నెపల్లి నుండి సారలమ్మను పూజారులు తీసుకుని జంపన్న వాగు నుండి దాటి వచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు. రెండోరోజున సమ్మక్కను గద్దె మీదకు చేరుస్తారు. సమ్మక్కను కూడా చిలకలగుట్ట మీద నుండి తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు. సరిగ్గా ఈ సమయంలోనే కుంకుమ భరిణి రూపంలో సమ్మక్క ఆగమనంతో అందరూ పులకరించిపోతారు. మూడో రోజు.. మూడో రోజు.. గద్దెలపై సమ్మక్క, సారలమ్మలు కొలువై భక్తులకు దర్శనమిస్తారు. చివరి రోజున దేవతల వన ప్రవేశం ఉంటుంది. ఈ సమయంలో ఆ వనమంతా జనసంద్రంగా మారిపోతుంది.
సాధారణంగా ఏ ప్రాంతంలో అయినా సంవత్సరానికి ఒకసారి జాతర జరుగుతుంది. కానీ తెలంగాణలో మాత్రం మేడారం సమ్మక్క సారక్కల మహా జాతర మాత్రం రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది జాతర అంటే కోడిని లేదా మేక లేదా గొర్రె వంటి వాటిని బలి ఇవ్వడం. కొండకోనల నడుమ కుటుంబసభ్యులు లేదా స్నేహితులతో కలిసి మందు, విందు, చిందు... అంతకుముందు జంపన్న వాగులో స్నానం చేసి.. అమ్మలకు బెల్లం సమర్పించడం వంటివి చేసి తిరుగు పయనం అవుతారు.
2022 సంవత్సరంలో ఫిబ్రవరి 16వ తేదీ నుండి 19వ తేదీ వరకు అంటే నాలుగు రోజుల పాటు ఈ జాతర సంబురాలు జరగనున్నాయి. మామూలుగా మనలో చాలా మంది దేవుళ్లందరికీ అనేక రకాల నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటూ ఉంటాయి. అయితే అడవి ప్రాంతంలో ఉండే ఆదివాసీల ఆచారాలు మాత్రం మనందరికీ చాలా విచిత్రంగా అనిపిస్తాయి. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం జాతరలో సమ్మక్క, సారలక్కకు భక్తులందరూ బెల్లాన్ని బంగారంగా భావించి వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు.



Click it and Unblock the Notifications