Latest Updates
-
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ!
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు!
జులై నెలలో మూడో వారంలోకి వచ్చేస్తున్నాం. జూలై 20వ తేదీన ప్రారంభమయ్యే కొత్త వారం జ్యోతిష్య శాస్త్ర పరంగా అత్యంత కీలకమైనది. ఈ వారం కొన్ని రాశుల వారి జీవితాల్లో ఒక సరికొత్త స్వర్ణయుగానికి నాంది పలకబోతోంది. గ్రహాల అనుకూలత కారణంగా ముఖ్యంగా మూడు రాశుల వారి జీవితాల్లో ఉన్న చీకట్లు తొలగిపోయి, వెలుగులు ప్రసరించనున్నాయి.

ఇన్నాళ్లుగా వెంటాడుతున్న దురదృష్టం దూరమై, అదృష్ట దేవత వారి తలుపు తట్టబోతోంది. వృత్తి, వ్యాపార, కుటుంబ రంగాల్లో ఊహించని శుభ ఫలితాలను ఇచ్చే ఆ మూడు అదృష్ట రాశులు ఏవో, వారికి ఎలాంటి సువర్ణావకాశాలు రాబోతున్నాయో ఇక్కడ చూడండి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారి జీవితంలో ఈ వారం ఆనందం ఆకాశమే హద్దుగా ఉంటుంది. వారం ప్రారంభంలోనే మీ చెవిన ఒక తీయనైన శుభవార్త పడుతుంది. ఇన్నాళ్లు మీ ఎదుగుదలకు అడ్డుగా నిలిచిన ఆటంకాలన్నీ పటాపంచలైపోతాయి. మీలో దాగి ఉన్న ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. మీ కెరీర్ లో ఎవరూ చేరుకోలేని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. అదృష్టం మీ వెన్నంటే ఉండటం వల్ల పురోగతికి కొత్త దారులు తెరుచుకుంటాయి.
చాలా కాలంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం లేదా ఇతర పోటీ పరీక్షల కోసం కష్టపడుతున్న వారికి ఈ వారం ఒక తీపి జ్ఞాపకంలా మిగిలిపోతుంది. పెళ్లికాని యువతీ యువకులకు వారికి తగిన, మనసుకు నచ్చిన జీవిత భాగస్వామి దొరికే శుభఘడియలు వచ్చాయి. అంతేకాకుండా ఈ రాశికి చెందిన కొంతమందికి విదేశాలకు వెళ్లే కల కూడా ఈ వారంలో నెరవేరే బలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి.
వృషభ రాశి
వృషభ రాశి వాళ్లకి ఈ వారం నిజంగా ఒక వరంలా ఉటదని చెప్పొచ్చు. గత కొంత కాలంగా మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్న సమస్యలన్నీ ఈ వారంతో మంచులా కరిగిపోతాయి. మీ జాతకంలో అదృష్టం బలంగా ఉంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా అద్భుతమైన మార్పులు చూస్తారు. డబ్బు సంపాదించడానికి మీ ముందుకు సరికొత్త మార్గాలు, సువర్ణావకాశాలు వస్తాయి. ఎవరికైనా అప్పుగా ఇచ్చి, ఇక రావు అనుకుని వదిలేసుకున్న డబ్బు అకస్మాత్తుగా మీ చేతికి అందుతుంది.
ఉద్యోగం చేసే చోట మీ పనితీరుకు ప్రశంసల వర్షం కురుస్తుంది, పై అధికారుల గుర్తింపుతో పాటు ప్రమోషన్లు కూడా లభించే యోగం ఉంది. ఆత్మీయులతో కలిసి మధురమైన క్షణాలను గడుపుతారు. ఈ సమయంలో మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది.
సింహ రాశి
సింహ రాశి వారు ఈ వారం ప్రతి రంగంలో సింహంలా దూసుకుపోతారు. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవ మర్యాదలు లభిస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇంట్లో మీ మాటకు తిరుగుండదు, మీ నిర్ణయాలకు అందరూ విలువనిస్తారు. ఆఫీసులో మీ ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరుస్తారు. ఉన్నత పదవుల్లో ఉన్నవారికి కింది స్థాయి ఉద్యోగుల నుండి అనూహ్యమైన మద్దతు, గౌరవం లభిస్తాయి.
నిరుద్యోగులకు, విద్యార్థులకు ఇది శుభకాలం. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు అద్భుతమైన విజయాలను సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి వారు కలలు కన్న సంస్థలో కొలువు దక్కే అవకాశం ఉంది. అలాగే ట్రాన్స్ ఫర్ కోరుకుంటున్న ఉద్యోగులకు వారు కోరుకున్న స్థానానికి వెళ్లే అవకాశం దక్కుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
