Latest Updates
-
గంటల తరబడి ఫ్రిజ్లో పెట్టాల్సిన పనిలేదు.. అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ ఫిష్ ఫ్రై.! -
రెస్టారెంట్ స్టైల్ తవా చికెన్..వేళ్లు నాకుతూ తినడం గ్యారెంటీ..ఈజీగా చేసుకోండిలా.. -
35 ఏళ్లకే కోరికలు తగ్గిపోయాయా.. దాంపత్య సుఖం కోసం తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన టిప్స్.! -
తెలంగాణలో వైభవోపేతంగా ఆషాఢ బోనాలు.. రంగంలో భవిష్యవాణి చెప్పిన సంగతులివే.! -
హస్తసాముద్రికం: మీ చేతిలో ఈ రేఖ ఉంటే కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ మసాలా దోశ ఇంట్లోనే.. ఈ రెండు సీక్రెట్స్ తెలిస్తే చాలు! -
కొందరు అందంగా లేకపోయినా ఎందుకు అందరినీ ఆకర్షిస్తారో తెలుసా.? -
మందు తాగేటప్పుడు స్టఫ్ గా ఏది తినడం ఆరోగ్యానికి మంచిదో తెలుసా? -
చపాతీ, నాన్, జీరా రైస్ లోకి అమృతంలాంటి నవరతన్ కుర్మా.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
శృంగార సమస్యల సంజీవని.. ఈ హల్వాను కప్పు తిన్నారంటే వీర్య పుష్టి మీ సొంతం.!
దేవాలయంలో ఈ నియమాలు పాటించకపోతే..పాపాలు తరతరాలుగా వెంటాడుతాయ్..!
దేవాలయమనేది చాలా పవిత్రమైన స్థలం. మామూలూ ప్రదేశానికి వెళ్లినట్టు దేవాలయానికి వెళ్లకూడదు. అది పిక్నిక్ స్పాట్ ఎంత మాత్రమూ కాదు. దేవతలు అక్కడ నివసిస్తారు. ఎంత మంది తమ బాధలను దేవుడికి నివేదించడానికి వెళ్తారు. తమ కష్టాలను చెప్పుకోవడానికి వెళ్తారు. దేవాలయానికి వెళ్లినపపుడు కొన్ని పనులను ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దని శాస్త్రం మనకు చెబుతోంది, అలాగే కొన్ని పనులను కచ్ఛితంగా ఎన్ని సమస్యలు వచ్చినా చేయాల్సిందేనని పండితులు చెబుతున్నారు. ఆ పనులేంటో ఒక సారి తెలుసుకుందాం.
1. వారానికి ఒక్కసారైనా కచ్ఛితంగా దేవాలయానికి వెళ్లి దేవుడిని దర్శించుకోవాలి. మనమెప్పుడైతే దేవుడిని మర్చిపోతామో అప్పుడు దేవుడు కూడా మనల్ని మర్చిపోతాడు. సమయం దొరికినప్పుడల్లా దేవాలయానికి వెళ్లి భగవంతుడిని దర్శనం చేసుకోవాలి. దేవాలయానికి వెళ్లినప్పుడు కొన్ని నియమనిష్టలు ఇష్టం లేకపోయినా పాటించాల్సిందేనని పండితులు చెబుతున్నారు.
2. దేవాలయానికి వెళ్లినప్పుడు గాలిగోపురాన్ని దర్శించుకోవాలి. ఎందుకంటే అష్టదిక్పాలకులంతా ఆ గాలిగోపురంలో నివాసం వుంటారు. దగ్గర ఫోన్ వుంటే కూడా దాన్ని స్విచ్ఛాఫ్ చేసేయాలి. చెప్పులు వేసుకొని గాలిగోపురాన్ని దాటిలోపలికి వెళ్లకూడదు. గుడిలోపలికి వెళ్లగానే ముందుగా కాళ్లు కడుక్కోవాలి. మూడు సార్లు కొన్ని నీళ్లు తీసుకొని
పండరీకాక్ష అని అనుకుంటూ తలపై చల్లుకోవాలి.

3. దేవాలయంలోపలికి వెళ్లేటప్పుడు భగవంతుడిని స్మరించుకుంటూ లోపలికి వెళ్లాలి. తరువాత ఒంటి చేత్తో నమస్కారం చేయకుండా రెండు చేతులూ జోడించి నమస్కారం చేయాలి. ఒంటి చేత్తో నమస్కారం చేస్తే పుణ్యఫలమనేది నశిస్తుంది. మూడు సార్లు గంట మోగించాలి. ఒక సారి గంట మోగిస్తే మరణ సంకేతం, రెండు సార్లు గంట మోగిస్తే అది రోగ పీడనం అదే మూడు సార్లు మోగిస్తే భగవంతుడి అనుగ్రహం తప్పకుండా మనకు కలుగుతుంది.
4. దేవాలయానికి వెళ్లినప్పుడు సాంప్రదాయమైనటువంటి వస్తువులు ధరించి మాత్రమే వెళ్లాలి. పురుషులు పంచ కట్టుకొని, మహిళలు చీరకట్టుకొని వెళ్లాలి. స్త్రీలు జుట్టు విరబోసుకొని దేవాలయంలోకి వెళ్తుంటారు. అలా చేయడం వల్ల దేవాలయంలో వెంట్రుకలు కింద రాలిపడతాయ్, మనం చేసుకున్న పుణ్యం కూడా కరిగిపోతుంది.
5. బొట్టుపెట్టుకోకుండా దేవాలయానికి వెళ్లకూడదు. పురుషులైనా, స్త్రీలైనా బొట్టుకొని మాత్రమే దేవాలయానికి వెళ్లాలి. కాస్త కుంకుమ బొట్టైనా పెట్టుకొని దేవాలయానికి వెళ్లాలి. దేవాలయానికి ఉట్టి చేతులతో వెళ్లకూడదు. కనీసం కొన్ని పూలైనా, లేదా ఏదైనా పండునైనా తీసుకొని వెళ్లాలి.
6. దేవాలయంలో ఇచ్చే హారతిని తప్పకుండా మూడు సార్లు కళ్లకు అద్దుకోవాలి. ఒక చేత్తో హారతి తీసుకోవద్దు. తలపైన శఠగోపం పెట్టినప్పుడు శ్రీమహావిష్ణువును మనసులో తలచుకోవాలి. ఎందుకంటే శఠగోపంపైన విష్ణువు పాదముంటుంది. విష్ణుమూర్తి పరిపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది.
7. గుడిలో పంతులు ఇచ్చే తీర్ధం ప్రసాదాన్ని గోముఖ ముద్ర ద్వారా స్వీకరించాలి. తీర్ధం తీసుకున్న తరువాత తలకు తుడుచుకోవద్దు. చేతిలో నాప్కిన్‌కు తుడుచుకోవాలి. ఒంటి చేత్తో కాకుండా రెండు చేతులతో తీర్థాన్ని స్వీకరించాలి. దువుడి దగ్గరి నుంచి తీసిన పువ్వులతో పూజారి మీకు ఇస్తే ఆ పువ్వును పురుషులు చెవిలో పెట్టుకోవాలి, స్త్రీలైతే తలలో పెట్టుకోవాలి. కానీ కింద పారవేయవద్దు.
8. దేవాలయంలో ఐదు నిమిశాలైనా ప్రశాంతంగా కూర్చొని భగవంతుడిని స్మరించుకోవాలి. దేవాలయంలో వున్నప్పుడు భగవంతుడికి తప్ప మరెవ్వరికి కూడా నమస్కారం చేయకూడదు. దేవాలయంలోకి ఆ సమయంలో ఎంత పెద్దవారు వచ్చినా నమస్కారం చేయాల్సిన అవసరం లేదని శాస్త్రం చెబుతోంది.
9. దేవాలయంలో దుర్భాషలాడకూడదు. చిన్నపిల్లలను కొట్టకూడదు. దేవాలయానికి వచ్చినప్పుడు వికృత చేష్టలు చేయకూడదు. దేవాలయంలో సెల్ఫీలు తీసుకోవడం, స్త్రీ పురుషులు ఒకరిని ఒకరు పట్టుకోవడం లాంటివి చేయకూడదు. శివాలయంలో ప్రసాదం, పువ్వులు, పండ్లు ఏదైనా ఇస్తే దాన్ని నందీశ్వరుడి పాదాల వద్ద పెట్టి ఇంటికి తీసుకొని రావాలి. దేవాలయంలో ఎవ్వరు ప్రసాదం ఇచ్చినా తప్పకుండా తీసుకోవాలి, దాన్ని వద్దూ అని అస్సలు అనకూడదు.
గమనిక : పైన ఇచ్చిన దేవాలయ నియమాలను ఇంటర్నెట్, బయట వున్న ప్రముఖ పండితుల నుంచి స్వీకరించింది. వీటిని మేము ఎట్టి పరిస్థితిలో దృవీకరించమని స్పష్టం చేస్తున్నాం.



Click it and Unblock the Notifications