Latest Updates
-
కుజ, గురు గ్రహాల అరుదైన కలయిక.. 3 రాశుల వారికి ఈ అడ్డంకుల నుంచి ఉపశమనం -
వెజిటేబుల్ కుర్మా ఇలా చేశారంటే..గిన్నెలు గిన్నెలు తినేస్తారు! -
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్‌డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.! -
తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం! -
వెజ్ మంచూరియా చేసేటప్పుడు ఈ తప్పులు వద్దు.. స్ట్రీట్ స్టైల్ మాదిరి రావాలంటే ఇలా చేయండి.! -
అచ్చం హైవే ధాబా రుచితో గుమగుమలాడే దాల్ ఫ్రై.. ఇంట్లోనే చాలా ఈజీగా! -
పాత కాలం నాటి నెల్లూరు స్టైల్ మినుముల పచ్చడి.. అసలుసిసలైన రుచి అంటే ఇదే.! -
వాస్తు ప్రకారం ఆఫీస్ బ్యాగ్ ఎక్కడ పెట్టాలో తెలుసా! -
బంగాళదుంపతో జలేబీ.. ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ చేస్తే అస్సలు వదలరు!
35 ఏళ్లకే కోరికలు తగ్గిపోయాయా.. దాంపత్య సుఖం కోసం తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన టిప్స్.!
ఈ రోజుల్లో చిన్న వయసులోనే చాలా మందికి లైంగిక కోరికలు తగ్గిపోతున్నాయి. దీంతో దాంపత్య జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించలేకపోతున్నారు. ఒకప్పటి రోజుల్లో 50, 60 ఏళ్లు దాటినా వారిలో సంతాన సామర్థ్యం, లైంగిక కోరికలు ఎక్కువగా ఉండేవి. లేటు ఏజ్‌లోనూ పిల్లల్ని కనేవారు. కానీ నేటి కాలంలో 30 లోపే ఫెర్టిలిటీ సమస్యలు వస్తున్నాయి. కొందరిలో 35 ఏళ్లకే లైంగిక వాంఛలు తగ్గిపోతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా కొన్ని సలహాలు తప్పనిసరిగా పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఉరుకులు పరుగుల జీవితం, పని ఒత్తిడి, నిద్రలేమి, ఆరోగ్య, ఆహార అలవాట్లు ఇలా చాలా కారణాల వల్ల ఆడా, మగా తేడా లేకుండా లైంగిక శక్తి సామర్థ్యం తగ్గిపోతుంది. దీంతో భార్యాభర్తలు తమకున్న ప్రైవసీ సమయాన్ని సంపూర్ణంగా ఆస్వాదించలేకపోతున్నారు. మున్ముందు ఈ పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఈ ఐదు టిప్స్ పాటించడం మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. అవేంటంటే..
ఆహారం
లైంగిక సామర్థ్యం పెరగడం కోసం కొందరు మందులు, చూర్ణాలను ఆశ్రయిస్తుంటారు. కానీ వీటి ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే సహజంగా శక్తిని ఎనర్జీని, లైంగిక శక్తిని పెంచే దానిమ్మ, బాదం, డార్క్ చాక్లెట్, అరటిపండు, గుమ్మడిగింజలు వంటి వాటిని తీసుకోవాలి.

వ్యాయామం
రోజూ కనీసం 30 నిమిషాల పాటు ఎక్సర్‌సైజ్, యోగా, ధ్యానం చేయడం ద్వారా శరీరంలో పునరుత్పత్తి భాగాలకు రక్త ప్రసరణ మెరుగవుతుంది. దీంతో స్టామినా పెరుగుతుంది. ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొనగలరు.
సరైన నిద్ర
రోజూ కనీసం 7 నుంచి 8 గంటల పాటు నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోండి. మంచి నిద్ర మీ శరీరాన్ని రిపేర్ చేస్తుంది. హార్మోన్లు బ్యాలెన్స్‌డ్‌గా ఉంచుతుంది. ఎనర్జీని అందిస్తుంది. మూడ్ ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది. అదేవిధంగా మొబైల్ స్క్రీన్ సమయాన్ని దాదాపుగా తగ్గించుకోవాలి.
హైడ్రేషన్
ప్రతి రోజూ 2.5 లీటర్ల నుంచి 3 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి. పుష్కలంగా నీరు తాగడం ద్వారా డీహైడ్రేషన్ రాకుండా కాపాడుతుంది. దీంతో అలసట తగ్గి హార్మోన్ల పనితీరు మెరుగుపడుతుంది.
ఈ టెస్టులు తప్పనిసరి
లైంగిక సామర్థ్యం మెరుగ్గా ఉండేందుకు శరీరంలో విటమిన్ బి12, డి, జింక్ తప్పనిసరిగా సమతుల్యంగా ఉండాలి. మీలో లైంగిక సమస్యలు ఉన్నట్లయితే తప్పనిసరిగా వీటి లోపం ఉందో లేదో చెక్ చేయించుకోవాలి. అవసరమైతే చికిత్స తీసుకోవడం మేలు చేస్తుంది. ఈ పోషకాహారం లభించే ఆహార పదార్థాలను తీసుకోవడం, సరైన జీవనశైలి పాటిస్తూ 40 ఏళ్లు దాటినా లైంగిక సామర్థ్యం పరంగా పటిష్ఠంగా ఉండగలరు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
