Latest Updates
-
పిల్లలు లంచ్ బాక్స్ ఖాళీ చేసి రావాలంటే.. ఈ స్పెషల్ దొండకాయ మసాలా రైస్ చేసి పెట్టండి! -
కోయంబత్తూర్ స్పెషల్ టమాటా తన్నీ చట్నీ.. ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోయే కాంబినేషన్! -
ఇడ్లీ, దోసెల్లోకి అదిరిపోయే టమాటా మినపపప్పు చట్నీ.. ఒక్కసారి రుచి చూశారంటే వదిలిపెట్టరు! -
భారతదేశంలో నిప్పులు చెరుగుతున్న ఏకైక అగ్నిపర్వతం ఎక్కడుందో తెలుసా? -
క్రీమీ, చీజీ కాలీఫ్లవర్ పాస్తా.. ఒకే పాత్రలో సులభంగా చేసుకోండిలా.. -
దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే పెళ్లిళ్ల స్టైల్ మైసూర్ పాక్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
రుచిగా, పోషకాలతో నిండిన బ్రేక్ ఫాస్ట్..తింటే కొండలను ఢీకొట్టే శక్తి! -
ఈ ఒక్క ఎక్సర్ సైజ్ చేస్తే 100 ఏళ్లు బ్రతకొచ్చు..న్యూరాలజిస్ట్ చెప్పిన సంచలన నిజం! -
అట్లతద్ది స్పెషల్..ఈ టిప్స్ పాటిస్తే దూదిలా మెత్తటి వాయనం అట్లు.. -
Happy Atla Tadde 2026: బంధుమిత్రులకు, పెళ్లి కాని అమ్మాయిలకు అట్లతద్ది విషెస్, స్టేటస్ లు
కొందరు అందంగా లేకపోయినా ఎందుకు అందరినీ ఆకర్షిస్తారో తెలుసా.?
ఫిజికల్ అప్పీరియన్స్.. ఏ మనిషినైనా మొదటగా చూస్తే ఆకట్టుకునేది ఇదే. అయితే అందంగా ఉన్న వాళ్లందరూ ఇతరులను ఆకర్షిస్తారు. లేనివారిని ఎవరూ చూడరు అనేది వాస్తవమేనా.. అంటే కాదు అనే చెప్పవచ్చు. కొందరు అందంగా లేకపోయినా వారి పట్ల చాలా మంది అట్రాక్ట్ అవుతుంటారు. వారితో ఎక్కువ సమయం గడపాలనుకుంటారు. వారు పక్కన లేకపోతే ఏదో వెలితిగా ఫీలవుతుంటారు. ఇందుకు కారణాలేంటంటే..

కొన్ని రిలేషన్షిప్స్ అందంతోనే ముడిపడి ఉండవు. అది స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు. ఫిజికల్ అప్పీరియన్స్ ఒక్కటే కాకుండా ఆ మనిషిలో ఉండే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఇతరులకు విపరీతంగా నచ్చుతాయి. అవి మొదటి పరిచయంలోనే కనిపించవు. మున్ముందు వారిలో ఈ గుణాలను చూడటం ద్వారా వారితో విడదీయలేని బంధాన్ని పెనవేసుకుంటారు. వారు లేని లోటును భారంగా ఫీలవుతుంటారు. ఇంతకీ మరి ఆ మనిషిలో ఇతరులను అట్రాక్ట్ చేసే లక్షణాలు ఏంటి..
నవ్వించే అలవాటు
ఎప్పుడూ మూడీగా ఉండకుండా నవ్వుతూ, నవ్విస్తూ ఉండే వారి పట్ల చాలా మంది ఆకర్షితులవుతుంటారు. వారిలోని సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇతరులను కట్టిపడేస్తుంటుంది. అలా నవ్వించే వారితో ఎక్కువ సమయం గడపాలని మీ మనసు కోరుకుంటుది. ఫలితంగా ఒత్తిడి తగ్గి ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండగలుగుతారు.
డ్రెస్సింగ్ సెన్స్
కొందరిలో సరైన డ్రెస్సింగ్ సెన్స్ మొదటి చూపులోనే ఆకట్టుకుంటుంది. ఉన్నంతలోనే నీట్‌గా, స్టైల్‌గా రెడీ అయిన వారి పట్ల ఫస్ట్ లుక్‌లోనే మంచి ఇంప్రెషన్ వస్తుంది. దీనికి అందంతో పని లేదు.

ఎప్పుడూ నవ్వుతూ ఉండటం
ఎన్ని టెన్షన్స్, సమస్యలు ఉన్నా.. వాటిని బయటకు కనబడనీయకుండా కొందరు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. ముఖం పైన చిరునవ్వు చెదరనివ్వరు. వారిలో ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉంటుంది. అదే వారి అందాన్ని పెంచుతుంది. ఇలాంటి వారిని చూసి మొదటి చూపులోనే ఇంప్రెస్ కావడం ఖాయం.
నిజాయతీ
కొందరిలో నిస్వార్థం, నిజాయతీ ఇతరులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఎలాంటి లాభాపేక్ష, స్వార్థం లేకుండా సహాయం చేసే గుణం కలిగి ఉన్న వారు అందరిలోనూ ప్రత్యేకంగా కనిపిస్తారు.
ఆత్మవిశ్వాసం
ఫిజికల్ అప్పీరియన్స్‌తో సంబంధం లేకుండా ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తులు అన్నింటా ధైర్యంగా దూసుకుపోగలరు. ఫలితంగా వారిలో వ్యక్తిత్వం మరింత మెరుగ్గా కనిపిస్తుంది. ఇదే ఇతరులను ఆకట్టుకుంటుంది. మరికొందరు ఎదుటి వారికి తాము నచ్చాలని, వారిని ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశం లేకుండా తమ పని తాము చేసుకుంటూ పోతారు. ఇలాంటి వారు అందరిలో ప్రత్యేకంగా కనిపించి ఇతరుల దృష్టిని ఆకట్టుకుంటారు. వారితో స్నేహం చేయాలని కోరుకుంటారు.



Click it and Unblock the Notifications
