Latest Updates
-
తెల్ల ఇడ్లీ కాదు..అసలైన శక్తి ఉన్న నల్ల ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
నేపాల్ ను వణికించిన జలప్రళయం.. వరదల్లో చిక్కుకుంటే ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి? -
Budha nakshatra gochar 2026 : పూర్వఫల్గుణి నక్షత్రంలోకి బుధుడు..ఆగస్టు 29 నుంచి ఈ 4 రాశులకు అగ్నిపరీక్షే! -
ఇంట్లో ఇడ్లీ, దోశ పిండి లేదా? అయితే కప్పు బియ్యంతో మల్లెపూవు లాంటి మెత్తని నీర్ దోశ చేసుకోండిలా! -
చూస్తేనే నోట్లో నీళ్లూరుపోయే హెల్తీ రాగి బిస్కెట్లు..ఓవెన్ లేకుండానే ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నార్త్ కర్ణాటక స్టైల్ కొబ్బరి చట్నీ.. బోండా,గారె, ఇడ్లీ, దోసెలతో తింటుంటే ఆ మజానే వేరే లెవల్! -
పిచ్చిమొక్క అనుకోకండి.. ప్రయోజనాలు తెలిస్తే పిచ్చెక్కిపోతారు! -
సెప్టెంబర్ లో ఈ 6 రాశులపై లక్ష్మీదేవి కృప..ఊహించని ధనలాభం, అద్భుత విజయాలు -
నోరూరించే సగ్గుబియ్యం పాప్స్..ఉపవాసాల సమయంలో ఎనర్జీ ఇచ్చే బెస్ట్ స్నాక్ -
ఆరోగ్యానికి అమృతం..గ్యాస్, ఉబ్బరం మాయం చేసే కొండ ప్రాంతపు పచ్చ ఉప్పు..వేడి అన్నంతో స్వర్గమే!
విదురుడు తుది శ్వాస వరకు నిజాయితీనే నమ్మాడు, మహాభారతంలో ఇలాంటి పాత్ర మరొకటుండదు
ధృతరాష్ట్రుడు అంధుడుకావడంతోనే అతనికి అన్ని రకాలుగా అండగా నిలిచి రాజ్యపాలనతో సలహాలిస్తాడు విదురుడు. "ఒంటిరిగా ఉండడం, ఒంటిరిగా ఆలోచించడం, ఒక్కడే తినడం, ఒక్కడే ప్రయాణాలు చేయడం అనేది అస్సలు మంచిది కాదు.
మహాభారతంలో చాలా పాత్రలకు చాలా ప్రత్యేకతలున్నాయి. అలాగే విదురుడు పాత్రకు ఒక ప్రత్యేకత ఉంది. ఇతను ప్రణాళికలకు చాలా పేరుంది. వ్యూహరచనలో, నీతిలో మంచి పేరు సంపాదించాడు విదురుడు.
విదురుడు ఎక్కువగా నిజాయితీ పక్షాన నిలబడాలి అనుకునేవాడు. కురుక్షేత్ర యుద్ధం సమయంలో విదురుడి నుంచి సలహాలు కోరాడు ధృతరాష్ట్రుడు. విదురుడు తండ్రి కృష్ణద్వైపాయన వ్యాసుడు. విచిత్రవీర్యుడి భార్యా అయిన అంబిక దాసికి విదురుడు పుట్టాడు.

విదురుడి పుట్టుక
విదుడు ధృత రాష్ట్రుడికి తమ్ముడు అవుతాడు. అయితే అంధుడు కావడంతో ధృతరాష్ట్రుడికి మొదట రాజ్యం అప్పగించలేదు. పాండురాజు మరణించాక ధృతరాష్ట్రుడికి రాజ్యాధికారం వస్తుంది. వాస్తవానికి అప్పుడు విదురుడికి బాధ్యతలు అప్పగించాలి కానీ విదురుడి పుట్టుక వెనుకున్న కథ వల్లే అతనికి రాజ్యాధికారం రాలేదు.

దాసికి పుడతాడు
అంబికకు గుడ్డివాడు పుడతాడని వాళ్ల అత్తకు తెలుస్తుంది. దీంతో ఆమె మళ్లీ కోడల్ని వ్యాసమహర్షి దగ్గరకు పంపాలనుకుంటుంది. కానీ వ్యాసుడి వేషధారణ చూసి భయపడిన ఆ కోడలు తన దాసికి అసలు విషయం చెబుతుంది. దయచేసి నా కోరిక మన్నించి ఆ వ్యాసుడి దగ్గరకు నువ్వు వెళ్లు అని కోరుతుంది. తన మాదిరిగానే వేషం వేసి దాసిని వ్యాసుడి దగ్గరకు పంపుతుంది. ఆమె వ్యాసుడు చెప్పినట్లు శ్రద్ధగా అతనికి సహకరిస్తుంది.
దీంతో ఎంతో జ్ఞానం కలిగిన విరుదుడు దాసికి జన్మిస్తాడు.
ఎంతో జ్ఞానం ఉన్నా కూడా దాసికి పుట్టాడని అతనికి రాజ్యాన్ని అప్పగించలేదు. అయినా విదురుడు కూడా రాజ్యం కోసం ఎప్పుడూ ఆశపడలేదు. ధృత రాష్ట్రుడికి మంత్రిగా ఉంటూ తన సేవలు అందిచాడు.

దుర్యోధనుడి జాతకం
అయితే ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడు పుట్టగానే విరుదుడు అతని జాతకం మొత్తం అన్నకు చెబుతాడు. అన్నా.. దుర్యోధనుడు మన వంశాన్ని నాశనం చేసేస్తాడు.. ఇతనికి అధికారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదని చెబుతాడు. కానీ ధృతరాష్ట్రుడు కొడుకంటే అమితమైన ప్రేమ ఉండడం వల్ల విరుదుడి మాట అస్సలు లెక్కచెయ్యడు. ఇక ధృతరాష్ట్రుడు ధర్మరాజుని జూదానికి పిలుచుకురావడానికి కూడా విదురుడినే వాడుకుంటాడు. విదురుడంటే ధర్మరాజుకు ఎంతో నమ్మకం.

ఒక రాజు ఎలా ఉండాలి
ఇక ధృతరాష్ట్రుడు అంధుడుకావడంతోనే అతనికి అన్ని రకాలుగా అండగా నిలిచి రాజ్యపాలనతో సలహాలిస్తాడు విదురుడు. ధృతరాష్ట్రుడికి ఏ కష్టం వచ్చినా సరే మొదట విదురునితోనే చెప్పుకునేవాడు. విదురుడు కూడా ధృతరాష్ట్రుడికి ఒక రాజు ఎలా ఉండాలో, అతని గుణాలు ఎలా ఉండాలో ఎన్నో సార్లు వివరిస్తాడు. విదురుడి నీతి సూత్రాల్లో కొన్ని....
"ప్రతి మనిషి కూడా సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి కానీ చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. ఇతరుల విషయంలో ఎప్పుడూ ఈర్ష్య ఉండకూడదు. పొగడ్తలకు ఎప్పుడూ కూడా పొంగిపోకూడదు. పాలించే వాణ్ని, దేవుణ్ని, భార్యను, బంధువులను నిర్లక్ష్యం చేస్తే కచ్చితంగా అశుభాలే ఎదురవుతాయి. తెలివి తక్కువ వాళ్లు ఏం చేస్తారంటే... తమను ఎక్కువగా ఇష్టపడే వారిపై ద్వేషం పెంచుకుంటారు. తమను ఎక్కువగా ద్వేషించేవారిపై ఇష్టం పెంచుకుంటారు."

క్షమాపనకు మించినది లేదు
"ఒంటిరిగా ఉండడం, ఒంటిరిగా ఆలోచించడం, ఒక్కడే తినడం, ఒక్కడే ప్రయాణాలు చేయడం అనేది అస్సలు మంచిది కాదు. ఈ ప్రపంచంలో క్షమాపనకు మించినది ఇంకొకటి లేదు. ఇతరు స్త్రీల పట్ట వ్యామోహం ఉండకూదు. మద్యపానం, ఇతరులను అనవసరంగా ఆడిపోసుకోవడం వంటివి అస్సలు చేయకూడదు"

పాండువులకు సహకరించాడనే కారణంతో
"మిత్రుడిని ద్వేషించకూడదు. అలాగే ఎవరి శ్రేయస్సు అయితే మనం కోరుకుంటామో వాళ్లకు మంచి చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. చావు బతుకుల్లో ఉన్నా కూడా ధర్మాన్ని వీడకూడదు. విదురుడు బతికినంత కాలం నీతి, నిజాయితీలనే నమ్మాడు."
పాండువులకు సహకరించాడనే కారణంతో ఒకసారి దృతరాష్ట్రుడు విదురుడిని తన దగ్గర నుంచి వెళ్లిపొమ్మని కోప్పడుతాడు. కానీ విదురుడు వెళ్లిపోగానే మరుక్షణమే మళ్లీ పిలుపించుకుంటాడు. విదురుడి లేకుండా ధృతరాష్ట్రుడు ఒక్క క్షణం కూడా ఉండలేకపోయేవాడు.



Click it and Unblock the Notifications