Latest Updates
-
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్!
శ్రీవారి బ్రహ్మోత్సవాల గురించి మీకు తెలియని కొన్ని వాస్తవాలు..
‘శ్రీవారు‘ అనగానే మనకు టక్కున గుర్తుకొచ్చే దేవుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామినే.
తిరుమల శ్రీవారి సన్నిధిలో బ్రహ్మోత్సవ సంబరాలు బ్రహ్మాండంగా ప్రారంభమయ్యాయి. సంవత్సరం పొడవునా ఉత్సవాలు, ఊరేగింపులతో భక్త కోటిని అనుగ్రహించే ఏడుకొండల స్వామి వారికి సంవత్సరంలో ఒక్కసారి నిర్వహించే బ్రహ్మోత్సవాలకే ఎందుకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు?

కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీమన్నారాయణుడి బ్రహ్మ్సోత్సవం వెనుక అసలు అసలు చరిత్ర ఏంటి? తిరుమల పుణ్యక్షేత్రంలో ఎప్పటి నుంచి ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఉత్సవాలకు ఈ పేరు ఎలా వచ్చింది అనే విశేషాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

1) కలియుగ వైకుంఠం..
తిరుమలేశ, శ్రీ వేంకటేశ, శ్రీనివాస, లార్డ్ బాలాజీ, వెంకన్న స్వామి అని శ్రీవారిని రకరకాల పేర్లతో పిలుస్తారు. ‘శ్రీవారు‘ అనగానే మనకు టక్కున గుర్తుకొచ్చే దేవుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామినే. ప్రపంచంలో ఎన్ని హిందూ దేవాలయాలు ఉన్నప్పటికీ ‘కలియుగ వైకుంఠం‘ అనే ప్రాశస్త్యం మాత్రం ఒక్క తిరుమల పుణ్యక్షేత్రానికే దక్కింది. నాటి నుండి నేటి వరకు ప్రపంచంలో అతి పెద్ద దేవాలయాలలో ఇప్పటికీ ప్రముఖ స్థానంలో కొనసాగుతోంది.

2) భిన్నమైన భావనలు..
ధనుర్మాసంలో బిల్వపత్రాలతో స్వామివారికి అర్చన జరుగుతుంది. కాబట్టి స్వామివారు శివుడి అవతారమని కొందరు భావిస్తారు. పద్మ పీఠంపై వెలిశాడు కాబట్టి బ్రహ్మదేవుడి అంశ అని మరికొందరి నమ్మకం. ఆనంద నిలయానికి నలుదిక్కులా సింహ ప్రతిమలు, ‘బాలాత్రిపుర సుందరి‘ అని ధ్వనించే బాలాజీ పేరు వారి వాదనను సమర్థించే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. కానీ వాస్తవానికి పసుపు మొదలగు సుగంధ ద్రవ్యాలతో జరిగేది శ్రీవారి వక్షంపై కొలువున్న శ్రీ మహాలక్ష్మీకి.

3) చరిత్రలో..
పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుపై అలకతో వైకుంఠం విడిచి భూలోకం వచ్చిన లక్ష్మీదేవిని వెతుక్కుంటూ విష్ణుమూర్తి సప్తగిరుల్లోని వారాహ క్షేత్రానికి సమీపంలోని ఎత్తైన కొండపై మొదటగా కాలు మోపాడు. అలా 17 కోట్ల సంవత్సరాలకు పూర్వం వైకుంఠం విడిచి భూలోకం చేరుకున్న మహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరసా్వమి అవతారంలో అర్చవాతారమూర్తిగా సాలిగ్రామ శిలారూపంగా వెలసినట్లు తిరుమల స్థలపురాణం చెబుతోంది. అలా స్వామి వారు ఏడుకొండలపై శ్రీనివాసుడిగా వెలసిన శుభముహుర్తాన్ని పురస్కరించుకుని అవతారోత్సవాలుగా ప్రతి ఏటా శ్రీవారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు చెబుతున్నారు.

4) సమస్త భూమండలానికి అధిపతి..
ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం కన్యా మాసంలో, చంద్రమానం ప్రకారం అశ్వీయుజ మాసంలో స్వామివారు తిరుమల క్షేత్రంపై అడుగుపెట్టిన శ్రావణ నక్షత్రం రోజుతో ముగిసే విధంగా తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. స్వామివారు భూలోకంలో శ్రీ వేంకటేశ్వరస్వామిగా అవతరించి సమస్త భూమండలానికి అధిపతియై ఎల్లవేళలా రక్షిస్తున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఇంతటి గొప్ప తిరుమల పుణ్యక్షేత్రంలో వైశానస ఆగమోక్షంగా స్వామివారికి నిత్య ఉత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి.

5) చారిత్రక ఆధారాలు..
బ్రహ్మోత్సవాలు నిర్వహించడం వల్ల స్వామి వారి శక్తి తేజోవంతంగా మారి మరింత కరుణామూర్తిగా మారి కోట్లాది మంది భక్తులను కాపాడతారని పురాణాలు, శాస్త్రాలలో పేర్కొనబడింది. బ్రహ్మదేవుడు ప్రారంభించిన ఈ ఉత్సవాలను కాలక్రమేణా ఎందరో రాజులు, మహారాజులు, రాణులు తమ విజయపరంపరకు సూచికగా నిర్వహించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.

6) బ్రహ్మోత్సవాల సమయంలో..
బ్రహ్మోత్సవాల సమయంలో అంటే ఈ నవరాత్రుల సమయంలో తిరుమలలో ప్రతిరోజూ ఉదయం, రాత్రి శ్రీవారి ప్రతిరూపమైన మలయప్పస్వామి వారు ఊరేగే వాహనాలు ఉత్తమోత్తమైన స్వరూపాలని అర్చకులు చెబుతారు. వాహన సేవలకు అగ్రపధాన నిరాకార రూపంలో బ్రహ్మ అధిష్టించిన బ్రహ్మరథం సాగగా, గజ, తురగ, అశ్వబలాలు వెనుక నడువగా, అబ్బురపరిచే కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల నడుమ స్వామివారు వివిధ వాహనాలపై నాలుగు మాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు.

7) మలయప్పస్వామిగా..
మూల విరాట్టు స్వయంభువు అయిన సాలగ్రామ శిలామూర్తి. మలయప్ప స్వామి సప్తగిరుల్లో స్వయం వ్యక్తమైన పంచలోహమూర్తి. భక్తులకు తన దగ్గరికి పిలిచి దర్శనమిచ్చే వాడు ధ్రువమూర్తి. భక్తులకు దగ్గరగా వచ్చి అనుగ్రహించే స్వామి యొక్క ఉత్సవమూర్తి అయిన మలయప్పస్వామి అని పురాణాల్లో చెప్పబడింది. ఈ పావన సంచారమూర్తి ఆనంద నిలయంలో విచ్చేసి ఉన్నప్పుడే ధ్రువమూర్తికి అంటే మూలవిరాట్టుకు నివేదనలు జరుగుతాయి.

8) ఏయే సేవలంటే..
ఈ ఏడాది సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 8వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 30న ఉదయం ధ్వజారోహణం, రాత్రి పెద్ద శేష వాహనంపై ఊరేగింపుతో ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఆరోజు నుండి వరుసగా శ్రీవారు భక్తులకు వివిధ రూపాల్లో దర్శనమిస్తారు. అక్టోబర్ 1వ తేదీన ఉదయం చిన్నశేషవాహనంపై, రాత్రి హంస వాహనంపై, అక్టోబర్ 2వ తేదీన ఉదయం సింహ వాహనంపై, రాత్రి మత్స్యపుపందరి వాహనంపై, 3వ తేదీన కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం, 4వ తేదీన మోహినీ అవతారం, గరుడ వాహనం, 5న హనుమంత వాహనసేవ, గజవాహన సేవ, 6న సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, 7న రథోత్సవం, అశ్వ వాహన సేవ, ఇక చివరి రోజు అయిన 8వ తేదీ ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.



Click it and Unblock the Notifications











