Latest Updates
-
పరగడుపునే గ్లాస్ నీళ్లతో ఒక స్పూన్ తీసుకుంటే చాలు.. మలబద్ధకం సమస్య పరార్.! -
మీరు మీ జీవిత భాగస్వామిని నిజంగా ప్రేమిస్తున్నారా.. ఈ ప్రశ్నలతో చెక్ చేసుకోండి.! -
వర్షాకాలంలో ఇంట్లో చీమల బెడద.. ఈ ఆయుర్వేద చిట్కాలతో ఇట్టే తరిమేయండి.! -
సండే స్పెషల్.. మిరియాల ఘాటుతో నోరూరించే స్పైసీ లెమన్ చికెన్ స్టార్టర్.! -
మేకప్ తర్వాత మీ ముఖం మరింత అందంగా కనిపించాలంటే.. ఏ బ్లషర్ ఎంచుకోవాలో తెలుసా.? -
నాలుగు నెలల తర్వాత ఖమేనీ అంత్యక్రియలు.. మృతదేహాన్ని ఎంతకాలం భద్రపరచొచ్చు.? -
మీ భోజనంలో ఈ ఒక్క లోపంతో ఇన్ని సమస్యలా.. బలహీనమైన జుట్టు, గోళ్లకు ఇదే కారణం.! -
రోడ్ సైడ్ టిఫిన్ సాంబార్..ఏం రుచిరా బాబు కేక అంతే..10 నిమిషాల్లో మీ ఇంట్లో చేసుకోండిలా.. -
కన్ను అదురుతుందని ఇలా చేస్తున్నారా.. అసలు కారణం తెలిస్తే ఈ తప్పులు చేయరు.! -
డాక్టర్ సలహా..షుగర్ ఉన్నవారు తప్పకుండా తినాల్సిన 3 కూరగాయలు, 3 పండ్లు..
Varalakshmi Vratham 2022:వరలక్ష్మీ వ్రతం సమయంలో ఏ పనులు చేయాలి... ఏమి చేయకూడదు..
2022లో వరలక్ష్మీ వ్రతం సందర్భంగా చేయాల్సిన మరియు చేయకూడని పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హిందు సంప్రదాయం ప్రకారం శ్రావణ మాసం అంటే పండుగల మాసంగా పరిగణిస్తారు. ఈ నెలలో హిందువుల ఇళ్లలో అంతా పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. తమ కుటుంబ శ్రేయస్సు కోసం మహిళలు అనేక రకాల వ్రతాలు చేస్తుంటారు.

ముఖ్యంగా తమ భర్త క్షేమం కోసం చేసే మంగళ గౌరీ వ్రతంతో పాటు కుటుంబం మొత్తం ఐశ్వర్యారోగ్యాలతో జీవించాలని, కష్టాలన్నీ తొలగిపోవాలని కోరుకుంటూ శ్రావణ శుక్రవారం(Friday)రోజున వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటారు. ఈ వ్రతానికి మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాధాన్యత ఉంది. ఈ సందర్భంగా వరలక్ష్మీ వ్రతం రోజున ఏయే పనులు చేయాలి.. ఏయే పనులు చేయకూడదనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...


వ్రతం చేసే రోజు..
వరాలిచ్చే తల్లినే వరలక్ష్మీ దేవత అని అంటారు. శ్రావణ మాసంలో శుక్ల పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చేయడం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో తమ ఇంటికి సకల సౌభాగ్యాలు కలగాలని కోరుకుంటూ ఆడవారు చేసే వ్రతం ఇది. ఈరోజున ఉదయాన్నే తలస్నానం చేసి.. ఉతికిన బట్టలను ధరించి పూజ గదిని శుభ్రం చేయాలి. ఈరోజంతా ఉపవాసం ఉండాలి.

అమ్మవారి అలంకరణ..
వరలక్ష్మీ వ్రతానికి ముందు అమ్మవారి విగ్రహాన్ని అలంకరించాలి. అనంతరం కలశ స్థాపన చేయాలి. ముందుగా విఘ్ణేశ్వరుని పూజ, కలశ పూజ, కంకణ పూజ చేయాలి. ఆ తర్వాత అష్టోత్తర శతనామవళి చదివి.. వరలక్ష్మీ వ్రతం కథ చెప్పుకోవడం ప్రారంభించాలి.

వరలక్ష్మీ దేవతను..
అనంతరం పూజను ప్రారంభించాలి. తర్వాత అష్టలక్ష్ములందరూ కలిసిన రూపమైన వరలక్ష్మీ దేవతను పూజించాలి. ఇలా పూజించడం వల్ల తమ కుటుంబం మొత్తానికి ఆరోగ్యం, శాంతి, ప్రేమ, చదువు, ఐశ్వర్యం, పేరు ప్రఖ్యాతలు, ఆనందం.. వంటివన్నీ అందుతాయని భక్తుల నమ్మకం.

పూజ పూర్తయ్యాక..
వ్రతం సమయంలో నేవైద్యాలు అర్పించి.. చేతికి కంకణం కట్టుకుని.. అక్షింతలు తలపై వేసుకొని పూజను పూర్తి చేయాలి. ఆ తర్వాత ముత్తైదువులందరికీ తాంబూలాలు ఇచ్చి తీర్థ ప్రసాదాలు ఇవ్వాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని ఆరోజే తినేయాలి. అలాగే రాత్రి వరకూ ఉపవాసం ఉండాలి. ఇంతకన్నా ఈ వ్రతానికి పెద్దగా నియమనిష్టలంటూ ఏమీ లేవని పండితులు చెబుతున్నారు.

భక్తి శ్రద్ధలతో..
అయితే వరలక్ష్మీ వ్రతం చేసే సమయంలో అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించాలి. వరాలిచ్చే తల్లి వరలక్ష్మీ కాబట్టి.. ఈ వ్రతం మనసు నిండా భక్తితో చేస్తే చాలు.. సకల శుభాలు కలుగుతాయి. అంతేకాదు ఈ వ్రతం చేసినప్పుడు లేదా ఈ వ్రతాన్ని చూసినా.. వ్రత కథ చదివినా కూడా అష్టఐశ్వర్యాలు, ఆరోగ్యభాగ్యాలు కలుగుతాయని చాలా మంది నమ్ముతారు. అదే విధంగా కొందరు అమ్మవారి అలంకరణను విభిన్నంగా చేస్తూ విశేష పూజలు చేస్తుంటారు. అయితే అలా చేయలేని వారు కేవలం కలశం పెట్టుకుని పూజించినా సరే.. అవే ఫలితాలొస్తాయి.

ఇలా చేయొద్దు..
వరలక్ష్మీ వ్రతం రోజున మనసులో ఏదో విషయం గురించి ఆలోచిస్తూ.. పరధ్యానంలో ఉంటూ పూజ చేయకూడదు.
అలా చేస్తే మీరు ఎంత అలంకరణ చేసి.. ఎన్ని నైవేద్యాలు సమర్పించినా మీరు కోరుకున్న కోరికలు నెరవేరవు. ఈరోజున మధ్యాహ్నం వేళ నిద్రపోకూడదు. రాత్రి వేళలో కూడా అన్నం తినరాదు. ఏదైనా పళ్లరసం మాత్రమే తాగాలి. ఈరోజు భాగస్వామితో శారీరకంగా ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదు.



Click it and Unblock the Notifications