Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
తమిళనాడులోని ఆలయాలు దర్శించుకున్న రాజమౌళి, ఆ దేవాలయాల ప్రత్యేకతలేంటో తెలుసా?
బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి. ఈ రెండు సినిమాలతో ఆయన క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ రావడంతో రాజమౌళి ఖ్యాతి ప్రపంచానికి చాటి చెప్పినట్లయింది.
ఈ అగ్ర దర్శకుడు తన కలను తాజాగా నెరవేర్చుకున్నారు. భార్య రమా రాజమౌళి, కొడుకు, కోడలు, కూతురు, మరికొంత మంది ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఈ ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లారు రాజమౌళి. తమిళనాడులోని ప్రముఖ దేవాలయాలు సందర్శించారు. అలాగే బీచ్, రిసార్ట్స్ లలో తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేశారు.

తమిళనాడులోని దేవాలయాలు వద్ద, ఇతర ప్రాంతాల్లో దిగిన ఫోటోలను అన్నింటిని కలిపి ఓ వీడియాలా మార్చి దాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు జక్కన్న. చాలా కాలంగా సెంట్రల్ తమిళనాడులో రోడ్ ట్రిప్ చేయాలని అనుకున్నట్లు చెప్పుకొచ్చారు. తమిళనాడులోని దేవాలయాలను సందర్శించాలనుకునే నా కుమార్తె ఆలోచనకు చాలా థ్యాంక్స్ అంటూ చెప్పుకొచ్చారు.
రాజమౌళి తన కుటుంబసభ్యులతో కలిసి శ్రీరంగం, దారాసురం, బృహదీశ్వర కోయిల్, రామేశ్వరం, కణాదుకథాన్, తూత్తుకుడి, మధురైకి వెళ్లారు. ఆ దేవాలయాల్లోని అద్భుతమైన వాస్తు శిల్పాన్ని, అద్భుతమైన ఇంజినీరింగ్ పనితనాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ లో పేర్కొన్నారు.
శ్రీరంగం:
ఉభయ కావేరీ నదుల మధ్య ఉన్న శ్రీరంగం ఉంటుంది. ఈ ఆలయంలో శ్రీవిష్ణుమూర్తి స్వయంభువుగా అవతరించినట్లు చెబుతారు. ఏడు ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆలయంలో అడుగడుగునా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది శ్రీరామానుజాచార్యుల వారి శరీరం. శ్రీరామనుజాచార్యుల వారు పరమపదించి వెయ్యి సంవత్సరాలు పూర్తయినా నేటికీ ఆయన శరీరాన్ని అక్కడే భద్రపరిచి ఉండటం గమనార్హం. అయితే దీని గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.
దారాసురం:
పరమేశ్వరుడు వెలసిన మహాక్షేత్రమే తమిళనాడులోని దారాసురం. ఇక్కడ శువుడు ఐరావతేశ్వర స్వామిగా పూజలు అందుకుంటాడు. ఇక్కడి యమతీర్థ కోనేరు ఎంతో విశిష్టమైనది. రాజరాజచోళుడు నిర్మించి, ఇక్కడి శివలింగాన్ని పూజించేవాడు. అమ్మవారు దేవనాయకిగా కొలువుదీరారు. ఈ దారాసురం దేవాలయం యునెస్కో గుర్తించిన వారసత్వ కట్టడాల జాబితాలోని గ్రేట్ లివింగ్ చోళ టెంపుల్స్ లో ఇదీ ఒకటిగా. అద్భుతమైన నిర్మాణ శైలి దారాసురం దేవాలయం ఆలయం సొంతం.
బృహదీశ్వర కోయిల్:
బృహదీశ్వర ఆలయం, పెరువుదైయార్ కోయిల్ ప్రాచీన హిందూ దేవాలయం. తంజావురులో ఉందీ ఆలయం. దీనిని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారు. యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు అందుకుంది. ఇందులోని శిల్ప కళా వైభవం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
రామేశ్వరం :
రామేశ్వరంలోని చాలా ప్రాంతాలు రామాయంతో ముడిపడి ఉన్నాయి. రామేశ్వరంలోపలికి వెళ్లాలంటే ఇక్కడ ఉన్న బ్రిడ్జి దాటాల్సి ఉంటుంది. శ్రీరాముడు లంకకు వెళ్లేటప్పుడు వానరసేనతో కలిసి ఈ బ్రిడ్జ్ దాటడానికి రాళ్లు వేసివెళ్లినది ఇక్కడే. దీన్ని లక్ష్మణ తీర్థ, రామ తీర్థ అని పిలుస్తారు. బాణాలను గ్రౌండ్ లోకి విసిరిన ప్రాంతాన్ని కోడి తీర్థ అని, రాముడు తన జుట్టుని శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించిన ట్యాంక్ ని జట తీర్థ అంటారు.
మీనాక్షి సుందరేశ్వర ఆలయం, కణాదుకథన్:
మీనాక్షి సుందరేశ్వర ఆలయం తమిళనాడు శివగంగ జిల్లాలోని కణాదుకథన్ లో ఉంటుంది. స్వామి వారిని సుందరేశ్వర్ అని, అమ్మవారిని మీనాక్షి అని పిలుస్తారు. ఈ ఆలయం 3 అంచెల రాజగోపురంతో తూర్పు ముఖంగా ఉంటుంది.
శ్రీ వైకుంఠం, తూత్తుకుడి:
తూత్తుకుడిలో చాలా ఆలయాలు ఉన్నాయి. అందులో ప్రముఖమైనది శ్రీవైకుంఠం దేవాలయం. అత్యంత అందమైన దేవాలయం ఇది. దేశంలోని అత్యంత ప్రముఖ శ్రీవిష్ణు దేవాలయాల్లో ఇదీ ఒకటి.
మధురై మీనాక్షి ఆలయం:
మధురై, చారిత్రక ప్రాధాన్యత కలిగిన నగరం, తమిళనాడులోని వైగై నది ఒడ్డున ఉంది. ఇక్కడ మీనాక్షి అమ్మ ఆలయం పార్వతి రూపానికి అంకితం చేయబడింది. ఇది మాత దేవత యొక్క అత్యంత పవిత్రమైన దేవాలయాలలో ఒకటి. ఇక్కడి దేవత ఆమె కుడి చేతిలో కూర్చున్న ఒక వస్త్రంతో సంబంధం కలిగి ఉంటుంది. మరియు తల్లి మెరిసే డైమండ్ ముక్కు రింగ్ భక్తులను మంత్రముగ్దులను చేస్తుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications











