Latest Updates
-
మై బ్రదర్, మై సూపర్ హీరో..మీ సోదరుడికి రాఖీ విషెస్ చెప్పండిలా -
టేస్టీ అండ్ క్రంచీ స్నాక్ ..కరకరలాడే శనగపిండి మసాలా పల్లీలు ఇలా చేసుకోండి -
తెల్ల ఇడ్లీ కాదు..అసలైన శక్తి ఉన్న నల్ల ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
నేపాల్ ను వణికించిన జలప్రళయం.. వరదల్లో చిక్కుకుంటే ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి? -
Budha nakshatra gochar 2026 : పూర్వఫల్గుణి నక్షత్రంలోకి బుధుడు..ఆగస్టు 29 నుంచి ఈ 4 రాశులకు అగ్నిపరీక్షే! -
ఇంట్లో ఇడ్లీ, దోశ పిండి లేదా? అయితే కప్పు బియ్యంతో మల్లెపూవు లాంటి మెత్తని నీర్ దోశ చేసుకోండిలా! -
చూస్తేనే నోట్లో నీళ్లూరుపోయే హెల్తీ రాగి బిస్కెట్లు..ఓవెన్ లేకుండానే ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నార్త్ కర్ణాటక స్టైల్ కొబ్బరి చట్నీ.. బోండా,గారె, ఇడ్లీ, దోసెలతో తింటుంటే ఆ మజానే వేరే లెవల్! -
పిచ్చిమొక్క అనుకోకండి.. ప్రయోజనాలు తెలిస్తే పిచ్చెక్కిపోతారు! -
సెప్టెంబర్ లో ఈ 6 రాశులపై లక్ష్మీదేవి కృప..ఊహించని ధనలాభం, అద్భుత విజయాలు
అష్టైశ్వర్యాలు సిద్ధించాలంటే.. ఏ నూనెతో దీపం చేయాలి ?
ప్రతి ఇంట్లో రోజూ దీపం చేస్తాం. ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం భారతీయుల సంప్రదాయం. ఏ పండుగ వచ్చినా.. ఏ శుభకార్యం జరిగినా.. దేవాలయానికి వెళ్లి దీపం పెట్టడం కూడా.. ఒక సంప్రదాయం ఉంది. అలాగే కార్తీక మాసం, మాఘమాసాలలో కూడా ఎక్కువగా దీపారాధనకు ప్రాధాన్యత ఇస్తారు. శివుడికి ఎక్కువగా దీపారాధన చేయడం ఆనవాయితీగా మారింది.
READ MORE: కొబ్బరికాయ కొట్టే సంప్రదాయం ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది ?
రోజూ దీపారాధన చేసినా.. కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. మరికొందరకి నియమాలు తెలియకపోవచ్చు. ఏ ప్రమిదలో దీపం వెలిగించాలి.. దీపారాధనకు ఎలాంటి నూనె ఉపయోగించాలి అనే విషయంపై సరైన అవగాహన ఉండదు. అయితే.. నిత్యపూజకు ఎలాంటి ప్రమిదలు వాడాలి ? ప్రత్యేక పూజల సమయంలో ఎలాంటి దీపాలు వెలిగించాలి వంటి సందేహాలను ఈ ఆర్టికల్ ద్వారా నివృత్తి చేసుకుందాం...

దీపం ఎప్పుడు చేయాలి ? ఎలా చేయాలి ?
పంచలోహాలు, వెండి, మట్టితో చేసిన ప్రమిదల్లో దీపం వెలిగించడం శ్రేయష్కరం. అయితే నిత్యపూజకు మట్టి ప్రమిదలు వాడటం మంచిది కాదు. తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య దీపారాధన చేయడం మంగళకరం. సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి, మహాలక్ష్మి దేవిని స్మరించడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయి.
Read more: ఏ వేలితో బొట్టు పెట్టుకోవాలి ? ఎరుపు రంగు తిలకమే ఎందుకు ?

ఏ వైపు దీపం చేస్తే శ్రేయస్కరం:
తూర్పుముఖంగా దీపం వెలిగిస్తే.. గ్రహదోషాలు, కష్టాలు తొలగిపోయి.. సంతోషంగా ఉంటారు. పడమటి వైపు దీపం వెలిగిస్తే.. రుణ బాధలు, శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది. అదే ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే.. సిరిసంపదలు, విద్య, వివాహం వంటివి సిద్ధిస్తాయి. దక్షిణంవైపు దీపారాధన చేయరాదు. దక్షణముఖంగా దీపం వెలిగిస్తే.. అపశకునాలు, కష్టాలు, దుఖం, బాధ కలుగుతాయి.

ఎలాంటి వత్తులు:
దీపారాధనకు తామరకాడతో చేసిన వత్తులు వెలిగిస్తే.. పూర్వజన్మ పాపాలు తొలగిపోయి.. సంతోషంగా జీవిస్తారు. తెల్లటి కొత్త వస్ర్తం మీద పన్నీరు చల్లి, ఎండలో ఆరబెట్టి తర్వాత ఆ వస్ర్తాన్ని వత్తులుగా చేసి దీపారాధన చేసినా.. శుభ ఫలితాలు పొందవచ్చు. అలాగే జిల్లేడు కాయ నుంచి వచ్చిన దూదితో దీపం చేసి వెలికిస్తే.. శ్రేయస్కరం.
Read more: శుక్రవారం ప్రత్యేకతేంటి ? శుక్రవారం పాటించాల్సిన నియమాలేంటి ?

దీపానికి ఏ నూనె మంచిది:
దీపం వెలిగించడానికి ఏ నూనె వాడాలి అనే దానిపై చాలా మంది అయోమయం చెందుతూ ఉంటారు. దీపారాధనకు ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది. లేదంటే.. నువ్వుల నూనె వాడినా శ్రేష్టమే. దీపం వెలిగించడానికి ఆముదం ఉపయోగిస్తే.. దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగుతుంది. విప్ప, వేప నూనెలు, ఆవు నెయ్యి వాడటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. అదే ఆవు నెయ్యి, విప్ప, వేప, ఆముదం, కొబ్బరినూనెల మిశ్రమంతో 48 రోజులు దీపం వెలిగిస్తే.. సకల సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వేరుశనగ నూనెతో దీపారాధన చేయరాదు.



Click it and Unblock the Notifications