Latest Updates
-
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
భాగస్వామి విషయంలో ఈ ఒక్కటి ఆపేస్తే.. ఇక మీ బంధానికి ఎలాంటి ఢోకా ఉండదు.!
భార్యాభర్తలు అన్నాక ఒకరిపై ఒకరికి చాలా ఆలోచనలు ఉంటాయి. భాగస్వామి తన విషయంలో ఇలా ఉండాలంటూ కొన్ని అంచనాలు పెట్టుకుంటారు. కానీ వారి ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగా లేకపోతే మనస్పర్థలు, కలహాలు తలెత్తి ఒక్కోసారి తీవ్ర పరిణామాలకి దారి తీస్తాయి. ఈ క్రమంలో దంపతుల మధ్య బంధం పదిలంగా ఉండాలంటే కొన్ని సలహాలు పాటించడం తప్పనిసరి అని మనస్తత్వ నిపుణులు సూచిస్తున్నారు.

కొన్ని బంధాల్లో భాగస్వామి నుంచి అనుకున్నది సాధించడానికి బెదిరింపులకి పాల్పడుతుంటారు. ఒక్కోసారి గొడవకి దిగుతుంటారు. అయితే ఇది సరైన విధానం కాని నిపుణులు అంటున్నారు. బెదిరించడం, ఫైటింగ్ చేయడం వంటివి ఒకరిపై ఒకరికి ప్రేమ తగ్గిపోయేలా చేస్తాయి. కాబట్టి దంపతుల మధ్య వీటికి ఆస్కారం లేకుండా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు.
భాగస్వామి ఎప్పుడూ తన గురించే ఆలోచించాలని, గంటకోసారి ఫోన్ చేయాలని, బిజీగా ఉన్నా తన అభిరుచులను, ఇష్టాయిష్టాలను పట్టించుకుంటూ తనకోసం మాత్రమే సమయంలో కేటాయించాలని అనుకుంటారు. తాము చేసిన పనులకు ప్రశంసలు ఇవ్వాలని ఉవ్విళ్లూరుతుంటారు. తాము చేసే ప్రతి పనినీ గుర్తించాలని ఆరాటపడుతుంటారు. ఇదే బెగ్గింగ్ ఫర్ అటెన్షన్. ఈ విషయంలో అసంతృప్తి ఎదురైతే భాగస్వామి దగ్గర ప్రస్తావించి తమ అసహనాన్ని ప్రదర్శిస్తుంటారు. అయితే ఇలా చేయడం ద్వారా బంధంలో చిరాకులు మొదలవుతాయని నిపుణులు అంటున్నారు. భాగస్వామి వద్ద అటెన్షన్ కోసం అడుక్కోవద్దని సూచిస్తున్నారు.

కుటుంబ విషయాలు కానీ, ఇతర విషయాలు కానీ ఏవైనా గొడవలు తలెత్తితే దాని గురించి పదే పదే భాగస్వామి వద్ద ప్రస్తావిస్తుంటారు. తన తప్పేమీ లేదని నిరూపించుకోవడానికి ఓవర్‌గా వివరిస్తూ ఉంటారు. అవతల వ్యక్తి వింటున్నా వినకపోయినా తమ ధోరణి తమదే అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి సంఘటనలు దంపతుల మధ్య అనురాగాన్ని దెబ్బతీస్తాయని.. అనవసర విషయాలు కాకుండా ప్రేమను పంచే విషయాల గురించి మాట్లాడుకోవాలని సలహా ఇస్తున్నారు.
మొత్తంగా భాగస్వామి వద్ద అటెన్షన్ కోరుకోవాలని తాపత్రయ పడటం, గొడవలు వంటి ప్రతికూలతను తీసుకువచ్చే విషయాలను ప్రస్తావించడం ఆపేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే వీటిని ఆపేయడం ద్వారా భాగస్వామి మారతాడని అనుకోవద్దని చెబుతున్నారు. ఇద్దరి మధ్యా మనశ్శాంతిని, అన్యోన్యతని దూరం చేసే అంశాలను ప్రస్తావించడానికి బదులుగా ఆ సమయాన్ని మీకోసం మీరు కేటాయించుకోవాలని సూచిస్తున్నారు.
మీ విషయంలో భాగస్వామి అటెన్షన్ ఉండాలని పదే పదే కోరుకోవడం, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం, ఎదుటి వ్యక్తి ప్రేమను ఆశించడానికి బదులుగా ఆ సమయాన్ని ముందుగా మీకు మీరు ప్రేమించుకోవాలని, మీ కోసం సద్వినియోగం చేసుకోవాలని అంటున్నారు. నెగిటివ్ ఆలోచనలు ప్రస్తావనకు రాకుండా మీకు నచ్చిన పనులు చేయడం, మిమ్మల్ని మీరు బిజీగా మార్చుకోవడం ద్వారా భాగస్వామిపై ఒత్తిడి తగ్గుతుందని.. ఫలితంగా వారి ఫోకస్ మీపైన పడి అది ప్రేమకి దారితీస్తుందని సూచిస్తున్నారు. దీంతో మీరు కోరుకోకుండానే భాగస్వామే మీతో ప్రేమగా, మీ అంచనాలకి తగిన విధంగా ఉంటారని చెబుతున్నారు.
ఏ బంధమైనా బలవంతంగా సాగకూడదని, ఒకరిపై ఒకరికి నమ్మకం, గౌరవం, ప్రేమ, బాధ్యతల ద్వారా మాత్రమే బలంగా నిలబడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా భాగస్వామి తనపై శ్రద్ధ వహించాలని ఎవరికైనా ఉంటుంది. కానీ అది పరిమితులు దాటి, బలవంతంగా మారకూడదని అంటున్నారు. దంపతుల మధ్య అన్యోన్యనతను దెబ్బతీసే విషయాల గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ భాగస్వామి వద్ద ప్రస్తావించకుండా ఉండటం ఉత్తమమని.. ఇది మీ బంధాన్ని బలపరుస్తుందని సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications
