Latest Updates
-
ఆగష్టు 28న చంద్రగ్రహణం.. ఈ రాశుల వారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త.! -
ఒక్కసారి ఈ టర్కిష్ టమాటో ఆనియన్ సలాడ్ రుచి చూస్తే..నాలుక నిద్రలేచి నాట్యమాడతది! -
నోట్లో ఇట్టే కరిగిపోయే జ్యూసీ మటన్ తహరీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
తోబుట్టువుల మధ్య గొడవలా.. రాఖీ కట్టేటప్పుడు మీ సోదరుడితో తప్పనిసరిగా ఈ మాట చెప్పండి.! -
ఇతరుల సీక్రెట్స్ తెలుసుకోవడంలో ఈ 3 రాశుల వారే కింగ్స్..వాళ్లవి మాత్రం ముక్క కూడా చెప్పరు! -
చాణక్య నీతి: ఈ నాలుగు పనులు చేసిన తర్వాత స్నానం చేయడం తప్పనిసరి.. లేదంటే.! -
రాఖీ 2026 స్పెషల్: మీ చేతులతో సోదరుడి కోసం కుంకుమపువ్వు పిస్తా మిల్క్ కేక్ ఇలా చేయండి! -
పిల్లల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచే ‘బయోటిన్ డ్రింక్’.. ఒక్క గ్లాసు తాగితే చాలు.. నిమిషాల్లో రెడీ.! -
పోషకభరితమైన, రుచికరమైన దొండకాయ మసాలా రైస్,,లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ రెసిపి ఇది! -
టీ, కాఫీతో హార్మోన్ల సమస్య.. మహిళల్లో గర్భధారణ, సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తుందా.?
శివుడిని చెవిటి మల్లన్నఅని ఎందుకు పిలుస్తారు..?
పూర్వం ఒక రాకుమారి శివున్ని పెండ్లాడాలనుకొని, శివున్ని మల్లె పూవ్వులతోనూ, అర్జున పుష్పాలతోనూ పూజించేది. ఒక రోజు శివుడు ఆమెకు కలలో కనిపించి ఒక తుమ్మేదను చూపించి, అది వాలిన చోట వేచి ఉండాలని , తాను వచ్చి పెళ్లాడతానని చెప్పాడు
ఆమెకి మెలుకువచ్చి, కళ్ళూ తెరువగానే ఒక భ్రమరం ఎగురుతూ కనిపించింది. ఆ తుమ్మెదను అనుసరిస్తూ, శ్రీశైల ప్రాంతములోని అడవిలో ఒక పొదమీద వాలడం చేత అక్కడ శివున్ని ధ్యానిస్తూ నిరీక్షించ సాగింది. ఆ అడవిలోని చెంచులు పాలు, పండ్లు తేనె మొదలగునవి ఆమెకు ఆహారంగా ప్రతి రోజూ ఇచ్చే వారు.

ఒక రోజు పార్వతితో కూడా అక్కడకు శివుడు వచ్చి ఆ రాకుమారిని చూపించి, ఆమె తనను వివాహమాడదలచుకొన్నదని తెలిపాడు . దానికి పార్వతి హేళన చేసింది. శివుడు తన మాటలను నిరూపించదలచి,ఆ రాకుమారి దగ్గరకు ఒక ముసలివాని రూపంలో వెళ్లి, ''రాకుమారి, నీకోసం వెతుకుతూ ముసలివాడినయ్యి, ఇంతకాలానికి నిన్ను చేరాను, నా ముసలి రూపంను లెక్క చేయక, నన్ను విహహామాడుతావా?'' అని అడిగాడు.

అందుకామె ఒప్పుకుని చెంచులు వద్దన్నా వినక, శివుని వివాహమాడింది. చెంచులు కొత్త అల్లుని కోసం మద్య మాంసాలతో విందు ఏర్పాటు చేస్తే శివుడు అలిగి, విందును అంగీకరించుకుండా వెళ్లిపోసాగాడు.

ఆమె శివున్ని మల్లయ్య...ఓ చెవిటి మల్లయ్య ! అగు...నిలబడు అని గట్టిగా పిలిచిన, శివుడు లెక్క చెయ్యకపోయేసరికి, రాయిలాగా మాట్లాడవేమి; అక్కడే లింగంగా మారిపో అని శపించింది.

ముదసలి రూంలో ఉన్న శివుడు అక్కడే లింగంగా మారిపోయాడు. అందుకు పార్వతి రాకుమారిని చూసి, ఓసి! బ్రమరమును వెంబడించి వచ్చిన నీవు తుమ్మెదగా మారిపో అని శపించింది.

దాంతో ఆమె శివుని భార్యగా భ్రమరాంబ నామంతో నిలిచిపోయింది. అందుకనే భక్తులు, ఎప్పటికిని, స్వామిని వృధ్ధ మల్లయ్య, ముసలి మల్లయ్య, చెవిటి మల్లయ్య అని పిలుస్తారు..



Click it and Unblock the Notifications