Latest Updates
-
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్
వర్షాకాలంలో ఇంట్లో ఆ వాసన పోవాలంటే.. ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి.!
వర్షాకాలం వచ్చిందంటే చాలు అప్పటివరకూ ఉన్న వేడి వాతావరణం అంతా ఒక్కసారిగా తేమగా మారిపోతుంది. తేమ పెరిగి ఇంట్లో తడి ఏర్పడుతుంది. ఈ క్రమంలో ఈ తేమ కారణంగా ఇంట్లో ఒకరకమైన వాసన వస్తుంటుంది. ఇది శ్వాసకోశకు ఇబ్బంది కలిగించడమే కాకుండా చిరాకు కలిగిస్తుంది. అందుకే ఈ కాలంలో ఇంటి శుభ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని పద్ధతులా పాటించాల్సి ఉంటుంది.

వర్షాకాలంలో ఇంట్లో ఏర్పడే తేమ కారణంగా కలిగే దుర్వాసనతో చిన్నాపెద్దా ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా వర్షపు నీరు ఇంటి గోడల మీదుగా పారినప్పుడు వాటిపై తేమ ఏర్పడి అక్కడక్కడా లీకేజీ కూడా ఏర్పడుతుంది. ఇంకా కొన్ని ఇళ్లలో సరైన వెంటిలేషన్ లేకపోయినా.. ప్లంబింగ్‌లో అడ్డంకులు ఉన్నా గాలి ప్రసరణ సరిగా లేక తేమ ఏర్పడి దుర్వాసనకి దారి తీస్తుంది.
ఇంకా వర్షాకాలం, చలికాలంతో పోలిస్తే వేసవి కాలంలో దుమ్ము, ధూళి కారణంగా ఇంట్లో బూజు విపరీతంగా ఏర్పడుతుంది. వీటిని సరిగా తొలగించకపోతే తేమ దుర్వాసన మరింత ఎక్కువవుతుంది. అందుకే వర్షాకాలం ఆరంభం అయ్యే ముందే బూజు, దుమ్ము ఏర్పడిన ప్రాంతాలను ముందుగా శుభ్రం చేయాలి. ఇల్లు శుభ్రం చేసేటప్పుడు నీళ్లలో బేకింగ్, నిమ్మరసం వేయడం ద్వారా బూజు వాసన తొలగి దుర్వాసనను నివారిస్తుంది.
ఈ కాలంలో ఇంట్లోకి స్వచ్ఛమైన గాలి ప్రసరించడం చాలా అవసరం. అంతేకాకుండా సూర్యుని వెలుతురు కూడా ఇంట్లోకి ప్రవేశించేలా చూసుకోవాలి. తద్వారా తేమ ఏర్పడే అవకాశాలు చాలా తక్కువ. సరైన వెంటిలేషన్ ఉండటం ద్వారా ఇంట్లోని వేడి గాలి బయటకు వెళ్లిపోయి స్వచ్ఛమైన గాలి ప్రవేశిస్తుంది. మధ్యాహ్నం సమయం కంటే ఉదయం, సాయంత్రం వేళల్లో ఇంటి కిటికీలు తెరిచి ఉంచుకోవాలి.
వర్షాలకు ఇంట్లో తేమ పెరిగి బట్టలు, పరుపులు తడిసిపోతాయి. దీంతో దుర్వాసన విపరీతంగా పెరుగుతుంది. అందుకే రోజూ ఎండ ఉన్న సమయంలో బెడ్‌షీట్లు, పరుపులు కాసేపు బయట ఆరేయాలి. బట్టలు పూర్తిగా ఆరిన తర్వాతే ఇంట్లోకి తీసుకురావాలి. దుస్తులు పెట్టుకనే అల్మారాలు ఎక్కువగా తెరిచి ఉంచేలా చూసుకోవాలి.

ఇళ్లు తుడిచేటప్పుడు నీళ్లలో బేకింగ్ సోడా, నిమ్మరసం కలపాలి. ఫలితంగా బ్యాక్టీరియా నశిస్తుంది. నిమ్మరసం కారణంగా తాజా పరిమళం వెదజుల్లుతుంది. అప్పుడప్పుడూ లీటర్ నీటిలో నిమ్మరసం కలిపి ఇంట్లో గోడలకి, అల్మారాలకు స్ప్రే చేయడం ద్వారా సువాసనతో ఇల్లు ఫ్రెష్‌గా కనిపిస్తుంది.
వర్షాకాలంలో ఇంట్లో ఎక్కడా వాటర్ పైప్స్ నుంచి లీకేజీ లేకుండా చూసుకోవాలి. కిచెన్ సింకుల కింద ఎప్పుడూ తడి లేకుండా ఉండేలా చూడాలి. లేదంటే అక్కడ తడి కారణంగా బ్యాక్టీరియా, పురుగులు వ్యాపించి దుర్వాసనతో పాటు రోగాలకి దారితీస్తుంది. తేమ పట్టే చోట్ల నిరోధక పెయింట్ వేయించడం ఉత్తమం. గోడలకు పగుళ్లు ఏర్పడితే సిమెంట్‌తో మూసివేసేలా చేయడం ద్వారా లీకేజీ సమస్య ఉండదు.
ఈ కాలంలో ఇంట్లో దుర్వాసన తొలగేందుకు బెస్ట్ ఆప్షన్ యాక్టివేటెడ్ చార్‌కోల్. దీనితో కొన్ని చిన్న సంచులను తయారు చేసి వాటిని పత్తి లేదా మస్లన్ క్లాత్‌లో చుట్టాలి. వీటిని ఇంటి చుట్టూ వివిధ ప్రదేశాల్లో ఉండం ద్వారా చెడు వాసన రాకుండా కాపాడుతుంది. ఇంట్లోని తేమ, తడి, దుర్వాసనను ఈ చార్‌కోల్ సమర్థవంతంగా పీల్చుకుంటుంది. దీంతో ఇల్లు పొడిగా ఉండేలా చూస్తుంది. ప్రతి రెండు మూడు రోజులకు ఈ యాక్టివేటెడ్ చార్‌కోల్ సంచులను కాసేపు ఎండలో ఉంచడం మళ్లీ అవి రీఛార్జ్ అవుతాయి. వాటిని రీయూజ్ చేసుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
