Latest Updates
-
ప్రభుత్వ హాస్పిటల్స్ దుస్థితికి ఇదే నిదర్శనం.. ట్రీట్మెంట్ కోసం ప్రైవేట్ హాస్పిటల్ కి ఎయిమ్స్ డైరెక్టర్! -
మెతుకు మిగల్చకుండా తినే రుచి..తమిళనాడు స్పెషల్ దిండిగల్ తలపకట్టి చికెన్ బిర్యానీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
క్రంచీ, టేస్టీ జీడిపప్పు పకోడి..మస్త్ కిక్కిచ్చే స్నాక్ ఈజీగా చేసుకోండిలా.. -
కరివేపాకు మరమరాలు..మూవీ, వెబ్ సిరీస్ చూస్తూ తినడానికి బెస్ట్ టేస్టీ,హెల్తీ స్నాక్ ! -
డీప్ ఫ్రై లేని హెల్తీ స్నాక్..సూపర్ టేస్టీ సగ్గుబియ్యం పొంగనాలు ఈజీగా ఇంట్లో చేసుకోండిలా.. -
ఈ చిన్న సీక్రెట్ తెలిస్తే..ఇంట్లోనే క్షణాల్లో రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ,సాఫ్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ -
వంకాయ దోసకాయ పచ్చడి..ఏంట టేస్ట్ రా బాబు మైండ్ నుంచి పోవట్లేదు అనాల్సిందే! -
తల్లిదండ్రులూ బీ అలర్ట్..పిల్లలకు సిరప్ వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి -
భూటాన్ స్పెషల్ ఎగ్ ఏమా దత్షీ..స్వర్గానికి బెత్తెడే దూరం! -
పండుగ రోజే దారుణం..భర్త డోర్ ఓపెన్ చేయగానే ప్రియుడితో సరసాలాడుతూ భార్య..రెండ్ హ్యాండెడ్ గా దొరకడంతో..
త్వరగా ప్రెగ్నెన్నీ రావాలంటే..భార్యాభర్తలు తప్పక తినాల్సిన ఫ్రూట్ ఏది?
తల్లిదండ్రులు కావాలనేది ప్రతి దంపతుల జీవితంలో ఒక అందమైన కల. పెళ్లయిన తర్వాత పండంటి బిడ్డను చేతుల్లోకి తీసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ, ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితం, మారిన జీవనశైలి, మానసిక ఒత్తిడి, పోషకాహార లోపం వంటి కారణాల వల్ల చాలా మందికి ప్రెగ్నెన్సీ రావడం ఆలస్యం అవుతోంది.

సాధారణంగా ప్రెగ్నెన్సీ త్వరగా రావాలంటే.. మహిళల్లో ఆరోగ్యకరమైన అండం, పురుషుల్లో నాణ్యమైన వీర్యం ఉండటం చాలా ముఖ్యం. ఈ రెండింటినీ అద్భుతంగా మెరుగుపరిచి, సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచే ఒక అద్భుతమైన పండు మన ప్రకృతిలో ఉంది. అదే ఎర్రగా నిగనిగలాడే దానిమ్మ.
దానిమ్మ పండు కేవలం రుచికి మాత్రమే కాదు, రీప్రొడక్టివ్ హెల్త్ (సంతానోత్పత్తి ఆరోగ్యం) ను మెరుగుపరచడంలో ఇది ఒక "సూపర్ ఫ్రూట్" లా పనిచేస్తుంది. ఇందులో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని అండాలను, వీర్యకణాలను ఫ్రీ రాడికల్స్ (Free radicals) వల్ల జరిగే నష్టం నుంచి కాపాడి, వాటి నాణ్యతను పెంచుతాయి. భార్యాభర్తలు ఇద్దరూ రోజూ దానిమ్మను ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..
పురుషుల్లో ఫెర్టిలిటీ ప్రయోజనాలు
సంతానలేమి సమస్యలతో బాధపడే పురుషులకు దానిమ్మ ఒక దివ్యౌషధం అని చెప్పవచ్చు.
స్పెర్మ్ కౌంట్ పెరుగుదల: దానిమ్మ రసం తాగడం వల్ల పురుషులలో వీర్యకణాల సంఖ్య (Sperm Count) గణనీయంగా పెరుగుతుంది.
మెరుగైన క్వాలిటీ: ఆరోగ్యకరమైన పిండం ఏర్పడటానికి వీర్యం క్వాలిటీ ముఖ్యం. దానిమ్మలోని పోషకాలు స్పెర్మ్ క్వాలిటీని మెరుగుపరుస్తాయి.
స్పెర్మ్ మొటిలిటీ: వీర్యకణాలు వేగంగా ప్రయాణించి అండాన్ని చేరుకోవడాన్ని 'మొటిలిటీ' అంటారు. దానిమ్మ తినడం వల్ల స్పెర్మ్ మొటిలిటీ పెరిగి ఫలదీకరణ అవకాశాలు మెరుగుపడతాయి.
మహిళల్లో ఫెర్టిలిటీ ప్రయోజనాలు
త్వరగా గర్భం దాల్చాలనుకునే మహిళలకు దానిమ్మ పండు ఎంతో మేలు చేస్తుంది.
-ఓవులేషన్ సపోర్ట్: నెలసరి చక్రంలో అండం సక్రమంగా విడుదలయ్యేలా ఇది సహాయపడుతుంది.
-ఫెర్టిలైజేషన్ ఛాన్సెస్: నాణ్యమైన అండం ఉత్పత్తికి సహాయపడి, ఫలదీకరణ జరిగే అవకాశాలను పెంచుతుంది.
-ఇంప్లాంటేషన్: ఫలదీకరణ చెందిన అండం గర్భాశయ గోడలకు సురక్షితంగా అతుక్కునేందుకు ఇది ఎంతగానో సహకరిస్తుంది.
-శరీరం సన్నద్ధం: ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీని మోయడానికి అవసరమైన బలాన్ని ఇస్తూ, మహిళ శరీరాన్ని గర్భధారణ కోసం సిద్ధం చేస్తుంది.
గర్భాశయ ఆరోగ్యానికి రక్ష
ప్రెగ్నెన్సీ నిలవాలంటే గర్భాశయం చాలా ఆరోగ్యంగా ఉండాలి.
-దానిమ్మ పండు తినడం వల్ల గర్భాశయంలో ఆరోగ్యకరమైన ఎండోమెట్రియం (గర్భాశయ లోపలి పొర) ఏర్పడుతుంది.
-ఇది యుటెరైన్ లైనింగ్ (గర్భాశయ గోడలను) దృఢంగా మారుస్తుంది.
-గర్భాశయానికి రక్త ప్రసరణను మెరుగుపరిచి, పిండం ఎదగడానికి అవసరమైన అత్యుత్తమ వాతావరణాన్ని సృష్టిస్తుంది.
ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్న దానిమ్మ పండు సంతానోత్పత్తికి సపోర్ట్ చేసే నిజమైన సూపర్ ఫ్రూట్. త్వరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే దంపతులు రోజూ ఉదయం ఒక గ్లాస్ తాజా దానిమ్మ రసం తాగడం లేదా ఒక కప్పు దానిమ్మ గింజలను స్నాక్ లాగా తినడం అలవాటు చేసుకోండి. దీంతో పాటు మంచి జీవనశైలి, వ్యాయామం, డాక్టర్ల సలహాలు పాటిస్తే అతి త్వరలోనే మీ ఇంట కూడా పసిపిల్లల నవ్వులు వికసిస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
