Latest Updates
-
మీ శరీరంలో ప్రోటీన్ లోపం ఉందని చెప్పే 5 ముఖ్యమైన సంకేతాలివే! -
డీప్‌ఫేక్ సెక్స్టార్షన్ ఉచ్చులో పడ్డారా? మీ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే! -
కిడ్నీ రాళ్లను ఇట్టే కరిగించే ఉలవలతో టేస్టీ వడలు..తయారీ విధానం ఇదే! -
తెలంగాణ-ఏపీలో ఎండల తీవ్రత: గర్భిణీలకు పొంచి ఉన్న ముప్పు ఇదే! -
ఇడ్లీ,దోశల్లోకి బెస్ట్ కాంబినేషన్ కరివేపాకు కొబ్బరి చట్నీ..మామూలు చట్నీల కంటే 100 రెట్లు రుచి! -
వేసవిలో బరువు తగ్గాలా? అయితే మజ్జిగలో ఈ చిన్న పొడి కలిపి తాగితే, మీ పొట్టలోని కొవ్వు మంచులా కరిగిపోతుంది! -
విజయ్–త్రిష వెడ్డింగ్ వీడియో.. సోషల్ మీడియాలో రచ్చ! అసలు నిజం ఇదేనా? -
ఓట్స్ అంటే ఇష్టం లేదా? ఇలా గంజిలా చేసి చూడండి..బరువు తగ్గడంతో పాటు రుచీ మీ సొంతం! -
పప్పుల పొడి బోర్ కొట్టిందా? అయితే ఈ ఘాటైన ఆంధ్రా చికెన్ కారప్పొడి ట్రై చేయండి! -
పీరియడ్స్ ఆలస్యం అవ్వడానికి అసలు కారణం ఇదేనట!
బ్యూటీ పార్లర్ కు వెళ్లకుండానే అందమైన పాదాలు మీ సొంతం...
ఆరోగ్యానికి పాదాల సంరక్షణ చాలా అవసరం. పాదాల అందంగా ఉంచుకొనేందుకు ఇంట్లో చేసుకొనే ఓ చక్కటి ఉపాయం ఉంది. దీనినే పెడిక్యూర్ అంటారు. పెడిక్యూర్ కోసం పార్లర్‌కు వెళ్లలేని వారు ఇంట్లో దొరికే వస్తువులతోనే పెడిక్యూర్ చేసుకోవచ్చు. పెడిక్యూర్‌తో కాళ్ళకి బాగా విశ్రాంతి లభిస్తుంది. దాన్ని ఇంటి దగ్గర చేసుకుంటే మరీ మంచిది. వారానికి లేదా రెండువారాలకు ఒకసారి పెడిక్యూర్ చేసుకోవచ్చు. ముందుగా పాదాలు రెండూ పెట్టడానికి సరిపడిన ప్లాస్టిక్ టబ్ తీసుకుని దానిలో గోరు వెచ్చని సబ్బునీటిని పోసి అందులో సైంధవ లవణం, హైడ్రోజన్, నిమ్మకాయ రసం, తేనె, గ్లిజరిన్ ఇవన్నీ కలిపి ఆ నీటిలో పాదాలు ముంచి 15 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత బయటకు తీసి ప్యూమిక్ స్టోన్‌తో పగిలినచోట నీటితో తడుపుతూ మెల్లిగా రుద్దాలి.
ఇలా చేయడం వల్ల పగిలి పైకి లేచిన డెడ్‌స్కిన్ రాలిపోతుంది. తర్వాత మెత్తటి బ్రష్‌తో వైబ్రేషన్ తీసుకోవాలి. ఫుట్ మసాజర్‌లో గోరువెచ్చని నీటిని పోసి స్విచ్ ఆన్ చేయాలి. రెండు కాళ్లను ఫుట్‌మసాజర్‌లో ఉంచాలి. ఇపుడు వైబ్రేషన్ నిదానంగా అరికాళ్ల దగ్గరనుంచి పైకి ఎక్కుతూ ఉంటుంది. ఇలా 20 నిమిషాలపాటు తీసుకుంటే తలదాకా వస్తుంది. ఈ వైబ్రేషన్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. అరికాళ్ల మంటలు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి.
అరికాళ్లలో ఉండే ఆనెలు కూడా మెత్తబడి తగ్గుతాయి. ఈ ఫుట్‌మసాజర్‌తో రెగ్యులర్‌గా వైబ్రేషన్ తీసుకంటే కాళ్లు, పాదాలు మంచి షేప్‌కు వస్తాయి.ఫుట్ మసాజర్ లేనివారు నరిషింగ్ క్రీమును తీసుకుని కాళ్లకురా సుకోవాలి. ప్రతిరోజూ మంచి వేగంలో కూడిన నడక 30నిమిషాలపాటు అయినా ఉండాలి. ఇందువల్ల పాదాలకే కాక శరీరం మొత్తానికి కూడా మంచి వ్యాయామం అవుతుంది.

పెడిక్యూర్ వల్ల పగుళ్లు, దురద రాకుండా ఉంటాయి. సాల్ట్ కాళ్ల నొప్పులను నివారిస్తుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్ / డెటాల్ పగుళ్లలోపల ఉన్న మురికిని తొలగిస్తాయి. నిమ్మచెక్క, గ్లిజరిన్ వల్ల టాన్‌మారిన పాదాలు తిరిగి మునుపటి కాంతిని సంతరించుకుంటాయి. చలికాలంలో రోజంతా సాక్స్ వేసుకుని ఉండటం మంచిది.
అలాగే క్రమబద్ధమైన వ్యాయామం కాళ్ళ కండరాలను, నరాలను బలిష్టంగా చేస్తుంది. కాళ్ళకి సాధారణంగా వచ్చే వ్యాధులను దూరం చేస్తుంది. రోజుకి రెండుసార్లు పదినిమిషాల సేపు కొన్ని రోజులపాటు సాధారణ వ్యాయామం చేస్తే కాళ్ళు బలిష్టంగా తయారవుతాయి.
కాలివేళ్ళను పెకెత్తి నిలబడి మడమల్ని బాగా పైకెత్తి తర్వాత పాదాల్ని పూర్తిగా నేలకి ఆన్చాలి. ఇలా చాలాసార్లు చేయండి. కాలి వేళ్ళను బాగా వాటంతటవే అతుక్కునేట్లు చేసి మళ్లీ విడదీయండి. దీన్ని కూడా వీలైనన్ని సార్లు చేయండి.
ఈ పెడిక్యూర్‌ను 15రోజులకు ఒకసారి చేయించుకుంటే బాగుంటుంది. రాత్రిపూట పడుకునేముందు ఏదైనా క్రీమును కాని ఆయిల్ కాని తీసుకుని కాళ్లకు మసాజ్ చేసిన తరువాత గ్లిజరిన్ రాసుకోవాలి.



Click it and Unblock the Notifications