Latest Updates
-
భార్య ఎల్లప్పుడూ భర్తకి ఎడమవైపునే ఎందుకు కూర్చుంటుందో తెలుసా.? -
మగవారికి షాకింగ్ న్యూస్.. మీ శరీరంలో ఈ హార్మోన్ లెవెల్స్ పడిపోవడం గమనిస్తున్నారా.? -
ఆలయాల్లో దేవతలను మేల్కొలిపే సుప్రభాతం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం -
ప్రెగ్నెన్సీ సమయంలో యోగా, స్ట్రెచింగ్ చేయవచ్చా.?.. గర్భిణీలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే.! -
రెస్టారెంట్ రుచితో కరకరలాడే షెజ్వాన్ చికెన్ లాలీపాప్.. మీ ఇంట్లోనే చేసేయండిలా.. -
పరగడుపున నానబెట్టిన మెంతులు తింటే.. ఈ 5 అద్భుత ప్రయోజనాలు మీ సొంతం! -
గుడ్డిగా నమ్మి మోసపోకండి.. రిలేషన్ షిప్స్ పై చాణక్యుడి 6 హెచ్చరికలు -
హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు.. ఉద్యోగులు ఏ నగరాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారో తెలుసా.! -
చికెన్, మటన్ కూడా దీని ముందు బలాదూర్.. స్పైసీ మష్రూమ్ చుక్కా రుచి చూశారా? -
ముఖం, జుట్టు జిడ్డుగా మారి ఇబ్బంది పెడుతుందా.. భారీ వర్షాల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
నాజూకైన చేతులకు ఆరోగ్యవంతమైన గోళ్లు....!
నాజూకైన చేతులకు ఆరోగ్యవంతమైన గోళ్లు మరింత అందాన్నిస్తాయి. కానీ తరచూ విరిగిపోవడం, బీటలువారడం, రంగు మారడం వంటి సమస్యలు ఆ సౌందర్యాన్ని దూరం చేస్తాయి.
అనారోగ్యమైన గోళ్లకు ఎన్నో కారణాలు. ఇంటిపనుల్లో భాగంగా కఠినరసాయనాల ప్రభావం, తేమ లోపించడం, పొడిబారడం, అధిక వేడి, పోషకాల లేమి వంటివెన్నో. శరీరంతో పాటూ నఖాలు కూడా ఆరోగ్యవంతంగా ఎదగాలంటే మాత్రం తప్పనిసరిగా రోజూ ఎనిమిది నుంచి పదిగ్లాసుల నీరు తాగాల్సిందే.

ముఖ్యంగా గుడ్డు, గోధుమ పొట్టు, పచ్చిబఠాణీ, ఓట్స్, వాల్ నట్, సోయాబీన్స్ తో పాటూ ఆకుకూరల్ని రోజూ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. వీటిని ఆహారంగా తీసుకోవాడం వల్ల శరీరానికి బయోటిన్, బి విటమిన్ లు సమపాళ్లలో అందుతాయి. ఇవి గోళ్లు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
కాలంతో పనిలేకుండా కొందరి చర్మం పొడిబారుతుంటుంది. ఇలాంటి వారి గోళ్లు తరచుగా విరిగిపోతుంటాయి. దీనికి నివారణగా విటమిన్ ఇ నూనెను ఎంచుకొని దాంతో రోజూ ఐదు పదినిమిషాలు గోళ్లకు మర్ధన చేయాలి. ఇలా చేస్తే పొడిబారకుండా ఉంటాయి. వేళ్లకు కూడా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
విటమిన్ ‘ఇ’ నూనెకు బదులుగా అలాగే ఆలివ్ నూనెను కొద్దిగా వేడి చేసి ఆ నూనెను రాసుకున్నా ప్రయోజనం ఉంటుంది. మరో సులభమైన చిట్కాకూడా ఉంది. మధ్యకు తరిగిన నిమ్మ చెక్కల్ని తీసుకుని గోళ్లకు రుద్దుకోవాలి.
గోళ్లు అనారోగ్యంగా ఉండటానికి కేవలం బాహ్య కారణాలే కాదు. శరీరంలో థైరాయిడ్ అధికంగా ఉన్నా ఈ సమస్య ఉంటుంది. దీర్ఘకాలంగా ఈ సమస్య బాధిస్తున్నప్పుడు మాత్రం కారణాలు తెలుసుకోవడానికి వైద్యుల్ని సంప్రదించడం మేలు.
గోళ్లకు ఏ మాత్రం విరామం ఇవ్వకుండా అదేపినిగా రంగు వేసుకుంటుంటారు కొందరు. కానీ వాటికీ గాలి అవసరం దాన్ని విస్మరిస్తే..అవి పసుపురంగులోనికి మారతాయి. ఈ సమస్యను తగ్గించాలంటే..అప్పుడప్పుడు గోళ్లరంగు వేసుకోవడం మానేయాలి. వాటికి సహజ గాలి తగలనివ్వాలి.
నెలకోసారి తప్పనిసరిగా మెనిక్యూర్ చేయించుకోవాలి. ఫలితంగా అవి ఆరోగ్యంగా ఉంటాయి. వాటి అందం దెబ్బతినకుండా ఉండాలంటే...ఇంటిపనులు చేస్తున్నప్పుడు చేతులకు గ్లవుజులు ధరించడం మంచిది. అంతే కాదు పనులు పూర్తయ్యాక చేతుల్ని శుభ్రం చేసుకుని నాణ్యమైన మాయిశ్చరైజర్ రాసుకోవాలి.



Click it and Unblock the Notifications