మధుమేహాన్ని కంట్రోల్ చేసే కరివేపాకు...

Posted By:
Subscribe to Boldsky

Curry Leaves for Diabetic Patient..
సువాసన కలిగిన కరివేపాకు లేనివంటవంటేనా.మరి ఇంతగా వాడే కరివేపాకును తినేటప్పుడు పక్కకు నెడతాం. ఎట్లా తీసివేసాడో చూడు కరివేపాకును తీసి పారేసినట్లు అంటాం. అయితే కరివేపాకు తినడం వల్ల కలిగే సాధారణ లాభాలతో పాటు రకరకాల శరీర రుగ్మతలను పోగొట్టడానికి అనువైన ప్రత్యేక ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి. అవేంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం...

జీర్ణక్రియకు: 1. కరివేపాకు ఆకులను పచ్చిగా లేదా ఉడికించినవైన అవతల పారేయక నమిలి మింగండి. దీని వలన ఎంతో మేలు కలుగుతుంది.
2. కరివేపాకు జీర్ణక్రియ ఇబ్బందులను పోగొట్టే గుణముంది. జీర్ణక్రియ సమస్యతో బాధపడేవారు కరివేపాకు ఆకులను, జీలకర్రతో కలిపి బాగా నూరి, అలా నూరగా వచ్చిన పొడిని పాలలో కలుపుకుని తాగిలే సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది.

3. వేవిళ్ళతో బాధపడేవారికి కరివేపాకు ఆకుల నుండి తీసిన రసం, నిమ్మరసం, పంచదారలతో కలిపి తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది.

4. అతిగా కొవ్వు పదార్థాలు(నెయ్యి, వెన్న వంటివి) తినడం వల్ల కలిగే జీర్ణక్రియ ఇబ్బంది నుండి బయటపడవేయగలవు కరివేపాకు ఆకులు, వాంతులు, విరేచనాలు, తలతిరుగుడు వంటి వాటికి కరివేపాకు రసం బాగా పనిచేస్తుంది.

5. లేత కరివేపాకు ఆకులను తేనెతో తీసుకుంటే బంక విరోచనాలు తగ్గిపోతాయి. మొలల ఇబ్బందులకు అదే విరుగుడు.

6. పసరు వాంతులను కట్టగలిగిన శక్తి కరివేపాకు మొక్క బెరడుకుంది. ఎండు బెరడును పొడి చేసి ఆ పొడి నుండి వచ్చిన కషాయాన్ని చల్లనీటితో తీసుకుంటే వాంతులు తగ్గుతాయి.

7. వంశపారంపర్యంగా వచ్చే మధుమేహానికి కూడా కరివేపాకు పనిచేస్తుంది. ప్రతి రోజూ పది ముదురు కరివేపాకు ఆకులను బాగా నమిలి మింగాలి. అలా మూడు నెలల పాటు క్రమం తప్పకుండా చేస్తే మధుమేహాన్ని నియత్రించుకోగలుగుతారు.

8. భారీకాయం వల్ల వచ్చే మధుమేహానికి కరివేపాకు పనికొస్తుంది. ప్రతి రోజు ఉదయం పరగడుపున కరివేపాకు ఆకులను, మిరియంతో కలిపి తీసుకుంటే రక్తంలో చక్కర తగ్గుతుంది. కరివేపాకును తినడం వల్ల మూత్రంలో పాటుగా విసర్జించే చక్కర శాతం బాగా తగ్గుతుంది.

9. స్థూలకాయుల్లో కనిపించే మధుమేహం: కరివేపాకును ముద్దగా నూరి మోతాదుకు టీ స్పూన్ చొప్పున మజ్జిగతోగాని నీళ్లతోగాని రెండుపూటలా తీసుకుంటుంటే స్థూలకాయం తగ్గి తద్వారా మధుమేహం నియంత్రణలోకి వస్తుంది.

10. కరివేపాకుకు కొలస్ట్రెరాల్‌ని నియంత్రించే గుణముందని పరిశోధకులు కనుగొన్నారు. రక్తానికి సంబంధించిన లోపాలు, బొల్లి వంటి చర్మరోగాలకు కరివేపాకు పనికొస్తుందని ఇటీవల జరిపిన పరిశోధనలో వెల్లడైంది. అందుకే కరివేపాకును అలా తీసిపారేయక దాని లాభాలను గుర్తించి చక్కగా వినియోగించుకోండి.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

Curry Leaves for Diabetic Patient... | డయాబెటిస్ ను కంట్రోల్ చేసే కర్రీ లీవ్స్

Curry leaf is an aromatic herb of South India which has many herbal medicinal properties. It is an inevitable ingredient of South Indian cooking, spicing up cuisine in a myriad of ways, and is also most prominently used in Ayurveda, Siddha and Unani medical systems. Ancient herbal remedies used for centuries in Indian cooking and in preparing dishes in the far east have the potential to control diabetes and treat cancer, according to a team of London scientists.
Please Wait while comments are loading...
Subscribe Newsletter