Latest Updates
-
భాగస్వామి ఎంపిక విషయంలో పదే పదే తప్పు చేస్తున్నారా.. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే విషయాలివే.! -
మధ్యాహ్నం 12 లేదా 2 గంటలకే చెక్ ఇన్..హోటల్స్ ఫాలో అయ్యే రూల్ వెనుక అసలు కథ! -
బఠానీ, పెసరపప్పు కాంబినేషన్... ఈ సమోసా రుచి చూస్తే మళ్లీ మళ్లీ తింటారు! -
వ్యాయామం చేసటప్పుడు విపరీతంగా చెమట.. కొవ్వు కరిగిపోతుందని అస్సలు సంబరపడొద్దు.! -
ఉదయం లేవగానే ఒళ్లు నొప్పులు, జాయింట్స్ పట్టేస్తున్నాయా? -
పప్పులు నానబెట్టే పనిలేదు,రుబ్బే శ్రమలేదు..అటుకులు,బంగాళదుంపలతో క్షణాల్లో కరకరలాడే అప్పడాలు.. -
ప్రెగ్నెన్సీలో చర్మం ఎందుకు నల్లబడుతుందో తెలుసా.. పిగ్మెంటేషన్‌ను ఇలా పోగొట్టుకోండి.! -
ఈ 5 రాశుల వారికి నేడు అదృష్టం.. శివయోగం ప్రభావంతో కాసుల వర్షం ఖాయం! -
గర్భస్రావం తర్వాత సంతాన సామర్థ్యం పెరుగుతుందా.. ఇందులో నిజమెంత.? -
జూన్ 24న శివ యోగం: ఈ సమయం నుంచి మీ కెరీర్, అదృష్టం మారుతుందా?
డయాబెటీస్ రోగుల కంటి శుక్లాలు!

డయాబెటీస్ వ్యాధిని ఎంత బాగా నియంత్రించుకోగలిగితే, ఆ వ్యాధివలన కంటికి వచ్చే సమస్యలను అంతబాగా నియంత్రించుకోవచ్చు. అందుకుగాను మీరు డయాబెటీస్ గురించి కాటారాక్ట్ లు ఏర్పడటంలో దాని పాత్ర గురించి స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలి. కాటారాక్ట్ లు లేదా కంటి శుక్లాలు ముదరక ముందే తొలిదశలలోనే తగిన చికిత్సలు చేయించుకోవాలి. కంటి శుక్లాలు అంటే కండ్ల లెన్స్ పై ఏర్పడే దట్టమైన పొరలు. ఇవి మీ చూపును మందగిస్తాయి. కొంతమందికి ఈ సమస్య తీవ్రంగా కూడా వుంటుంది.
ఇవి ఎందుకు ఏర్పడతాయి? కంటి లెన్స్ సహజంగా కొన్ని ద్రవాలతో ఏర్పడతాయి. ఈ ద్రవాలలో ప్రధానంగా ప్రొటీన్ వుంటుంది. వయసు పెరుగుతున్న కొద్ది అనేక రకాల సమస్యలు కంటికి వస్తాయి. ఈ ద్రవాలు చిక్కబడతాయి. అదే కంటి శుక్లాలు. అయితే, ఈ సమస్య కొత్తగా పుట్టిన శిశువులలో కూడా వచ్చే అవకాశం వుంది. కంటి శుక్లాలు పెరగటమనేదానికి డయాబెటీస్ కూడా ప్రధాన కారణంగా వుంటుంది. రీసెర్చి ఇంకా పూర్తిగా వెల్లడి చేయకపోయినప్పటికి కొన్ని కారణాలుగా, డయాబెటీస్ రోగులకు షుమారుగా కంటి శుక్లాలు ఏర్పడటంలో 60 శాతం అధిక రిస్క్ వుంటుంది.
కనుక డయాబెటీస్ రోగులు రక్తంలోని షుగర్ స్ధాయిలను ఎప్పటికపుడు నియంత్రణలో వుంచాలి.
కంటి శుక్లాల లక్షణాలు ఎలా వుంటాయి? ముందుగా చూపు మందగిస్తుంది. కంటి పరీక్షల నిర్ధారణలో అకస్మాత్ గా కాటారాక్ట్ అని కూడా తేలవచ్చు. రాత్రులందు డ్రైవింగ్ చేయలేకపోవటం, పగటి వెలుగును చూడటానికి ఇబ్బందిపడటం వంటి లక్షణాలుంటాయి.
కంటి శుక్లాల చికిత్స ఎలా?
ఇటీవలికాలంలో కంటిశుక్లాల చికిత్స బాగా అభివృధ్ధి చెందింది. తరచుగా శస్త్రవైద్యం చేస్తున్నారు. కృత్రిమ కంటి అద్దాలను అమరుస్తున్నారు. కాటారాక్ట్ సర్జరీ అవసరమా? కాదా ? అనేదానికి మీ కంటి వైద్యుని సలహాపొందండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications