అతి త్వరగా బరువు తగ్గించే వాకింగ్ స్టైల్స్...!

Posted By:

చాలా మంది ఉదయం, సాయంత్ర సమయంలో వాకింగ్ చేస్తుంటారు. అయితే నడవడం బరువు తగ్గించుకోవడానికి మాత్రమే కాదు. బరువును కంట్రోల్ చేయడానికి కూడా. మీరు నిజంగా ఈ మధ్యకాలంలో బాగా బరువెక్కినట్లు భావిస్తుంటే, ఖచ్చితంగా అధిక బరువు పెరగకుండా జాగ్రత్త తీసుకోవాలి. అందుకు వాకింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రతి రోజూ నడవడం వల్ల బరువు అతి త్వరగా తగ్గుతారనే విషయాన్ని ఎక్స్ పెక్ట్ చేయ్యరు. అధికబరువును తగ్గించుకోవడానికి చాలా మంది ఏరోబిక్ వ్యాయామాలు, రన్నింగ్, స్విమ్మింగ్ వంటి గణనీయమైన వాటిని ఎంపిక చేసుకొని మరీ వెళుతుంటారు.

మొత్తం మీద, చాలా మంది నడక కూడా వ్యాయమం లాంటిదే అని చాలా తేలికగా తీసుకొంటారు. అందుకే వారు ప్రతి రోజూ నడుస్తున్నా కూడా బరువు మాత్రం తగ్గరు. వాకింగ్ లోనే ప్రతి రోజూ అరగంట పాటు బ్రిక్స్ వాక్ చేయడం వల్ల ఒక్క రోజులో 150క్యాలరీస్ ను తగ్గించుకోవచ్చు. కాబట్టి ఒక వారంలో ఒక పౌండ్ బరువు తగ్గాలనుకొనే వారు వాక్ చేస్తూ సరైన డైయట్ పాటించి బరువును కంట్రోల్ చేసుకోవడం ఎలానో చూద్దాం....

వాకింగ్ ను కూడా ఎక్సర్సైజ్ లాగే సీరియస్ గా తీసుకోవాలి గార్డెన్ లో తిరగడం వల్ల మీరు స్లిమ్ గా తయారవ్వరు. సీరియస్ గా బరువు తగ్గాలనుకొనే వారు కొన్ని నియమాలు పాటిస్తే తప్పనిసరిగా బరువు తగ్గుతారు.

1. ఒంటరిగా నడవడం మొదలు పెట్టాలి: మనం సాదారణంగా గమనించే ఉంటాం చాలా మంది అమ్మాలు గుంపులు గుంపులుగా ఉదయంలో వాకింగ్ చేస్తుంటారు. వారు చేసే ఎక్సర్సైజ్, వాకింగ్ కంటే వారి ముసిముసి నవ్వులు, వారి చిలిపి మాటలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకొనేవారు. మీరు ఒక్కరుగానే నడవడం వల్ల మీకు కొంత ప్రశాంతతో పాటు వేగంగా నడుస్తారు. దాంతో క్యాలరీస్ తగ్గుతాయి.

2. వేగవంతం: వాకింగ్ చేయడం వల్ల మార్పు ఏమి కనబడదు. అయితే రోజురోజుకు మీ నడక స్పీడ్ పెంచాలి. నడిచే దూరం కొద్దికొద్దిగా పెంచుకొంటే చక్కటి ఫలితం ఉంటుంది. అందుకని మరీ ఊపిరిపీల్చుకోలేనంత వేగంగా కూడా నడవకూడదు. మీరు నడిచే సమయంలో కొద్దిసేపు ఆగి మళ్ళీ మీ వేగాన్ని నెమ్మదిగా పెంచుకోవాలి.

3. ఎత్తు-తగ్గులు ఉన్న ప్రదేశాన్ని ఎంచుకోవాలి: వాకింగ్ చేసేటప్పుడు ఇలాంటి ప్రదేశాలను ఎంపిక చేసుకోవడం వల్ల ఎత్తుల్లో మీ ఒత్తిడి లిపిడ్ కణాల మీద అధికంగా పనిచేస్తుంది. ఇది కండరాలను బలపడేలా చేస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రదేశాలలో నడవడం వల్ల బరువు తగ్గడమే కాకుండా కండరాలు బలపడి స్లిమ్ గా తయారవుతారు.

4. ప్రతి రోజూ నడవాలి: బరువు త్వరగా తగ్గాలనుకొనే వారు, ఏదో ఒక సమయంలో నడిస్తే సరిపోతుందిలే అనుకొని రాత్రి సమయంలో నడచడం వల్ల ఉపయోగం ఉండదు. బరువు ఖచ్చితంగా తగ్గాలనుకొనే వారు ప్రతి రోజూ ఉదయాన్నే ఒకే సమయంలో నడవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇలా టైమ్ మొదట్లో పాటించడం వల్ల ఇది లైఫ్ లో రొటీన్ అయిపోతుంది. కాబట్టి రెగ్యులర్ గా చేయడం అనేది తప్పనిసరిగా మార్పును తీసుకొస్తుంది.

5. బీచ్ లో నడక: నడచడం వల్ల మొదట్లో మీరు బరువు తగ్గుతారు అందుకు కారణం మీరు ఎటువంటి వ్యాయామం చేయకపోవడం. ఇలా చేయడం వల్ల బరువు ఒక సారిగా తగ్గి తర్వాత అలాగే ఉంటారు. కాబట్టి నడకతో పాటు కొద్ది పాటి వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకు కొన్న కొత్త పద్దతులు అవలంభించాలి. ఇసుకలో, నీటిలో నడవడం వల్ల కొంత ఒత్తిడి పెరిగి బరువు తగ్గడానికి సులభం అవుతుంది.

6. వాకింగ్ డైయట్: నడక, వ్యాయమం వంటివి మాత్రమే బరువు తగ్గడానికి ఉపయోగపడవు. వాటితో పాటు సరైన డైయట్ ను కూడా పాటించినట్లైతే తప్పకుండా మీరు కోరుకున్న రూపాన్ని మీరు పొందగలరు.

Read more about: health, diet fitness, weight loss, tips, ఆరోగ్యం, డైయట్ ఫిట్ నెస్, బరువు తగ్గడం, చిట్కాలు
English summary

Walking For Weight Loss Is Different | వాకింగ్ స్టైల్ మార్చు..బరువు తగ్గు గురూ..!

Most people start walking not for weight loss but for weight control. If you feel that you have really bloated up lately and need to stop putting on weight, then you start walking. Nobody expects to lose weight fast by just walking everyday. When they want some substantial weight loss, they go for more vigorous aerobic exercises like running, swimming etc.
Story first published: Wednesday, November 14, 2012, 19:16 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter