Latest Updates
-
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.?
ఆరోగ్యకర గుండెకు ప్రతిరోజూ ఆహారం!

1. బేటా కెరోటిన్ అధికంగా వుండే కేరట్లు, కేబేజి, చిలకడదుంప, పచ్చని ఆకు కూరలు, మొదలైనవి తినాలి.
2. ప్రతిరోజూ పచ్చి వెల్లుల్లి లేదా వేయించినవి కొన్ని రెబ్బలు క్రమం తప్పకుండా తినాలి. వెల్లుల్లి గుండెకు మేలు చేస్తుందని ప్రతి రీసెర్చి చెపుతూనే వుంది.
3. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్లు కల ఆహారాలు తినండి. తాజా అవిసెగింజలనూనెలు, గోధుమ గింజల నూనెలవంటివి ఎంతో మేలు చేస్తాయి.
4. క్రమం తప్పకుండా రోజూ లెమన్ టీ తాగండి. సలాడ్లలో లెమన్ బామ్ వినేగర్ వాడండి.
5. గుండెకండరాలను బలహీన పరచే పనులు చేయకండి. తరచుగా డైటింగ్, ఉపవాసాలు లేదా అధికంగా తినేయడం వంటివి ఎలక్ట్రోలైట్స్ స్ధాయిలను అసమతుల్యత చేస్తాయి.
6. ఆహారం ఎంత కావాలో అంతే తినండి. గింజలు, కూరలు, బీన్స్, పచ్చని కూరలు, పండ్లు, చేపలు, పెరుగు పప్పులు, కాయలు, ఛీజ్, పాలు వంటివి ఆరోగ్యం
7. పచ్చి కూరలు ప్రతిరోజూ తినండి. బ్రక్కోలి, కాలీఫ్లవర్ వంటి వాటిలో పీచు అధికం.
8. విటమిన్లు, పీచు అధికంగా వుండే ఆపిల్ వంటివి తినండి. వాల్ నట్స్ , బాదంపప్పులు కరూడా బాగా పనిచేస్తాయి.
9. రెడ్ మీట్ తినకండి, బదులుగా చేపలు తినండి. వీటిలో ఒమేగా 3 వుంటుంది. ఇది సడన్ గా వచ్చే గుండెపోటును అరికడుతుంది. ఉప్పు తగ్గించండి.
10. తినే కూరగాయలు రంగురంగులుగా వుండాలి. ఈ రకమైన కూరలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. వేపుళ్ళకంటే, ఉడికించినవి బాగా తినండి.
11. బయటకు వెళ్ళునపుడు నీరు తాగటానికి ఒక బాటిల్ అందుబాటులో వుంచుకోండి. అది శరీరానికి హైడ్రేషన్ కలిగిస్తుంది.
12. అనారోగ్యకర ఆహారాలవైపు చూడకండి.ఫ్రిజ్ లో ముందుభాగంలో పచ్చటి కూరలు, పండ్లు వుంచండి ఆరోగ్యకరంగా తినవచ్చు. బేకరీ పదార్ధాలకు దూరంగా వుండండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications