For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్రీన్ టీ-బ్లాక్ టీతో బరువు నియత్రణనే కాదు..గుండె కూడా పదిలమే..

|

Green Tea
రోజూ మూడు కప్పుల టీ తాగండి. అది గుండె జబ్బుల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. అవును... మీరు చదివింది నిజమే. ఈ విషయం పరిశోధనల్లో వెల్లడయింది. బ్లాక్ టీ లేక గ్రీన్ టీని రోజూ మూడు కప్పులు తీసుకోవడం వల్ల గుండె సమస్యలు పదకొండు శాతం మేరకు తగ్గుతాయంటున్నారు నిపుణులు. ఫ్యాట్, కొలెస్టరాల్ కలయిక మూలంగా ఏర్పడే ఫలికకలను రక్తనాళాలో డెవలప్ అయ్యే అవకాశాలను టీ తగ్గిస్తుంది.

‘టీ'లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. రెండు యాపిల్స్ లో, ఐదు రకాల కూరగాయల్లో లభించే యాంటీ ఆక్సిడెంట్లు రెండు కప్పుల టీలో లభిస్తాయి. ఈ తాజా పరిశోధనాంశాలను యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు వెల్లడించారు. టీ లుండే ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు కార్డియోవాస్క్యులర్ డిజీజెస్ రాకుండా కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.

బ్లాక్ టీలో ఉండే ప్లేవనాయిడ్ ఎంత ఉంటుందో అంతే మోతాదులో గ్రీన్ టీలో లభిస్తుందని తాజా పరిశోధనలో తేలింది. టీ, టీలో ఉండే ప్లేవనాయిడ్స్ నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిని, ఎండోథీలియల్ ఫంక్షన్ ను మెరుగుపరుస్తాయి. గుండె ఆరోగ్యంగా ఉండేలా చూసే వాటిలో ఇవి కూడా కీలకపాత్ర పోషిస్తాయి. తేనీరులోని ఫ్లేవనాయిడ్స్‌ గుండెను ఆరోగ్యవంతంగా పనిచేయిస్తాయి. ‘టీ' తీసుకున్న వారిలో గుండె రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడటం చాలా తక్కువగా కనిపించింది. టీలో ఉండే ఫ్లేవనాయిడ్స్ ఎథెరోస్కెలెరోసిన్ పెరుగుదలను నిరోధిస్తోంది. అని పరిశోధనలో పాల్గొన్న డా. కేథరిన్ హుడ్ అభిప్రాయపడ్డారు.

టీ తాగడం వల్ల మరికొన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
1. రోజూ టీ తాగేవాళ్లలో ఎముకలు బలంగా ఉంటాయి.
2. బ్లాక్‌ టీ తాగేవారిని ఫ్లూ జ్వరాలు లాంటివి అంత త్వరగా దరిచేరవు.
3. రోజూ మూడు నాలుగు కప్పుల టీ తాగేవారిలో గుండె పోటు ప్రమాదం 21 శాతం తగ్గుతుంది.
4. టీలో ఉండే ఫ్లోరైడ్‌ దంతాలు దృఢపడేందుకు సాయపడుతుంది.
5. గ్రీన్‌, బ్లాక్‌ టీలలో ఉండే ఎల్‌-థయానైన్‌ ఒత్తిడిని తగ్గించి మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది.
6. టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ రాకుండా కాపాడతాయి.
7. అనేక రకాల అలెర్జీలకు టీ విరుగుడు.
8. టీ డీహైడ్రేషన్‌ సమస్యనూ దూరం చేస్తుంది. నీరు తాగేందుకు దోహదం చేయును.

English summary

Does Green Tea Help the Heart? | ‘గ్రీన్ టీ’తో బరువు తగ్గడమే కాదు..గుండె కూడా పదిలమే..

The next time you're offered a choice between Earl Grey and green tea, you might want to go green. A new study shows that the beverage, which is more popular in Eastern cultures, can protect heart arteries by keeping them flexible and relaxed, and therefore better able to withstand the ups and downs of constant changes in blood pressure.
Story first published:Tuesday, August 28, 2012, 16:25 [IST]
Desktop Bottom Promotion