గుండెకు ఆరోగ్యకర ఆహారం!

Healthy Foods Heart Aid0181
ఉదయంవేళ తినే ఆహారంలో పీచు అధికంగా వుండే పదార్ధాలు వుండాలి. ఆహారంలో బ్రౌన్ రైస్, గింజ ధాన్యాలు, బీన్స్, బఠాణీ, వంటివి అధికంగా వుండాలి. తాజాపండ్లు, కూరగాయలు, తొక్కతీసిన బంగాళ దుంపలవంటివి తప్పని సరిగా వుండాలి.

బరువు అధికంగా వున్నారనుకుంటే షుగర్ అధికంగా వుండే పదార్ధాలు తినకండి. షుగర్ రక్తంలోని ట్రిగ్లీసెరైడ్స్ స్ధాయిని పెంచుతుంది. షుగర్ తీసుకోవడం తగ్గించాలంటే.... పండ్లు అధికంగా తినాలి. తినే ఆహార పదార్ధాలకు లేదా డ్రింకులకు షుగర్ వేయకండి. తక్కువ కేలరీలు కల ఆహారం, షుగర్ లేని కూల్ డ్రింకులు తాగండి. స్వీట్లు, కేకులు, బిస్కట్లవంటివి తినకండి. షుగర్ కు బదులుగా ఆర్టిఫిషియల్ తీపిని వాడండి.

ఆల్కహాల్ తక్కువగా తాగాలి. ఆల్కహాల్ కూడా రక్తంలోని ట్రిగ్లీసెరైడ్స్ స్ధాయిని పెంచుతుంది. ఆల్కహాల్ తాగే వారు వారానికి రెండు లేదా మూడు సార్ల చొప్పున ఒకటి లేదా రెండు డ్రింకులు మాత్రమే తాగాలి. ఒక డ్రింకు అంటే ఒక చిన్న వైన్ గ్లాసుతో సమానం. డైనింగ్ టేబుల్ వద్ద తినే ఆహారాలలో మరోసారి ఉప్పు వేసి తినకండి. అధిక ఉప్పు రక్తపోటు కలిగిస్తుంది. గుండె లేదా కిడ్నీ సమస్యలున్నవారు ఉప్పు తినరాదు. ఆహారాన్ని పెప్పర్ లేదా ఇతర సుగంధ ద్రవ్యాలతో తగుమాత్రంగా కలిపి తీసుకోండి.
Posted by:
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .