For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ్యక్తి ఆరోగ్యాన్ని.. వ్యక్తిత్వాన్ని.. తెలిపే నిద్రా భంగిమ...!

|

కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైందో..అనే మాట మనం తరచు చాలామంది నోటి నుంచి వింటూ ఉంటాం. నిజానికి కంటికి నిద్ర దూరమైతే అది అనేక రుగ్మతలకు దారి తీస్తుందన్న విషయం చాలా మందికి తెలియదు. రోజుకు కనీసం 8 గంటల నిద్ర అవసరమని వైద్యులు చెబుతుంటారు. నిద్రాదేవత కరుణ కోసం చాలామంది చాలారకాల ప్రయత్నాలు చేస్తుంటారు. శారీరక శ్రమ ఉన్నవాళ్లకైతే దీని గురించి అంత తాపత్రయ పడాల్సిన పనిలేదు. ఆ శ్రమ లేనివారికే ఇబ్బందంతా.కొందరు పాలు తాగితే నిద్రవస్తుందని, మరి కొందరు పుస్తకాలు చదివితే నిద్రవస్తుందని ప్రయత్నిస్తుంటారు. అవేవీ పనిచేయని వారికి ఏ భంగిమలో నిద్రపోతే కంటినిండా నిద్ర ఉంటుందో కొందరు నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా వ్యక్తులు వేసుకునే దుస్తులు, వారి ప్రవర్తన వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయన్న విషయమే చాలా మందికి తెలుసు. అయితే మనం నిద్రపోయే భంగిమ కూడా మన వ్యక్తిత్వాన్ని సూచిస్తుందన్నది ఎక్కువమందిక తెలియకపోవచ్చు. కానీ ఇది నిజమని అంటున్నారు నిపుణులు. నిద్రపోయే భంగిమను బట్టి ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చని వారు చెబుతున్నారు. కేవలం వ్యక్తిత్వమనే కాకుండా ఆ వ్యక్తి ఆరోగ్యాన్ని తెలియజేస్తుందని వారంటున్నారు. మరి ఆ భంగిమలేంటో వాటి అర్థం ఏంటో ఒకసారి చూద్దాం...

మనిషి వ్యక్తిత్వాన్ని తెలిపే నిద్రా భంగిమ...!

వెల్లకిలా పడుకుని రెండు చేతులను తలకు ఆనించి పడుకునే అలవాటు నూటికి ఐదు శాతం మందికి మాత్రమే ఉంటుంది. ఇలా పడుకునే వారు స్నేహానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. ఎదుటి వారు చెప్పేది పూర్తిగా వినే అలవాటు వుంటుంది. సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. నలుగురిలో ప్రత్యేకంగా కనపడాలనే కోరిక ఏమాత్రం ఉండదు. ఇలా పడుకోవడం వల్ల వీపు వెనక భాగం మీద ఎక్కువ వత్తడి పడే అవకాశం ఉంది. అందువలన చిన్న టవల్ ను మడిచిది.

మనిషి వ్యక్తిత్వాన్ని తెలిపే నిద్రా భంగిమ...!

బోర్లా పడుకుని రెండు చేతులూ దిండు కిందుగా పెట్టుకుంటారు. కాళ్ళు రెండూ నిటారుగా పెట్టుకుని పడుకుంటారు. వ్యక్తుల సమూహంలో వుండడానికి ఇష్టపడ్డా విమర్శలను ఏ మాత్రం భరించలేరు. ఈవిధంగా ఎక్కువ సేపు బోర్లాపడుకోవడం అంత మంచిది కాదని నిపుణులు అంటున్ానరు. ఈ అలవాటును మానుకోలేకపోతే పొట్ట కిందబాగంలో దిండు పెట్టుకోవాలిని వారు సూచిస్తున్నారు. తలక్రింద, పొట్టక్రింద ఒకే విధమైన ఎత్తు ఉండేదిండును వాడాలి.

మనిషి వ్యక్తిత్వాన్ని తెలిపే నిద్రా భంగిమ...!

వెల్లకిలా పడుకుని కాళ్ళూ చేతుళూ నిటారుగా పెట్టుకు పడుకుంటారు. నూటికి ఎనిమిది మందికి ఈ విధంగా పడుకునే అలవాటు ఉంటుంది. ప్రశాంతంగా, ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతారు. ఆడంబరాలు, అతిశయోక్తులకు దూరంగా ఉంటారు. ఇతరుల కన్నా ఉన్నతంగా వుండటానికి ఇష్టపడతారు. దానికోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. వీరు సరైన దిండు ఉపయోగించకపోతే వెనుక భాగం, మెడ, భుజాలు తీవ్ర అసౌకర్యానికి గురై నొప్పిని కలిగిస్తాయి. అదే విధంగా వీరిలో గురక పెట్టే అలవాటు ఎక్కువగా ఉంటుంది. తరచూ మెలకువ వస్తూ ఉంటుంది. గాఢ నిద్ర కరవు కావడంతో మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తరచూ పొజిషన్ మార్చుకుంటూ వుంటే కొంత వరకూ పై ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు.

మనిషి వ్యక్తిత్వాన్ని తెలిపే నిద్రా భంగిమ...!

కొద్దిగా ఒరిగినట్టు పడుకుని కాళ్ళూ చేతులూ నిటారుగా పెట్టుకుంటారు. రెండు చేతులూ కాళ్ళకు లేదా దిండుకు అభిముఖంగా పెట్టుకుని పడుకుంటారు. పదిహేను శాతం మందికి ఇలా పడుకునే అలవాటు ఉంటుంది. ప్రతి విషయాన్నీ తేలిగ్గా తీసుకునే మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. నలుగురితో తేలికగా కలిసిపోయి సామాజిక సంబంధాలు పెంపొందించుకునే గుణం కలిగి ఉంటారు. ఎప్పుడు చూట్టూ నలుగురు వుండాలని కోరుకుంటూ ఉంటారు. కొత్తవారిని సైతం తేలికగా నమ్మేస్తుంటారు. తల మెడ ఒకవైపే పెట్టుకోవడం వల్ల ఆయా భాగాలు కొద్దిగా నొప్పికి గురయ్యే అవకాశం ఉంది దిండు ఎత్తు సరిపోక ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి అప్పుడప్పుడ భంగిమ మార్చి పడుకోవాలి.

మనిషి వ్యక్తిత్వాన్ని తెలిపే నిద్రా భంగిమ...!

తలను దిండు మధ్యకు తెచ్చి శరీరాన్ని కొద్దిగా పక్కకు ఒరిగినట్టు చేసి రెండు చేతులూ కిందకు వేలాడేసి పడుకునే భంగిమ ఇది. కాళ్ళు రెండు ఒకదానిమీద మరొకటి వేసుకుని నిటారుగా పెడతారు. వీరు ఎక్కువగా ప్రకృతి ఆరాధకులుగా ఉంటారు. ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని మార్చుకునేందుకు ఇష్టపడరు. అనుమానం, మెండితనం పాళ్ళు వీరిలో ఎక్కువగా వుంటాయి. ఎదుటి వారు చెప్పేది వినే గుణం తక్కువగానే ఉంటుంది. ఎంత సేపూ తమమాటే నెగ్గాలనే పంతం వీరిలో ఎక్కువ. వీరికి ఆరోగ్య సమస్యలు పెద్దగా తలెత్తవు కానీ, సరైన దిండును ఎంచుకోవడం కష్టంగా వుంటుంది. దీని వల్ల మెడనొప్పి వచ్చే అవకాశం ఎక్కువ. కాలిమీద కాలు వేసుకోవడం వల్ల కండరాలు పట్టేస్తుంటాయి.

మనిషి వ్యక్తిత్వాన్ని తెలిపే నిద్రా భంగిమ...!

చిన్న పిల్లలు పడుకున్నట్టు పడుకుంటారు. ఒక పక్కకు తిరిగి రెండు చేతులూ దిండు కింద పెట్టుకుని, మోకాళ్ళు ముడుచుకుపడుకుంటారు. కొన్ని సందర్భాల్లో వీరు గడ్డం కింద చేయి పెట్టుకుంటారు కూడా.. ఇలాంటి వారు సమస్యలతో బాధపడేవారు. ఎక్కువగా ఆలోచించేవారు ఈ విధంగా పడుకుంటారిని నిపుణులు అంటున్నారు. వీరిలో పాపభీతి, న్యాయ ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది. నలుగురిలో కలవడానికి సిగ్గుపడుతూ ఉంటారు. ప్రతి చిన్న విషయాన్ని తమకు అన్వయించుకుంటూ తరచూ బాధపడుతుంటారు. అయితే వీరి ఆలోచనలు తగ్గించుకొని పనులన్నీ క్రమబద్దంగా చేయడం అలవాటు చేసుకుంటే చాలా వరకూ వీరి చింతలన్నీ తొలగిపోతాయి.

English summary

What does your Sleep Position Say about You..? | మనిషి వ్యక్తిత్వాన్ని తెలిపే నిద్రా భంగిమ...!

World health research reveals the research results on the sleeping position of the people. it says that our sleeping position is related to our personality. If you want an insight into somebody's true personality, then try to catch a glimpse of the way they sleep. Scientists believe the position in which a person goes to sleep provides an important clue about the kind of person they are.
Desktop Bottom Promotion