For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒత్తిడి నుండి తక్షణ ఉపశనం కలిగించే 10 బెస్ట్ బాడీ మసాజ్...!

|

స్ట్రెస్ (ఒత్తిడి)అనేది సైలెంట్ కిల్లర్. ఇది మీ జీవితంలోని మీకు తెలియకుండానే ప్రవేశిస్తుంది, అంతే కాదు ఇది మీలో అలజడి సృష్టిస్తుంది. అంతే కాదు మీకు ఏమాత్రం తెలియనియ్యకుండానే మీ ఆరోగ్యాన్ని కొంతైనా కాదు..కాదు..చాలానే నాశనం చేస్తుంది. ఈ ఒత్తిడి అనిదే పని ఒత్తిడి లేదా బిజీ షెడ్యూల్ లైఫ్, రిలేషన్ షిప్ ప్రాబ్లెమ్స్, నిద్ర, ఆహారపు అలవాట్లు మరియు ఇంకొన్ని ఇతర కారణాలు కూడా ఒత్తిడికి కారణం కావచ్చు. చాలా తరచుగా ఈ సమస్యను చాలా మంది ఎదుర్కొంటుంటారు. చాలా చిన్న సమస్యలకే అధికంగా ఒత్తిడికి గురివౌతుంటారు. దీన్ని మనం స్ట్రెస్ అని చెప్పవచ్చు. అయితే స్ట్రెస్ కు సంబంధించిన సంకేతాలు(సిమ్టమ్స్) చాలా సింపులాగా తీసేసేంత చిన్నది కాదు. ఎందుకంటే ఒత్తిడి మెల్లిగా ప్రారంభమైన నిశ్శబ్దంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు గురిచేస్తుంది. ఈ ఒత్తిడిని వెంటనే గుర్తించి సరైన సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.

ఒత్తిడి తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు ఉదా: ఆహారపు అలవాట్లలో మార్పులు, వ్యాయామాలు, యోగాలు చేసి ఒత్తిడి తగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలు, ప్రయోగాలు చేసి వుండవచ్చు. అయితే ఒత్తిడి తగ్గించే విధానంలో మసాజ్ కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది. శారీరకంగా, మానసికంగా అలసట చెందిన శరీరానికి ఉల్లాసాన్నిచ్చే ప్రక్రియ మసాజ్‌. ప్రతిరోజు పని ఒత్తిడి మూలంగా టెన్షన్‌కు గురైన వారు హారుుగా సేదతీరేందుకు నేడు మసాజ్‌ సెంటర్లను ఆశ్రరుుస్తున్నారు. శరీరంలోని కండరాలకు ఉత్తేజాన్నిచ్చే మసాజ్‌ అన్ని వయసుల వారికి మంచిదే. వివిధ రకాల మసాజ్‌లతో శరీరంలోని పలు రకాల రుగ్మతలను నిర్మూలించవచ్చని వైద్య, ఆరోగ్య నిపుణులు సైతం పేర్కొంటున్నారు

కొన్ని ప్రత్యేకమైన మసాజ్ థెరఫీలు ఫాలో చేయడం వల్ల మిగిలిన పద్దతులు కంటే ఈ పద్దతి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఆయుర్వేదిక్ మసాజ్ ఇండియాలో చాలా ప్రసిద్ది చెందింది. ఒత్తిడి తగ్గించడంలో ఆయుర్వేదిక్ మసాజ్ బెస్ట్ మసాజ్ గా చెప్పవచ్చు. అదే విధంగా మరొకటి థాయ్ మసాజ్ ఇది ఐస్ లాండ్(థాయ్ లాండ్) నుండి వచ్చింది. ఇది కూడా తక్షణ ఉపశనమం కలిగించే మసాజ్.
మరి మీరు ఒత్తిడిని సహజపద్దతులతో తగ్గించుకోవాలని కోరుకుంటున్నట్లైతే, కొన్ని మసాజ్ లు మీ లిస్ట్ లో తప్పనిసరిగా చేర్చుకోవల్సిందే. వీటిలో ప్రతి ఒక్క మసాజ్ చేయించుకోవడం లేదా చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు . ఈ మసాజ్ లను రెగ్యులర్ గా చేసుకోవడం వల్ల ఒత్తిడి నుండి బయటపడవచ్చు . మరియు ఒంటినొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు . మరి ఒత్తిడి తగ్గించే కొన్ని బెస్ట్ మసాజ్ లు మీకోసం...

తీవ్రమానసిక ఒత్తిడిని తగ్గించే టాప్ 10 బాడీ మసాజ్ లు.!

థాయ్ మసాజ్: థాయ్ మసాజ్‌ ఎంతో ఆనందం ఇస్తుంది. బ్యాంకాక్‌ సందర్శకులకు ఇది ఒక మంచి అనుభవం. ఈ మసాజ్‌లో శరీరంలోని ఎనర్జీ అంతా ఒక వరుసకు తెస్తారు. మసాజ్‌ చేసేవారు తమ చేతి వేళ్ళతో మరియు ఒక నల్లటి సూదంటు రాయితో శరీరంపై వున్న సున్నిత స్థానాలపై ఒత్తిడి తెస్తారు. మసాజ్‌ చేయించుకుంటే చాలు మీకు ఎంతో శక్తి వస్తుంది.

తీవ్రమానసిక ఒత్తిడిని తగ్గించే టాప్ 10 బాడీ మసాజ్ లు.!

ఆయుర్వేదిక్ మసాజ్: మన దేశంలోని ఆయుర్వేదిక్‌ మసాజ్‌ దేశ,విదేశాల్లో ఎంతో పేరొందింది. ప్రకృతి వనమూలికలతో కూడిన ఆయిల్స్‌తో చేసే ఈ మర్దన శరీరంలోని వివిధ రుగ్మతలను తొలగిస్తుంది. సహజసిద్దమైన విధానాలతో చేసే ఈ మసాజ్‌ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా కేరళ ఆయురేదిక్‌ సెంటర్లలో నిర్వహించే మసాజ్‌లకు నేడు మంచి డిమాండ్‌ ఉంది. వీటిలో యోగా, మెడిటేషన్‌తో కలిపి హెర్బల్‌ మసాజ్‌లను నిర్వహిస్తున్నారు. ఇక ఆయుర్వేదిక్‌ మసాజ్‌లను ‘అభ్యంగ' అని కూడా పిలుస్తారు. ఒకరు లేదా ఇద్దరు కలిసి చేసే ఈ మర్దనలో వేడి చేసిన హెర్బల్‌ ఆయిల్స్‌తో మసాజ్‌ నిర్వహిస్తారు.

తీవ్రమానసిక ఒత్తిడిని తగ్గించే టాప్ 10 బాడీ మసాజ్ లు.!

ఆక్యుప్రెజర్ మసాజ్: ఆక్యుప్రెజర్ మసాజ్ శరీరంలోని కొన్ని సున్నితమైన ప్రదేశాల్లో థెరఫీని ప్రయోగిస్తారు. ఇది పెయిన్ రిలీఫ్ ను ఇస్తుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆక్యుప్రెజర్ మసాజ్ ను చేతులతో లేదా స్పెషల్ పాయిట్ పరికరంతో చేయించుకోవచ్చు.

తీవ్రమానసిక ఒత్తిడిని తగ్గించే టాప్ 10 బాడీ మసాజ్ లు.!

స్వీడిష్‌ మసాజ్‌ : స్వీడిష్‌ మసాజ్‌ కూడా సాధార ణమైనదే, మొదటి సారి మసాజ్‌ చేయించు కొనేవారికి ఇది మంచిది. శరీరం అంతా చేస్తారు. చక్కటి సున్నితమైన చేతి ఒత్తిడి కలిగిస్తారు. మెత్తటి దెబ్బలు వేసి బాధ నుండి విముక్తి చేస్తారు. సాధారణ శరీర నొప్పులకు బాగా పనిచేస్తుంది. కాని మసాజ్‌ మెళకువ కలిగిన వారు చేయాలి. చాలా కాలంగా శారీరక నొప్పులు వుంటే మాత్రం దీనికి బదులుగా పైన తెలిపిన నాలుగు మసాజ్‌లు బాగా పనిచేస్తాయి. ఈ మసాజ్ కు వెరైటీ నేచురల్ ఆయిల్ ను ఉపయోగించి మసాజ్ టెక్నిక్స్ తో మసాజ్ చేయడం అనేది ఒత్తిడి తగ్గించుకోవడానికి ఫర్ ఫెక్ట్ పరిష్కారం.

తీవ్రమానసిక ఒత్తిడిని తగ్గించే టాప్ 10 బాడీ మసాజ్ లు.!

ఆరోమా థెరపీ మసాజ్‌ : ఈ ఆరోమా థెరపీ మసాజ్‌లో మీ ఇంద్రియాలను చైతన్యవంతం చేస్తారు. వివిధ రకాల వాసన నూనెలు మరియు సెంట్లు వంటివి మీ కండరాలను సడలించేందుకు రాస్తారు. ఒత్తిడి తగ్గించే భావనలు కలిగేలా చేస్తారు. వివిధ రకాల సుగంధ ద్రవ్యాలను కూడా వారు వాడతారు. ఈ మసాజ్‌ దేశంలోని అన్ని స్పాలలోను, మసాజ్‌ సెంటర్లలోను విరివిగా లభిస్తుంది. అది చేస్తే చాలు కనీసం ఐదు లేదా ఆరు రోజుల పాటు మీ శరీర కండరాలు ఎంతో సరళంగా హాయిగా భావిస్తాయి.

తీవ్రమానసిక ఒత్తిడిని తగ్గించే టాప్ 10 బాడీ మసాజ్ లు.!

బాలీ మసాజ్: ఐస్ లాండ్ ఆఫ్ బాలి. దీనికి సంపన్న సంస్కృతి మరియు వారసత్వం ఉంది.ఇది భారతదేశ మరియు చైనా యొక్క ఉత్తమ మిళితమైన పద్దతి ఇది మీకు శక్తితో కూడిన ఉపశమనం కలిగిస్తుంది.

తీవ్రమానసిక ఒత్తిడిని తగ్గించే టాప్ 10 బాడీ మసాజ్ లు.!

లోమి లోమి మసాజ్: హవాయన్ ఐస్ లాండ్ యొక్క ఒక ప్రత్యేకమైన మసాజ్. ఈ మసాజ్ ను ఎటువంటి నూనెలు ఉపయోగించకుండా రెండు చేతులతో చేస్తారు. ఇది రిలాక్స్ పొందడానికి చాలా గొప్ప మార్గం.

తీవ్రమానసిక ఒత్తిడిని తగ్గించే టాప్ 10 బాడీ మసాజ్ లు.!

హాట్‌ స్టోన్‌ మసాజ్‌ : దీనినే కేరళ మసాజ్‌ అని కూడా అంటారు. ఇది కేరళ రాష్ట్రంలో పుట్టింది. మీ శరీర నొప్పి కనుక గట్టితనం లేదా గట్టి కండరా ల వల్లని భావిస్తుంటే ఈ మసాజ్‌ మీకు మంచిది. వేడి చేసిన, వివిధ సైజుల రాళ్ళతో మీ శరీరంపైగల సున్నిత స్థానాలను మర్దన చేస్తారు. అప్పుడు మీకు నొప్పులు తగ్గి హాయి భావన కలుగుతుంది.

తీవ్రమానసిక ఒత్తిడిని తగ్గించే టాప్ 10 బాడీ మసాజ్ లు.!

హెడ్ ఆయిల్ మసాజ్ లేదా చాంపి: చాంపి అనేది భారత సంస్కృతి హెడ్ మసాజ్. ఈ హెడ్ ఆయిల్ మసాజ్ కు ఉసిరి నూనె లేదా బ్రహ్మి ఆయిల్ ను ఉపయోగిస్తారు. ఇది ఒత్తిడి నుండి తక్షణ ఉపశమనం కలిగించే బూస్టర్ వంటిది మరియు కేశాలకు చాలా మేలు చేస్తుంది.

తీవ్రమానసిక ఒత్తిడిని తగ్గించే టాప్ 10 బాడీ మసాజ్ లు.!

కలారీ మసాజ్: కలరియపట్టు అనేది కేరళకు చెందిన మార్షల్‌ ఆర్ట్స్‌ రూపం, ఇది ప్రపంచంలోకెల్లా అత్యంత పురాతనమైన మరియు సాంకేతికపరమైన మార్షల్‌ ఆర్ట్స్‌ రూపంగా పరిగణిస్తారు. కలరిలో యుద్ధకళల్లో శిక్షణ ఇస్తారు కలరి విద్యలో మార్షల్‌ ఆర్ట్స్‌ లో శిక్షణ ప్రారంభించడానికి ముందు శరీరాన్ని తయారు చేస్తారు. దీనికోసం శరీరానికి ఆయిల్‌ మసాజ్‌ చేసి, శరీరం చురుగ్గా, మృదువుగా మారేట్లుగా చేస్తారు. శరీరం మరియు మనస్సుల మధ్య అత్యుత్తమ సమన్వయం కల్పించడమే కలరియపట్టు శిక్షణ యొక్క ప్రధాన లక్ష్యం. సంప్రదాయ కలరి శిక్షణలో స్వతంత్రంగా వైద్య విధానాలను ఆచరించడంలోనూ ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది. కలరీలు మతారాధాన కేంద్రాలు కూడా. కలిరిపట్టులో కొన్ని ప్రాథమిక సూత్రాలను పాటించాల్సి ఉంటుంది. కోర్సు పూర్తయిన తరువాత ఆయిల్‌ మసాజ్‌ చేయించుకోవాలి. శరీరం ఒకే ఆకృతిలో ఉండటం కోసం రెగ్యులర్‌గా ఈ ఫీట్లను చేస్తూ ఉండాలి.

తీవ్రమానసిక ఒత్తిడిని తగ్గించే టాప్ 10 బాడీ మసాజ్ లు.!

టిష్యు మసాజ్‌ : ఈ మసాజ్‌ చర్మంపై చేసినప్పటికీ చర్మం కింద పొరలవరకు చేరుతుంది. ఈ మసాజ్‌లో కలిగే ఒత్తిడి దెబ్బలు తగిలి కోలుకొనే వారికి ఎంతో ప్రయోజనకరంగా వుంటుంది. కనుక వైద్యులు బాధనుండి విముక్తి పొందాలంటే దీనినే సూచిస్తారు.

English summary

10 Best Massages For Instant Stress Relief | ఒత్తిడి నుండి తక్షణ ఉపశనం కలిగించే 10 బెస్ట్ బాడీ మసాజ్...!

Stress is a silent killer. It affects your health much more than minor ailments. In today's day and age, everyone is stressed. We are stressed due to work, a very fast life and even due to relationship problems.
Story first published: Saturday, May 25, 2013, 15:22 [IST]
Desktop Bottom Promotion