Latest Updates
-
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.?
వర్షాకాలంలో పాటించవలసిన 10 ఆరోగ్యం చిట్కాలు
సాదారణంగా వర్షపు చినుకులు పడినప్పుడు మనకు చాలా ఆనందం కలుగుతుంది. కానీ ఈ వర్షాల వల్ల వైరల్ జ్వరం, మెదడు వాపు, అలెర్జీలు వంటి పలు ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి.
ఈ కాలంలో వైరస్ మరియు బాక్టీరియాలనుండి మనల్ని కాపాడుకుంటూ ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని చిట్కాలు పాటించండి. ఈ చిట్కాలు పాటించుట వల్ల మనము వర్షాకాలంను ఆస్వాదిస్తూ చాల వ్యాధులను నివారించుకోవచ్చు. సాధారణంగా ఈ చిట్కాలను పాటించటం చాల సులభంగా ఉంటుంది.

కాచి చల్లార్చిన నీరు: ఈ వర్ష కాలంలో ఫిల్టర్ చేసిన మరియు బాయిల్డ్ చేసిన వాటర్ ను మాత్రమే త్రాగటానికి ఉపయోగించాలి. మీరు సాదారణంగా ఈ కాలంలో క్రిముల దాడి నుండి తప్పించుకోవటానికి టీ లేదా అల్లం టీ, నిమ్మకాయ టీ,వేడి కూరగాయల సూప్,మూలికా టీ వంటి వాటిని త్రాగటానికి ఇష్టపడుతారు.

ఆహారాల మీద ప్రత్యేక శ్రద్ద: పండ్లు మరియు కూరగాయలు, ముఖ్యంగా ఆకు కూరలు తినే ముందు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే వాటిమీద అనేక లార్వాలు , దుమ్ము మరియు పురుగులు ఉంటాయి. వీటిని తొలగించుట కొరకు ఉప్పు నీటిలో 10 నిముషాలు ఉంచాలి. ఇలా చేయుట వలన బాక్టీరియా నిరోధం జరుగుతుంది.

ఉడికించిన వాటికి ప్రాధాన్యత: ఈ కాలంలో పూర్తిగా వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అలా కాకుండా పచ్చి లేదా వండని ఆహారపు అలవాట్లు ఉంటే మీకు మీరే సమస్యలను ఆహ్వానిస్తున్నట్లే .

పండ్లు -కూరగాయలు: గరం-గరం బజ్జీలకు బదులుగా తాజాగా వండిన లేదా తాజా పండ్లు మరియు కూరగాయలను తీసుకోవటం అలవాటు చేసుకోవాలి.

మసాలాలకు దూరం: వర్షాకాలం సమయంలో మన శరీరంనకు త్వరగా ఆహారం జీర్ణం చేయడానికి కష్టతరంగా ఉంటుంది. అందువల్ల మీ జీర్ణక్రియ మెరుగుపర్చే క్రమంలో వెల్లుల్లి, మిరియాలు,అల్లం,పసుపు మరియు కొత్తిమీర వంటి ఆహారాలను తీసుకోవాలి.

సూపులు: మాంసాహార ప్రేమికులు భారీ మాంసాహారం కాకుండా సూప్ మరియు తేలికపాటి భోజనం తీసుకోవాలి.

స్ట్రీట్ ఫుడ్: వివిధ క్రిముల వల్ల అనేక వ్యాధులు వస్తాయి. అందువలన ఈ కాలంలో సాధ్యమైనంతవరకు రోడ్డు మీద తయారయ్యే ఆహారాన్ని తినటం మానాలి.

హానికర ఆహారం: తాజాగా లేని లేదా మిగిలిపోయిన ఆహారాన్ని తినటం మానివేయాలి.

చేతుల శుభ్రత: కూరలు కోసే బోర్డును ఉపయోగించడానికి ముందు పూర్తిగా శుభ్రం చేయాలి. టాయిలెట్ సందర్శించిన తర్వాత, ఆహారం తీసుకున్నాక,ఆహారం వండటానికి ముందు మీ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. మంచి వ్యక్తిగత పరిశుభ్రత అవసరము.

దోమల నివారణకు: దోమలు, ఈగలు, బొద్దింకలు, చెదపురుగులు మొదలైన వాటిని దూరంగా ఉంచటానికి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. క్రిమి నిరోధకాలు, క్రిమినాశకాలను ఉపయోగించండి. దోమల యొక్క ఉనికిని తగ్గించేందుకు వేప ,కర్పూరం లేదా లవంగాలను వాడండి.
ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకొంటే ఈ వర్షాకాలం మీకు ఆరోగ్యమైన మరియు హృదయపూర్వకంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications