For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

50ఏళ్ళ తర్వాత కూడా యంగ్ గా కనిపించడం ఎలా?

By Super
|

జీవితమంతా మీ పట్ల మీరు మంచి శ్రద్ధ తీసుకోవటం చాలా ముఖ్యం. మీరు వయసు మీరుతున్న కొద్ది ఆ జాగ్రత్త మరీ ముఖ్యం. మీ శరీరానికి పూర్వ జీవితంలో కంటే ఎక్కువ నిర్వహణ మరియు ఆదరణ అవసరం; ఇది మంచి శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాదు, మానసిక మరియు భావోద్వేగ ఆరోగ్యానికి కూడా చాలా అవసరం. కొన్ని ప్రాథమిక సూత్రాలు పాటిస్తే, మీరు నడిచే ప్రతి మార్గంలో ఆరోగ్యకరమైన జీవనశైలి నిర్వహించటానికి సహాయ పడతాయి.

కూరగాయలు తినండి:

మీరు కూరగాయలతో పాటు, పండ్లు, లీన్ ప్రోటీన్, తృణధాన్యాలు మరియు ఎక్కువ పరిమాణంలో నీరుని జోడించండి. ముఖ్యంగా, "ఆరోగ్యకరమైన ఎంపిక కొరకు సులభమైన ఎంపిక చేయండి", ఉదాహరణకి "రోజు ప్రారంభంలో, ఒక బాటిల్ ను పూర్తిగా నీటితో నింపి మరియు దానిని మీ ఎదురుగా ఉంచుకోండి". ఇంకా "మీకు సరిపడినంత వరకు మాత్రమే ఆహారం తీసుకోండి. ఇలా చేసినట్లయితే మీరు సరైన పరిమాణం లోనే ఉంటారు"

నడవండి:

మన దినచర్యలలో వాకింగ్ వంటి సులభమైన శారీరక చర్యను చేర్చుకోవటం మంచిది. మీతో పాటు కుక్కను తీసుకెళ్లటం మరియు మీ మనవళ్ళను, మనవరాళ్ళను మీతో పాటు తీసుకెళితే చాలా ఆసక్తిగా నడవగలుగుతారు. దీనివలన మీ బాహ్య-శరీర బలం పెరుగుతుంది మరియు మీ గుండె చక్కగా పని చేస్తుంది.

సరి అయిన సమయంలో నిద్ర పోండి:

మంచి ఆరోగ్యానికి రాత్రిళ్ళు మంచి నిద్ర పోవటం చాలా అవసరం. దీనివలన మీ శరీరానికి విశ్రాంతి మరియు స్వస్థత చేకూరి, మీ మెదడుకు కూడా తిరిగి ఉత్తేజం పొందటానికి అవకాశం దొరుకుతుంది. స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్టాప్లు వంటి అన్ని మొబైల్ పరికరాలను వేరే గదిలో ఉంచండి ఎందుకంటే వాటివలన ఈ రోజు మీ నిద్రకు భంగం కలగకూడదు కనుక. మీకు ఫ్లాషింగ్ లైట్స్ మరియు కంపనాల వల్ల కూడా నిద్రాభంగం కలగకుండ చూసుకోండి.

రెగ్యులర్ గా పరీక్షలు చేయించుకోండి:

ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవటం వలన మీ డాక్టర్ కు శరీరంలోని మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు. కొలెస్ట్రాల్, రక్తపోటు, మధుమేహం మరియు బోలు ఎముకల వ్యాధి వంటివాటికి క్రమంగా ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవటం చాలా ముఖ్యం. వీటికితోడు, ఫ్లూ, న్యుమోనియా, కోరింతదగ్గు, కంఠరోహిణి మరియు ధనుర్వాతం వంటి వాటికి మీ డాక్టర్ చేత టీకాలు అవసరమనుకుంటే వేయించుకోండి.

మీ దుర్గుణాలను పరిమితం చేసుకోండి :

సరైన ఆరోగ్యాన్ని నిర్వహించడానికి, మద్యాన్ని అప్పుడప్పుడు మాత్రమే తీసుకోండి. ఒక్కసారిగా మీరు త్రాగటం మానివేయలేకపోయినా, (మీ డాక్టర్ మానేయమని సిఫార్సు చేయకపోతే) త్రాగుడును నియంత్రించటం ఉత్తమ ఆలోచన. అలానే పొగ త్రాగటాన్నికూడా పూర్తిగా మానేయమని చెప్పకపోతే, పొగ త్రాగటంలో నియంత్రణ పాటించండి.

కలివిడిగా ఉండండి:

సామాజిక సంబంధాలు పెంచుకోవటం, మీ మానసిక మరియు భావోద్వేగ అనుభూతులకు ఒక గొప్ప ప్రోత్సాహాన్ని అందిస్తుంది. సినిమాకు వెళ్ళటం, మీ కుటుంబంతో మరియు స్నేహితులతో సమయం గడపటం వంటివి చేయండి. అలా అని, సీతాకోకచిలుక లాగా సంబంధాలు పెంచుకోమని కాదు, కొద్ది మందితో సరిగా జత కట్టండి.

మీ మేధాశక్తిని పెంచుకోండి:

చాలా సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలంటే మానసికంగా బలంగా ఉండాలి. మీ మేధాశక్తిని పెంచాలంటే మీ మెదడుకు వ్యాయామం చాలా అవసరం. చదవటం, సినిమా చూడటం, చెక్కర్స్, చదరంగం మరియు స్క్రాబుల్ మొదలైన ఆలోచిస్తూ ఆడే ఆటలు మరియు క్రాస్వర్డ్లు మరియు సుడోకు వంటి వర్డ్ పజిల్స్ చేయడం ద్వారా మీ మెదడుకు వ్యాయామం కలుగుతుంది.

బయట సమయం గడపండి :

తాజా గాలిని పీల్చటం మరియు సూర్యుని యొక్క కిరణాలను ఆనందించంటం వంటి వాటితో ఆరోగ్యకరమైన జీవనశైలి అద్భుతాలు చేయవచ్చు. 15-20 నిముషాల సూర్యకాంతితో మీకు అవసరమైన విటమిన్ డి పొందవొచ్చు. మీకు అవసరమనిపిస్తే మీ డాక్టర్ ను సంప్రదించి దీని సప్లిమెంట్ పొందవొచ్చు. ఉదయ సూర్యకిరణాలు మీ సెరోటోనిన్ కు మరియు మీ మానసిక స్థితికి మంచి ప్రోత్సాహాన్నిఅందిస్తాయి.

మీ పడకగదిలో ఉత్తేజపూరితంగా ఉండండి:

ఆరోగ్యకరమైన సెక్స్ జీవితం కలిగి ఉండటం అనేది ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఒక భాగం. లైంగిక అవసరాలు అనేవి సాధారణమైన విషయం, ఇది ఆరోగ్యవంతమైన భాగం మరియు దీనిని మీ జీవితంలో ఒక భాగంగా కొనసాగించాలి. ఒక ఆరోగ్యకరమైన సెక్స్ జీవితం అనేది మీ భౌతిక, మానసిక మరియు భావోద్వేగాలపై మంచి ప్రభావం చూపుతుంది.

మీ వైఖరిని సర్దుబాటు చేసుకోండి :

మీ గురించి మీరు మంచిగా ఆలోచించుకోవటం అనేది మీరు ఒక గొప్ప వైఖరిని కలిగి ఉండటం. "ఆశావాదంతో!" విషయాలను ఆలోచించటం మరియు ఉల్లాసభరితంగా ఉండటం అనేది మీ మానసిక మరియు భావోద్వేగంగా ఉండటానికి సహాయపడతాయి.మీరు మానసికంగా మంచి ఆరోగ్యంగా అనుభూతి చెందినప్పుడు, మీకు ఆరోగ్యం కోసం చేసే పనులన్నీ సులభంగా చేసుకోగలుగుతారు.

English summary

10 Tips for Healthy Living After 50

Taking good care of yourself is important throughout your life. As you get older, it takes on even more significance.
Desktop Bottom Promotion