For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యాపిల్ తింటే డాక్టర్ అవసం ఉండదా..ఎంత వరకూ నిజమో చూడండి..!

|

ప్రతిరోజు ఓ ఆపిల్ తింటే వైద్యునితో అవసరం ఉండదని చెబుతుంటారు. అది ముమ్మాటికి నిజమే. ఎందుకంటే ఆ పండులో ఉండే పోషక విలువలు అలాంటివి మరి. శరీరానికి ఇది ఒక గొప్ప సహజ యాంటీఆక్సిడెంట్‌ (వ్యాధినిరోధక కారకం)గా పని చేస్తుంది. 100 గ్రాముల ఆపిల్ తింటే దాదాపు 1,500 మిల్లీగ్రాముల "విటమిన్ సి" ద్వారా పొందే యాంటీఆక్సిడెంట్‌ ప్రభావంతో సమానం. ఆరోగ్యంగా ఉండటానికి యాపిల్ చేసే మేలు అంతా ఇంతా కాదు, రోజుకు ఒక యాపిల్ తిన్నా గంపెడు ఆరోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే. ఇది మనకు ఏ సీజన్‌లోనైనా దొరుకుతుంది. యాపిల్‌లో ఫైబర్‌ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి. సోడియం తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉంటుంది.

యాపిల్‌ అత్యున్నత స్థాయి పోషకాహారం. దీనిలో ఖని జాలు, విటమిన్లు విస్తృతంగా ఉంటాయి. పండులోల చక్కె రస్థాయిని అనుసరించి దీని పోషక విలువలు ఆధారపడి వుంటాయి. శరీరంలో జరిగే రసాయన, శారీరక మార్పు లవల్ల జీవక్రియ నిరంతరం ఎదుగుదల, పనితీరుకు అవరోధం కలుగుతుంటుంది. ఇటువంటి పరిస్థితిని అధిగ మించేందుకు యాపిల్‌ ఎంతగానో సహకరిస్తుంది. యాపిల్‌ యొక్క ఉపయెగాలు మీరు తెల్సుకుంటే ఇది నిజం - నిజం- నిజం అని మీరే అంగీకరిస్తారు. మరెందుకు ఆలస్యం... యాపిల్‌ ఉపయోగాలలోకి వెళదామా?

‘ఎ’ ఫర్ ఆపిల్..‘బి’ ఫర్ బెనిఫిట్స్..!

రక్త హీనత: యాపిల్స్‌లో ఇనుము, ఆర్శినిక్, పాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి రక్తహీనతలో బాగా పనిచేస్తుంది. తాజాగా జ్యూస్ తీసి వాడితే ఫలితాలు బాగుంటాయి. రోజుకు కిలో చొప్పున తీసుకోగలిగితే మంచిది.

‘ఎ’ ఫర్ ఆపిల్..‘బి’ ఫర్ బెనిఫిట్స్..!

క్యాన్సర్: యాపిల్‌ లివర్‌, బ్రెస్ట్‌ కేన్సర్‌ రాకుండా కాపాడుతుందని వైద్య పరిశోధనలు చెబుతున్నాయి.రోజువారీగా యాపిల్స్‌ని వాడే వారిలో పెద్ద పేగు క్యాన్సర్ల ఉనికి తక్కువగా ఉంటుంది. యాపిల్స్‌లో ఉండే పెక్టిన్ జీవక్రియకు లోనైనప్పుడు బ్యుటైరేట్ అనే జీవి రసాయనం విడుదలవుతుంది. ఇది మలాశయం గోడల మీద రక్షణగా పనిచేసి క్యాన్సర్‌నుంచి మన శరీరాలను కాపాడుతుంది. యాపిల్‌ పండు తొక్కులో ఉండే దాదాపు పన్నెండు రకాల రసాయనపదార్థాలు క్యాన్సర్‌ కణాలను సమర్థంగా అడ్డుకుంటాయని కార్నెల్‌ యూనివర్సిటీ పరిశోధకుల రీసెర్చిలో తేలింది. ‘ట్రిటర్‌పెనాయిడ్స్‌'గా వ్యవహరించే ఈ పదార్థాలు కాలేయం, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్లకు సంబంధించిన కణాల పెరుగుదలను అడ్డుకుంటాయట.

‘ఎ’ ఫర్ ఆపిల్..‘బి’ ఫర్ బెనిఫిట్స్..!

మధుమేహం: రోజుకు ఒక యాపిల్‌ తినే మహిళల్లో 28% టైప్‌ 2 మధుమేహం రాదట. బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ను నియంత్రించడమే అందుకు కారణం. టైప్‌-2 డయాబెటిస్‌తో బాధపడేవారు కూడా... ఉదయం, రాత్రి... రెండు పావు ముక్కలు మొత్తం ఓ అరయాపిల్‌ తినగల్గితే... టైప్‌-2 డయాబెటిస్‌లో అద్భుత ఫలితాలు ఉన్నట్లు రీసెర్చ్‌ ద్వారా రుజువైంది.

‘ఎ’ ఫర్ ఆపిల్..‘బి’ ఫర్ బెనిఫిట్స్..!

ఉదర సంబంధ సమస్యలు/జీర్ణవ్యవస్థ: అల్పమైన జీర్ణక్రియా సంబంధ సమస్యలు ఇబ్బంది పెడుతున్నప్పుడు యాపిల్ ఆహారౌషధంగా ఉపయోగపడుతుంది. యాపిల్‌ని ముక్కలుగా తరిగి మెత్తని గుజ్జుగా చేసి, దాల్చిన పొడిని, తేనెను చేర్చి తీసుకోవాలి. గింజలు, తొడిమ తప్ప యాపిల్‌ని మొత్తంగా ఉపయోగించవచ్చు. తిన బోయేముందు బాగా నమలాలి. ఆహార సమయాలకు మధ్యలో దీనిని తీసుకోవాలి. యాపిల్‌లో ఉండే పెక్టిన్ అనే పదార్థం అమాశయపు లోపలి పొర మీద సంరక్షణగా ఏర్పడి మృదుత్వాన్ని కలిగిస్తుంది. ముక్కలుగా తరిగిన యాపిల్స్‌కు పెద్ద చెంచాడు తేనెను చేర్చి కొద్దిగా నువ్వుల పొడిని చిలకరించి తీసుకుంటే జీర్ణావయవాలకు శక్తినిచ్చే టానిక్‌గా పనిచేస్తుంది.

‘ఎ’ ఫర్ ఆపిల్..‘బి’ ఫర్ బెనిఫిట్స్..!

క్రొవ్వు తగ్గించడానికి: శరీరంలో కొవ్వు అధికంగా పేరుకోకుండా యాపిల్‌లోని ఫైబర్‌ సాయపడుతుంది.

‘ఎ’ ఫర్ ఆపిల్..‘బి’ ఫర్ బెనిఫిట్స్..!

బరువు తగ్గడానికి: అనేక సమస్యలకు మూలమైన అధిక బరువును తగ్గించడానికి యాపిల్‌ మంచి పరిష్కారం. కేలరీలు తక్కువగా ఉండి కడుపునింపడంలో దీనిదే పైచేయి.

‘ఎ’ ఫర్ ఆపిల్..‘బి’ ఫర్ బెనిఫిట్స్..!

రోగనిరోధకశక్తికి: ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌, విటమిన్‌ సి మన రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి.

‘ఎ’ ఫర్ ఆపిల్..‘బి’ ఫర్ బెనిఫిట్స్..!

రుతుక్రమ సమస్యలు/కడుపు నొప్పి: రుతుక్రమాన్ని క్రమబద్దం చేయడంలో ఈ యాపిల్ చాలా పవర్ ఫుల్. సరైన రుతుక్రమాన్ని మెయింటైన్ చేయడానికి యాపిల్ మీ రెగ్యులర్ డైయట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

‘ఎ’ ఫర్ ఆపిల్..‘బి’ ఫర్ బెనిఫిట్స్..!

మలబద్ధకం, విరేచనాలు: యాపిల్స్ మలబద్ధకంలోను, విరేచనాలు రెంటిలోను ఉపయోగపడతాయి. దోరగా ఉన్న యాపిల్స్ మలబద్ధకంలో ఉపయోగపడతాయి. రోజుకు కనీసం రెండు యాపిల్స్‌ను తీసుకుంటేగాని మలబద్ధకంలో ఫలితం కనిపించదు. విరేచనాలవుతున్నప్పుడు ఉడికించిన యాపిల్స్ గాని బేక్ చేసిన యాపిల్స్ గాని ఉపయోగపడతాయి. ఉడికించే ప్రక్రియవల్ల యాపిల్స్‌లో ఉండే సెల్యూరోజ్ మెత్తబడి మలం హెచ్చుమొత్తాల్లో తయారవుతుంది.

‘ఎ’ ఫర్ ఆపిల్..‘బి’ ఫర్ బెనిఫిట్స్..!

దంత క్షయం: యాపిల్స్‌లో దంతాలు పుచ్చిపోకుండా నిరోధించే జీవ రసాయనాలు ఉన్నాయి. యాపిల్స్‌ను అనునిత్యం తీసుకునే వారిలో దంతాలు ఆరోగ్యంగా తయారవుతాయి. ఆహారం తీసుకున్న యాపిల్‌ను కొరికి తింటే బ్రష్ చేసుకున్నంత ఫలితం ఉంటుంది. యాపిల్‌ తినడంవల్ల నోట్లో లాలాజలం ఎక్కువగా ఊరుతుంది. అది పళ్లను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అంతేకాదు, పళ్ల సందుల్లో బ్యాక్టీరియా సెటిలైపోకుండానూ చేస్తుంది. అంటే పళ్లు పుచ్చిపోవడం తగ్గుతుంది.

‘ఎ’ ఫర్ ఆపిల్..‘బి’ ఫర్ బెనిఫిట్స్..!

కిడ్ని సమస్యలు: రెగ్యులర్ గా యాపిల్ జ్యూస్ తాగినా.. పండు తిన్నా కిడ్నీలలో క్యాల్షియం యాగ్జలేట్ రాళ్ళు తయారు కావు. కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు యాపిల్స్ తీసుకుంటే ఉపయోగం కనిపిస్తుంది.

‘ఎ’ ఫర్ ఆపిల్..‘బి’ ఫర్ బెనిఫిట్స్..!

ఆల్జైమర్స్(మతిమరుపు): వయసుతో వచ్చే మతిమరుపు, ఆల్జీమర్స్‌ను తగ్గించే గుణం యాపిల్‌కు ఉంది. కారణం, యాపిల్‌ మెదడుకు శక్తినిస్తుంది.

‘ఎ’ ఫర్ ఆపిల్..‘బి’ ఫర్ బెనిఫిట్స్..!

ఎనర్జీ/శక్తి పొందడానికి: ప్రతి రోజూ వ్యాయామంతో పాటు ఒక యాపిల్ తినడం వల్ల శరీరానికి బలాన్నిస్తుంది.

‘ఎ’ ఫర్ ఆపిల్..‘బి’ ఫర్ బెనిఫిట్స్..!

ఎముకల బలానికి: ఫ్రెంచి పరిశోధనల ప్రకారం యాపిల్‌లో ఉండే ఫ్లోరిడ్జెన్‌ మహిళలకొచ్చే మెనోపాజ్‌ దశలో ఎముకలు బలహీనమవడాన్ని తగ్గిస్తాయి. మెనోపాజ్‌ దశలో మహిళలలో సంభవించే ఎముకలకు సంబంధించిన ఇబ్బందుల్ని తొలగిస్తుంది.

‘ఎ’ ఫర్ ఆపిల్..‘బి’ ఫర్ బెనిఫిట్స్..!

మొదడు చురుదనానికి: ఎర్రటి యాపిల్ పండులోనున్న ఫ్లేవోనాయిడ్ తత్వం వలన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తుంది. ఇది శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొదిస్తుంది. దీంతో మెదడు చురుకుగా పనిచేయడమే కాకుండా ఆరోగ్యంగాను ఉంటుంది.

‘ఎ’ ఫర్ ఆపిల్..‘బి’ ఫర్ బెనిఫిట్స్..!

గుండె ఆరోగ్యానికి: కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచే యాపిల్‌ రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తుంది. యాపిల్ పండ్లలో శరీరానికి కావలసిన ప్రొటీన్లు, విటమిన్లు సమపాళ్ళల్లో ఉంటాయి. అలాగే క్యాలరీలను తగ్గిస్తుంది. శరీరంలోని క్యాలరీలను తగ్గించడంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

‘ఎ’ ఫర్ ఆపిల్..‘బి’ ఫర్ బెనిఫిట్స్..!

అధిక రక్తపోటు: నేటి ఉరుకులు పరుగుల జీవితంలో మానవుడు సవాలక్ష రోగాలతో సతమతమవుతున్నాడు. వీటిలో బీపీ(రక్తపోటు) ఒకటి. బీపీను తగ్గించుకునేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నా అవి శరీరానికి హాని కలిగిస్తాయని పరిశోధనలు వెల్లడించాయి. కనుక రోజుకో యాపిల్‌ను తొక్క తీయకుండా తింటే రక్తపోటును తగ్గించుకోవచ్చంటున్నారు. బీపీను తగ్గించుకునేందుకు కొందరు "గ్రీన్ టీ" తాగడం, "బ్లూ బెర్రీస్" తినడం వల్ల, రోజుకో యాపిల్ తినడం ద్వారా ఎటువంటి హానీ లేకుండా బీపీను తగ్గించుకోవచ్చంటున్నారు.

‘ఎ’ ఫర్ ఆపిల్..‘బి’ ఫర్ బెనిఫిట్స్..!

గర్భిణులకు: గర్భ సమయంలో ఆరోగ్యం పదిలంగా ఉండటానికి, పుట్టే బిడ్డ ఆరోగ్యానికీ యాపిల్‌ మంచి మార్గం.

‘ఎ’ ఫర్ ఆపిల్..‘బి’ ఫర్ బెనిఫిట్స్..!

ఆస్తమా: ఆస్తమాతో బాధపడేవారు విడవకుండా రోజూ ఓ యాపిల్‌ తినగల్గితే... ఆస్తమా నియత్రంణలో ఉంటుంది.

‘ఎ’ ఫర్ ఆపిల్..‘బి’ ఫర్ బెనిఫిట్స్..!

పొడి దగ్గు: పొడి దగ్గులో తియ్యని యాపిల్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. రోజుకు పావు కిలో చొప్పున తీసుకుంటే బలహీనత మూలంగా వచ్చే పొడి దగ్గునుంచి ఉపశమనం లభిస్తుంది.

‘ఎ’ ఫర్ ఆపిల్..‘బి’ ఫర్ బెనిఫిట్స్..!

వాపులతో కూడిన కీళ్ల నొప్పులు: గౌట్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి వాపులతో కూడిన కీళ్లనొప్పుల్లో యాపిల్ మంచి ఆహారౌషధంగా పనిచేస్తుంది. యాపిల్‌లో ఉండే మ్యాలిక్ యాసిడ్, గౌట్‌వ్యాధిలో పెరిగే యూరిక్ యాసిడ్‌ని తటస్థపరిచి నొప్పులను దూరంచేస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. యాపిల్స్‌ను ఉడికించి జెల్లిలాగా చేసి పైన పూసి కొద్దిగా రుద్దితే నొప్పులను లాగేసి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

‘ఎ’ ఫర్ ఆపిల్..‘బి’ ఫర్ బెనిఫిట్స్..!

హెయిర్ గ్రోత్: హెయిర్‌ గ్రోత్‌ బాగుంటుంది.

‘ఎ’ ఫర్ ఆపిల్..‘బి’ ఫర్ బెనిఫిట్స్..!

చర్మ సంరక్షణ: సూర్యకాంతి యొక్క రేడియేషన్‌ ప్రభావం నుండి మన చర్మానికి రక్షణ ఇస్తుందని రుజువైంది. ఎండలోకి వెళ్ళకతప్పని పరిస్థితిలో ఓ యాపిల్‌ తిన్నారం టే.. ఎండ కారణంగా మీ చర్మానికి ఎటువంటి హానీ జరగదు.

English summary

23 Health Benefits of Eating Apples.. | ‘ఎ’ ఫర్ ఆపిల్..‘బి’ ఫర్ బెనిఫిట్స్..!

Apples are rich in flavonoids and antioxidants and are high in fiber.Eating them raw maximizes their nutritional content and keeps them crispy, too. Let's look out the health benefits of eating apples.
Story first published: Monday, March 11, 2013, 19:42 [IST]
Desktop Bottom Promotion