For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పనస పండులోని వైద్యపరమైన ఆరోగ్య ప్రయోజనాలు..!

|

పనసకాయ. ఆంగ్లంలో దీన్ని Jackfruit అంటారు. ఇది ఒక పండ్ల చెట్టు. పనస మల్బరీ కుటుంబానికి చెందిన చెట్టు. తూర్పు ఆసియా దీని జన్మస్థలం. ప్రపంచంలోనే అతి పెద్ద పండును ఇచ్చే చెట్టు ఇదే. దాదాపు ఒక్కోటి 36 కేజీలుంటుంది. 90 సెంటీమీటర్ల పొడవు, 50 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి. సువాసనలు వెదజల్లుతూ నోరూరించే పనసపండు అంటే అందరికీ ఇష్టమే. సృష్టికి ప్రతిసృష్టి చేసిన విశ్వామిత్రుడు అనాసకు ప్రతికగా పనసపండు సృష్టించాడంటారు. పనసపండులో శరీరారోగ్యాన్ని పెంపొందింపచేసే పలు పోషక పదార్ధాలు పుష్కలంగా వుంటాయి.

పనసలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మంచి ఆరోగ్యాన్నిస్తుంది. ఈ పండులో ‘ఏ',‘సి' విటమిన్లు స్వల్పంగా ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం మెండుగా ఉండా ఆరోగ్యానికి బాగా సహాయపడుతాయి. చెట్టున పండిన కాయను, కోసిన వెంటనే తింటే, అదంత రుచికరంగా ఉండదు. తయారైన కాయను కోసి, నిలువ ఉంచితే, ఆ పనస తొనలు చాలా తియ్యగా ఉంటాయి. అవి దేహానికి పుష్టినిస్తాయి. నాడిశక్తిని పెంచుతాయి.

ఇది అంత త్వరగా జీర్ణంకాదు. కాబట్టి అమితంగా ఈ పండును తినరాదు. తక్కువగా తింటేనే మేలు కలుగుతుంది. లవణాలు, విటమిన్లు తక్కువ కాబట్టి, ఈ పండు జీర్ణం కావటం కాస్త కష్టం. పనస గింజల్లో తేమ చాల తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ గింజలు ఇంకా కఠినంగా జీర్ణం అవుతాయి. చిన్నపిల్లల్లో జీర్ణశక్తి ఎక్కువ కాబట్టి ఈ పండును కాల్చి తింటే, వారికంత అపకారం జరగదు. మరి పనసపండు తినడం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఒక సారి పరిశీలించండి..

పనసపండులో ఉన్న టాప్ 15 ఆరోగ్య ప్రయోజనాలు!

జీర్ణశక్తి: పనసపండులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణ శక్తిని మెరుగు పరచును. అజీర్తి, అల్సర్లను కూడా నయం చేస్తుంది.

పనసపండులో ఉన్న టాప్ 15 ఆరోగ్య ప్రయోజనాలు!

క్యాన్సర్: దానిలోని యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్స్‌ క్యాన్సర్‌ వ్యాధిని నిరోధిస్తాయి. ఇందులో ఫైటోన్యూట్రియంట్స్ (phytO nutriyants) , ఐసోఫ్లేవిన్స్ (isOphlavins) ఉన్నందున కాన్సెర్ నివారణకు సహాయపడును.

పనసపండులో ఉన్న టాప్ 15 ఆరోగ్య ప్రయోజనాలు!

అధిక రక్త పోటుకు: పొటాషియం మెండుగా లభించడం వల్ల అదిక రక్తపోటును తగ్గిస్తుంది. రక్తపోటు ఉన్నవారు పొటాషియం సమృద్ధిగా లభించే పనసపండును తీసుకుంటే సమస్య తీవ్రత తగ్గుతుంది.

పనసపండులో ఉన్న టాప్ 15 ఆరోగ్య ప్రయోజనాలు!

జ్వరం, డయోరియా: అదేవిధంగా పనస తొనలు జ్వరం, డయారియా రుగ్మతలకు ఔషధంగా పనిచేస్తుందని విశ్వసిస్తారు.

పనసపండులో ఉన్న టాప్ 15 ఆరోగ్య ప్రయోజనాలు!

ఆస్తమా: ఆస్తమాతో బాధపడేవారికి పనస ఎంతో మేలు చేస్తుంది. పనస వేరును బాగా ఉడికించి దాని నుంచి వచ్చే రసం తీసుకుంటే ఆస్తమా అదుపులో ఉంటుంది.

పనసపండులో ఉన్న టాప్ 15 ఆరోగ్య ప్రయోజనాలు!

మలబద్దకం: జారుడు గుణము కలిగివున్నందున మలబద్దకం నివారించును.

పనసపండులో ఉన్న టాప్ 15 ఆరోగ్య ప్రయోజనాలు!

వ్యాధి నిరోధక శక్తి: పనస పండులో , విటమిన్ సి ఉన్నందున వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరచును. బాగా ముగ్గిన పండు మనో ఉల్లాసాన్ని కలిగిస్తుంది. అలసటను తగ్గిస్తుంది.

పనసపండులో ఉన్న టాప్ 15 ఆరోగ్య ప్రయోజనాలు!

చర్మ సౌందర్యానికి: చర్మ ఆరోగ్యాన్ని కలిగించే కణాలు త్వరగా నశించకుండా పనస కాపాడుతుంది. అలాగే ఇందులో వయసు మళ్లే లక్షణాలు తగ్గించే గుణాలు ఉన్నాయి.

పనసపండులో ఉన్న టాప్ 15 ఆరోగ్య ప్రయోజనాలు!

కళ్ళకు: పనసపండులో ఉండే న్యూట్రీషియన్ విటమిన్ ఏ ఐ విజన్ ను మెరుగుపరుస్తుంది. హెయిర్ క్వాలిటీని పెంచుతుంది. చర్మం మెరిసేలా చేస్తుంది.

పనసపండులో ఉన్న టాప్ 15 ఆరోగ్య ప్రయోజనాలు!

ఎముకలకు బాలాన్ని : ఈ పండులో అధిక మెగ్నీషియం మరియు క్యాల్షియం ఉండటం వల్ల ఎముకలకు బలాన్ని చేకూర్చడానికి సహాయపడుతుంది. మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం ఉన్న ఆహారాలను తినడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి.

పనసపండులో ఉన్న టాప్ 15 ఆరోగ్య ప్రయోజనాలు!

థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యానికి: పనసపండులో ఉన్న ఖనిజలవణాలు(మైక్రోమినిరల్స్)థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శరీరంలో హార్మోన్ ఉత్పత్తులు సమతుల్యంగా ఉంచే థైరాయిడ్ గ్రంథి ముఖ్య పాత్ర వహిస్తుంది.

పనసపండులో ఉన్న టాప్ 15 ఆరోగ్య ప్రయోజనాలు!

రక్తహీనతను తగ్గిస్తుంది: పనసపండులో ఉండే ఐరన్, రక్తహీనత సమస్యను నివారిస్తుంది. కాబట్టి రక్తహీనతతో బాధపడే వారు పనసపండు తినడం ఆరోగ్యానికి మంచిది.

పనసపండులో ఉన్న టాప్ 15 ఆరోగ్య ప్రయోజనాలు!

రక్తం గడ్డకట్టడాన్ని అడ్డుకుంటుంది: పనసలో ఉండే విటమిన్లు మరియు ఖనిజాలు శరీరంలో ఎముకల్లో రక్తం గడ్డకట్టకుండా, మరియు రక్తం సజావుగా ప్రవహించేందుకు సహాయపడుతుంది . రక్తం గడ్డకట్టే సమస్యను నివారిస్తుంది.

పనసపండులో ఉన్న టాప్ 15 ఆరోగ్య ప్రయోజనాలు!

బరువు తగ్గిస్తుంది: మంచి ఆరోగ్యకరమైన బరువు కలిగి ఉండాలనేది అందరి స్వప్నం, నిత్యం వ్యాయామం చేస్తే మీరు కోరుకున్న బరువును పొందడానికి దోహదం చేస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు ఈ సీజన్ లో దొరికే పనసపండుకు ప్రాధాన్యత ఇచ్చి బరువు తగ్గించుకోండి.

పనసపండులో ఉన్న టాప్ 15 ఆరోగ్య ప్రయోజనాలు!

టెన్షన్ నివారిస్తుంది: రోజు పరగడుపునే పనస తొనలను తినడం వల్ల శరీరానికి మేలు చేకూరుతుంది. టెన్షన్ నుండి విముక్తి కలిగిస్తుంది.

English summary

Health Benefits Of Jackfruit

Jackfruit is the seasonal fruit. Every street is filled with the aroma of this sweet fruit. The yellow coloured aromatic and tasty fruit is not just delicious, but healthy too.
Story first published: Wednesday, June 19, 2013, 13:28 [IST]
Desktop Bottom Promotion