For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గాల్ స్టోన్ (పిత్తాశయంలో రాళ్ళు)కరిగించే ఉత్తమ హోం రెమెడీలు

By Super
|

ప్రస్తుత రోజుల్లో గాల్ స్టోన్ అనేది సాధారణ సమస్యగా ఉంది. పొట్ట ఉబ్బరం, తేన్పులు, ఎసిడిటి, అరుగుదల లేకపోవ డం వంటి లక్షణాలతో ఇబ్బందిపడుతున్నారా? అయితే పిత్తాశయంలో రాళ్లు (గాల్‌స్టోన్స్‌) ఉండవచ్చని అనుమానించవచ్చు. ఎందుకంటే ఈ లక్షణాలు ఉదర సంబంధ వ్యాధికి సంబంధించినవి కావచ్చు. పిత్తాశయంలో రాళ్లు ఉన్నప్పుడు కనబడే లక్షణాలు కావచ్చు. ఉదరభాగం కుడివైపు నొప్పి, పొట్ట ఉబ్బరంగా ఉండటం, ముఖ్యంగా కొవ్వు పదార్థాలు ఆహారంలో తీసుకున్నప్పుడు, గాల్‌స్టోన్స్‌ ఏర్పడినప్పుడు సంభవిస్తుంది. దీనిని వైద్య పరిభాషలో 'కొలి లిథియాసిస్‌' అని అంటారు. గాల్ బ్లాడర్ లో స్టోన్ ఏర్పడితే, అకస్మాత్ గా నొప్పి ముఖ్యంగా పొట్ట ఉదయం కుడివైపు, బ్యాక్ పెయిన్, వికారం లేద వాంతులు, కడుపు ఉబ్బరం, అజీర్తీ, చలి వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.

ఈ గాల్ బ్లాడర్ అనేది చిన్న అవయం లివర్ కు వెనుకభాగంలో ఉంటుంది. పిత్తాశయం అనేది ఒక సంచి వంటి నిర్మాణం. ఇది కాలేయం కింది భాగంలో ఉంటుంది. ఆహారం అరుగుదలకు ఉపయోగపడే స్రావాలను నిల్వ ఉంచుతుంది. ఇవి కాలేయం నుండి స్రవిస్తాయి. పిత్తాశయంలో రాళ్లు అనేవి కొలెస్ట్రాల్‌, పిగ్మెంట్స్‌వల్ల ఏర్పడిన ఘనపదార్థాలు. ఇవి సన్నని ఇసుకు రేణువు పరిమాణం నుండి గోల్ఫ్‌బాల్‌ పరిమాణంలోగానీ, గుండ్రంగాగానీ, నున్నగాగానీ ఉండవచ్చు. వీటికి చికిత్స తీసుకోకపోతే తీవ్ర పరిణామాలకు దారి తీయవచ్చు. కొన్నిసార్లు ప్రాణాంతకం కావచ్చు. గాల్‌ స్టోన్స్‌ నివారించాలంటే, ఆరోగ్యకరమైన జీవన శైలిని మెయింటైన్ చేయాలి. గర్భధారణ, ఊబకాయం, డయాబెటిస్, కాలేయ వ్యాధులు సెడెంటరీ లైఫ్ స్టైల్, హై ఫ్యాట్ డైట్ మరియు అనీమియా సంబంధించిన కొన్ని ప్రమాధాలను నుండి రక్షణ కల్పించాలి. READ MORE: పిత్తాశయంలో రాళ్ళను సహజంగా తొలగించడం ఎలా ?

గాల్ స్టోన్స్ నివారించే కొన్ని ఉత్తమ, మరియు ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఉన్నాయి . ఇవి గాల్ స్టోన్ ను నేచురల్ గా నివారిస్తాయి...

లెసిథిన్

లెసిథిన్

లెసిథిన్ అనే మూలకం గాల్ స్టోన్ ను కరిగిస్తుంది. లిక్విడ్ లెసిథిన్ ను రోజు రెండు లేదా మూడు చెంచాలు తీసుకోవడం వల్ల గాల్ స్టోన్ కరిగించుకోవచ్చు. దీని రుచి అంత బాగుండదు కాబట్టి, లిక్విడ్ తో కలిపి తీసుకోవచ్చు. లేదా కొద్దిగా డైరీప్రొడక్ట్స్ తో మిక్స్ చేసి తీసుకోవాలి . లిసిథిన్ క్యాప్స్యూల్ కూడా అందుబాటులో ఉంటుంది.

సైలియమ్ (ఇస్పాగులా)

సైలియమ్ (ఇస్పాగులా)

సైలియమ్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. పిత్త కొలెస్ట్రాల్ ను బందిస్తుంది పిత్తాశయంలో రాళ్ళ ఏర్పడకుండా నిరోధిస్తుంది . ఇది సాధారణ ప్రేగు ఉద్యమాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది . ప్రేగు ఉద్యమాలను సాధారణంగా ప్రోత్సహిస్తుంది. సైలియమ్ మలబద్దం, గాల్ స్టోన్ ఏర్పడకుండా పరిస్థితిని నిరోధిస్తుంది. దీన్ని నీటిలో మిక్స్ చేసి నేరుగా తీసుకోవచ్చు.

పసుపు:

పసుపు:

గాల్ స్టోన్ నివారించడానికి ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ. ఎందుకంటే ఇందులో యాంటీఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. పసుపు పిత్తాన్ని, పిత్త కాంపౌండ్స్ ను కరిగిస్తుంది. ఒక చెంచా పసుపు 80శాతం గాల్ స్టోన్ ను కరిగించడానికి మద్దతు ఇస్తుంది.

బీట్ రూట్, పీర్, మరియు ఆపిల్ జ్యూస్ :

బీట్ రూట్, పీర్, మరియు ఆపిల్ జ్యూస్ :

గాల్ స్టోన్ నివారించుకోవడంలో ఒక ఎఫెక్టివ్ నేచురల్ హోం రెమెడీ. పచ్చి బీట్ రూట్ జ్యూస్, పీర్, మరియు ఆపిల్ జ్యూస్ వంటివి లివర్ ను శుభ్రపరుస్తుంది. గాల్ స్టోన్ నివారిచడానాకి ఈ మూడింటి మిశ్రమంతో జ్యూస్ చేసి త్రాగాలి.

మిల్క్ తిస్టిల్

మిల్క్ తిస్టిల్

ఓ విధమైన ముల్ల చెట్టు యొక్క విత్తనం సిలిమిరిన్, అనే ఫెవనాయిడ్ గాల్ స్టోన్ ను కరిగిస్తుంది. సిలమరిన్ పిత్తాశయానికి దారితీసే భాగాలు విడగొట్టి రాళ్ళు ఏర్పడకుండా సమాయపడుతుంది. మిల్క్ తిస్టిల్ అనే కాంపోనెంట్ లివర్ సరిగా పనిచేయడానికి సహాయపడుతుంది . దాంతో గాల్ బ్లాడర్ ప్రక్రియ చురుకుగా జరుగుతుంది.

పుదీనా

పుదీనా

ఇది బైల్ ఫ్లూను మరియు డైజెస్టివ్ జ్యూస్ ను ఉత్పత్తి చేయడంలో ఉత్తేజపరుస్తుంది. ఇందులో ఉండే టెర్పైన్ అనే కాంపౌడ్ గాల్ స్టోన్ ను చాలా ఎఫెక్టివ్ గా కరిగిస్తుంది. మరియు ఇది కూడా పిత్తాశయ నొప్పి మరియు దుస్సంకోచాలు విశ్రాంతి కలిగించి ఉపశమనానికి సహాయపడుతుంది. ఈ ఆకులను ఉడికించి పిప్పర్ మెంట్ టీ తయారుచేయవచ్చు.

 విటమిన్ సి

విటమిన్ సి

విటమిన్ సి బైల్ యాసిడ్స్, ను కొలెస్టాల్ గా మార్చేందుకు సహాయపడుతుంది. తద్వారా గాల్ స్టోన్ కరిగించబడుతుంది అందుకు మీరు విటమిన్ సి సప్లిమెంట్ లేదా విటమిన్ సి అధికంగా ఉండే ఆరెంజ్, టమోటో వంటి సిట్రస్ పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల గాల్ స్టోన్ నొన్పిని తగ్గించుకోవచ్చు .

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్ కాలేయం కొలెస్ట్రాల్ తయారీ అడ్డుకుంటుంది. ఈ కొలెస్ట్రాల్ చాలా సాధారణ గాల్ స్టోన్ ఏర్పాటుకు సహాయపడుతుంది . ఇంకా ఇది గాల్ స్టోన్ మరియు అలివియాటింగ్ పెయిన్ ను నివారించడానికి సహాయపడుతుంది.

డాండలిన్

డాండలిన్

గాల్ స్టోన్ నివారించడంలో ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ. ఈ కాంపౌడ్ లో తరాక్ససిన్ అనే కాంపౌడ్ కాలేయం నుండి పిత్తాన్ని మరియు పిత్తాశయ రాళ్ళను ఏర్పడకుండా అడ్డుకుంటుంది. మరియు కాలేయంలో కొలెస్ట్రాల్ చేరకుండా తొలగిస్తుంది . డాండలిన్ ఆకులతో హెర్బల్ టీ తయారుచేసుకొని, త్రాగాలి.

నిమ్మరసం

నిమ్మరసం

నిమ్మరసం సిట్రస్ ఫ్రూట్ గాల్ బ్లాడర్ లో కొవ్వు చేరకుండా సహాయపడుతుంది. దాంతో గాల్ స్టోను ఏర్పడకుండా నివారిస్తుంది. లెమన్ జ్యూస్ ను రోజుకు మూడు సార్లు తీసుకోవచ్చు.

ఆముదం:

ఆముదం:

గాల్ స్టోన్ నివారిస్తుంది మరియు గాల్ స్టోన్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది . ఆముదంలో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు నొప్పిని తగ్గిస్తాయి . ఆముదంలో వ్యాధినిధోకతను పెంచే శోషరస వ్యవస్థ సానుకూల ప్రభావం కలిగి ఉంటుంది. కాస్ట్రాల్ ఆయిల్ తో మసాజ్ చేస్తే నొప్పి తగ్గించుకోవచ్చు.

పీయర్స్ (బేరి పండ్లు)

పీయర్స్ (బేరి పండ్లు)

పీయర్స్ లో ఉండే పెక్టిన్ అనే కాంపౌడ్ గాల్ స్టోన్ కొలెస్ట్రాల్ ను పాస్ట్ చేసేందుకు సహాయపడుతుంది, కాబట్టి, ఇవి శరీరం నుండి బయటకు నెట్టివేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. ఇంకా గాల్ స్టోన్ ద్వారా వచ్చే నొప్పిని మరియు ఇతర లక్షణాలను నివారిస్తుంది.

ఫైబర్ రిచ్ ఫుడ్స్

ఫైబర్ రిచ్ ఫుడ్స్

ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకుంటే గాల్ స్టోన్ నిర్మాణం తగ్గడానికి సహాయపడుతుందని ఇటీవలి శాస్త్రీయ పరిశోధనల ద్వారా నిర్ధారించబడినది. ఫ్యాట్ ఉన్న ఆహారాలు నివారించడంలో వల్ల గాల్ స్టోన్ ఏర్పడకుండా నివారించవచ్చు. ఫైబర్ ఫుడ్ ప్రేగు ఉద్యమాలకు సహాయపడుతుంది మరియు జీర్ణ క్రియ వ్యవస్థకు సహాయపడుతుంది,. కొవ్వు తక్కువ ఉండే ఆహారం తీసుకోవడం వల్ల గాల్ బ్లాడర్ లో కొలెస్ట్రాల్ పెరుగుదలను నిరోధిస్తుంది . కూరగాయలు, బార్లీ, పండ్లులలో ఫైబర్ పుష్కలంగా ఉంది.

English summary

13 Best Home Remedies For Gall Stones

Gall stones has become a common problem these days. Fortunately there are best home remedies for gallstones.
Desktop Bottom Promotion