For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ్యాంగో ఐస్ క్రీమ్-సమ్మర్ టెంప్టేషన్

|

వేసవి కాలంలో ఎండ వేడి చిరాకు పెట్టించినా... మామిడి పండ్ల తియ్యదనం, కాయల పచ్చడి రుచులు గుర్తుకురాగానే ఆ వేడి చల్లగా పక్కకు జారుకుంటుంది. మామిడి పండును రొటీన్‌గా ముక్కలు కోసుకుని తినడమో, రసం తీసుకుని తాగడమో కాకుండా వెరైటీగా ఐస్ క్రీమ్ తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది...

సాయంత్రమైతే సూర్యుడు బ్రేక్‌డౌన్ అవుతాడు. చల్లచల్లగా నోటికి చాక్లెట్ ఐస్‌క్రీమ్ చిక్కితే పుంజుకొని పక్క దేశాలకు పయనమవుతాడు. చంద్రుడు వెనిల్లా తిని వెన్నెల కాయడానికి తరలివస్తాడు. తోటలో పండిన మ్యాంగో వాంగో అని ఐస్‌క్రీమ్ పార్లర్‌లో నోరూరిస్తుంది. చాక్‌లెట్టూ, నట్టూ, పుల్ల తియ్యని ఆరెంజీ... క్రీమ్ క్రీమ్ కావడానికి ఓమ్‌క్రీమ్ అంటాయి. ఏ కాలానికైనా ఐస్‌క్రీమ్ బాగుంటుంది. ఎండాకాలంలో మాత్రం దానికి గోల్డెన్ కప్ అందుతుంది. బజారులో దొరికేది ఎందుకు? ఇంట్లో ట్రై చేయండి.హెల్దీగా ఎంజాయ్ చేయండి.

Mango Ice Cream
కావలసిన పదార్థాలు:
హోల్‌మిల్క్: 500ml
క్రీమ్ (30 శాతం ఫ్యాట్ ఉన్నది): 230grms
పంచదార: 150grms
మ్యాంగో పల్ప్: 250grms
స్కిమ్డ్ మిల్క్ పౌడర్: 50grms

తయారు చేయు విధానం:
1. ముందుగా మిల్క్ బాయిలర్‌లో పాలు పోసి స్టౌ మీద పెట్టాలి. పాలను (80 డిగ్రీల సెంటిగ్రేడ్‌లో) మరగనివ్వాలి.
2. తర్వాత మరొక గిన్నెలో పంచదార, స్కిమ్డ్ మిల్క్ పౌడర్‌ని కలపాలి. ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పాలలో నెమ్మదిగా వేస్తూ, బాగా కలపాలి.
3. తర్వాత పాల మిశ్రమంలో క్రీమ్ వేస్తూ కలుపుతూ ఉండాలి.
4. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో నీళ్లు పోసి, చిక్కబడిన పాలమిశ్రమం ఉన్న గిన్నెను నీళ్లలో పెట్టి చల్లారనివ్వాలి. ఎంత త్వరగా చల్లారబెడితే ఐస్‌క్రీమ్ అంత మృదువుగా వస్తుంది.
5. పాల మిశ్రమం చల్లారక మ్యాంగో పల్ప్ వేసి కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సర్‌లో పది-పదిహేను నిమిషాలు బ్లెండ్ చేసుకోవాలి.
6. తర్వాత ఐస్‌క్రీమ్ కప్పుల్లో లేదా ఒక పాత్రలో ఈ బ్లెండ్ చేసిన మిశ్రమాన్ని పోసి, డీప్ ఫ్రీజర్‌లో పది గంటలు పెట్టి, తర్వాత మామిడి పండు ముక్కలతో సర్వ్ చేసుకోవాలి. అంతే మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ.

English summary

Homemade mango ice cream recipe


 Mango ice cream is one of the few sweets. Mango ice cream is an all time favourite hit.This light creamy ice-cream is deceptively easy to make. There is something special about the king of fruits… sweet-scented and aromatic, it imparts a luscious creamy texture to this heavenly dessert.
Story first published: Wednesday, April 24, 2013, 16:42 [IST]
Desktop Bottom Promotion