For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టమోటో పనీర్ పులావ్ రిసిపి

|

పనీర్ రిసిపి ఎల్లప్పుడు మంచి రుచికరమైన సింపుల్ డిష్. పనీర్ టమోటో కాంబినేషన్ లో తయారుచేసే పులావ్ రిసిపి మీకోసం ఇక్కడ అంధిస్తున్నాం. ఇది బిర్యానీలాగే ఉంటుంది. అయితే తయారుచేసే పద్దతి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది.

టమోటో వేయడం వల్ల రుచి మరింత అద్భుతంగా ఉంటుంది. పుల్లగా స్వీట్ గా ఆరోమా వాసనతో నోరూరిస్తున్న టమోటో పనీర్ పులావ్ ఆరోగ్యానికి కూడా మంచిది. మరియు టమోటో ఎల్లప్పుడూ ఒక హెల్తీ వెజిటేబుల్. అందువల్ల ఈ రెండింటి కాంబినేషన్లో వంటను తయారుచేయడం జరిగింది. దీనికి సైడ్ డిష్ గా రైతా చాలా బాగుంటుంది.

Tomato Paneer Pulav Rice

కావలసిన పదార్ధాలు :
బియ్యం: ఒక గ్లాస్
పనీర్: 150grms
టమాటాలు: 4-5
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి: 5-6
కరివేపాకు: రెండు రెమ్మలు
కొత్తిమీర: ఒక కట్ట
పుదీనా: ఒక కట్ట
ఉప్పు: రుచికి సరిపడా
కారం: 1tsp
పసుపు:1/4tsp
అల్లంవెల్లుల్లి పేస్ట్: 2tbsp
గరంమసాలా పొడి: 1tbsp
నూనె: సరిపడా
లవంగాలు, చెక్క,: 4: 1
షాజీర: 1/2tsp
బిర్యానీ ఆకు: 1

తయారు చేసే విధానం:
1. పనీర్ ను చిన్న ముక్కలుగా కోసుకుని కొంచెం ఉప్పు,కారం,పసుపు, పావు స్పూన్ గరంమసాలా పొడి వేసి కలిపి ఒక పావుగంట మారినేట్ చెయ్యాలి.
2. తర్వాత బియ్యం కడిగి ఒక పావుగంట నానబెట్టుకోవాలి.
3. అలాగే టమోటాలు కూడా ఉడికించి గ్రైండ్ చేసి గుజ్జులా చేసుకోవాలి. లేదా రెడీమేడ్ ప్యూరీ అయినా వాడొచ్చు.
4. పాన్ లో నూనె వేడి చేసి నాలుగు లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు, ఒక స్పూన్ షాజీర వేసి వేయించాలి.
5. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ, మిర్చి ముక్కులు వేసి కరివేపాకు వేసి వేగనివ్వాలి.
6. ఒక టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తరువాత టమాట గుజ్జు కూడా వేయాలి.
7. ఆ తర్వాత సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర వేసి బాగా వేయించి మారినేట్ చేసిన పనీర్ ముక్కలు వేసి కలపాలి.
8. తగినంత కారం, పసుపు, ఒక టేబుల్ స్పూన్ గరంమసాలా పొడి వేసి బాగా కలిపి రెండు గ్లాసుల నీళ్ళు పోసి మరిగాక బియ్యం, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి.
9. ఆవిరి పూర్తిగా తగ్గిన తరువాత మూత తీసి ఒకసారి కలిపి కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. అంటే టమోటో పనీర్ రైస్ రెడీ. వేడివేడిగా పెరుగుపచ్చడితో తింటే ఈపులావ్ చాలా రుచిగా ఉంటుంది.

English summary

Tomato Paneer Pulav Rice

Paneer recipes are always simply tasty. Here is a recipe of the same mixed with tomato and rice. This is similar to biryani, however, the preparation method is slightly different. The taste of this recipe is amazing as it has tangy tomato in it. Paneer is cottage cheese and apart from its taste, it is good for health.
Story first published: Monday, June 16, 2014, 18:28 [IST]
Desktop Bottom Promotion