For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెజిటేబుల్ కిచిడి: కిడ్స్ స్పెషల్

|

మీ పిల్లలు వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడుతారా?అలా తినని వారైతే ఈ రిసిపి వారికి చాలా బాగా సహాయపడుతుంది. వెజిటేబుల్స్ తినని వారికి ఈవిధంగా తయారుచేసి అందించవచ్చు. ఈ వంట చాలా సులభమైనది. మరియు పిల్లలకు కోసం తయారుచేసే ఈ కిచిడి డిన్నర్ స్పెషల్ గా కూడా అందివ్వొచ్చు బియ్యం, పప్పు మరియు వెజిటేబుల్స్ మూడింటి కాంబినేషన్లో మరింత ఎక్కువ టేస్ట్ ను అందిస్తుంది.

ఈ కిచిడిలో మరో ముఖ్యమైన దినుసులు, ఇండియన్ మసాలా దినుసులు. మంచి ఫ్లేవర్ తో పాటు, టేస్ట్ కూడా ఉండటంతో పిల్లలు చాలా ఇష్టంగా తినడానికి ఇష్టపడుతారు. మరి ఈ కిడ్స్ స్పెషల్ వెజిటేబుల్ కిచిడిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Vegetable Khichdi Recipe For Kids

కావల్సిన పదార్థాలు:
రైస్ - 1cup
పెసరపప్పు - 1/2cup
బంగాళాదుంప - 2 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
కాప్సికమ్ - 1 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
గ్రీన్ బఠానీలు - 1/2cup
గ్రీన్ చిల్లి - 2 (చిన్న ముక్కలుగా తరిగివి)
అల్లం - 1 అంగుళాల పొడవు ముక్క (తురిమినది)
నెయ్యి - 1 లేదా 2 tsp
హింగ్(ఇంగువ) - 1-2 చిటికెడు
జీలకర్ర - 1/2tbsp
నల్ల మిరియాలు- 4-6
లవంగాలు - 4
పసుపు - 1/6 tsp
ఉప్పు - రుచి సరిపడా
కొత్తిమీర- 1tsp (సన్నగా తరిగిపెట్టుకోవాలి)

తయారుచేయు విధానం:
1. ముందుగా బియ్యం మరియు పప్పును శుభ్రంగా కడిగి, అరగంట పాటు నీటిలో నానబెట్టుకోవాలి.
2. ఇప్పుడు కుక్కర్ ను స్టౌ మీద పెట్టి, అందులో కొద్దిగా నెయ్యి వేసి, వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక అందులో జీలకర్ర మరియు ఇంగువ వేసి వేయించుకోవాలి.
3. జీకలర్ర చిటపటలాడిన తరవ్ాత అందులో బ్లాక్ పెప్పర్, లవంగాలు, పసుపు, పచ్చిమిర్చి మరియు అల్లం వేసి, నెయ్యిలో కొద్దిసేపు వేయించుకోవాలి.
4. మసాలా దినుసులన్నీ బాగా వేగిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకొన్న వెజిటేబుల్ ముక్కలు వేసి ఐదు నిముషాలు వేగించుకోవాలి.
5. వెజిటేబుల్స్ పూర్తిగా వేగిన తర్వాత అందులో ముందుగా కడిగి పెట్టుకొన్న బియ్యం మరియు పప్పు మరియు ఉప్పు కూడా వేసి, మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి.
6. మిక్స్ చేసి రెండు నిముషాలు, మీడియం మంట మీద వేయించిన తర్వాత అందులో సరిపడా నీళ్ళు(3కప్పుల)నీటిని పోసి, కుక్కర్ మూత పెట్టి రెండు లేదా మూడు విజిల్స్ వచ్చే వరకూ వేయించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి, కుక్కర్ లో ఆవిరి మొత్తం తగ్గిన తర్వాత మూత తీసి మరోసారి మొత్తం మిశ్రమాన్ని కలగలిపి సర్వ్ చేయాలి. దీనికి రైతా బెస్ట్ కాంబినేషన్.

English summary

Vegetable Khichdi Recipe For Kids

Does your child enjoy eating vegetables? If he/she does not, then this is one the most easy recipes you can make for your little ones for dinner. Khichdi, which is a dish made solely out of of rice and lentils, can now be made into something much more tasty if you add veggies.
Story first published: Wednesday, February 19, 2014, 16:59 [IST]
Desktop Bottom Promotion