Latest Updates
-
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ.. -
అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? -
కేవలం 10 నిమిషాల్లో రవ్వ బన్ దోస,స్పెషల్ టమాటా చట్నీ.. ఈ రహస్యం తెలిస్తే రోజూ ఇదే కావాలంటారు! -
అక్టోబర్ 3న భయంకరమైన గ్రహం నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశుల వారికి కష్టాల కడలి.! -
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చు? -
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.!
కుబేర మొక్క.. మనీ ప్లాంట్ అనుకుంటే పొరపాటే.. ఇది మీ ఇంట్లో ఉంటే కనకవర్షమే.!
వాస్తు శాస్త్రం ఇంట్లో కొన్ని రకాల మొక్కలు పెట్టుకుంటే ఆరోగ్యం, సంపాదన, సంతోషం ఇలా పలు విషయాల్లో బాగా కలిసివస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. అందుకే చాలా ఇళ్లలో మనీ ప్లాంట్స్ తీగలు వేలాడుతూ కనిపిస్తుంటాయి. మనీ ప్లాంట్‌ని సంపాదనకి ప్రతీకగా భావిస్తారు. కానీ అంతకంటే పవర్‌ఫుల్ మొక్క ఇంకోటి ఉందని మీకు తెలుసా.. ఆ మొక్కను మీ ఇంట్లో సరైన దిశలో ఉంచితే ఆర్థికంగా ఇబ్బందులు ఉండవని జ్యోతిష్యం చెబుతోంది.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో జేడ్ మొక్కను సంపద, శ్రేయస్సు, అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. అందుకే ఈ మొక్కను కుబేర మొక్క లేదా సంపదను ఆకర్షించే లక్కీ ప్లాంట్‌గా పిలుస్తారు. ఈ మొక్కను క్రాసులా అని పిలుస్తారు. ఇది ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా సంపద, శ్రేయస్సు, అదృష్టంతో ముడిపడి ఉంటుంది. ఈ మొక్కను ఇంట్లో సరైన ప్రదేశంలో ఉంచడం వల్ల సానుకూల వాతావరణ ఏర్పడటంతో పాటు సంతోషం, శాంతి, ఆర్థిక శ్రేయస్సు కలుగుతాయి. మరి క్రాసులాను ఇంట్లో ఏ దిశలో ఉంచితే శుభప్రదం, ఎలాంటి ప్రదేశాల్లో ఉంచకూడదు.. ఇక్కడ తెలుసుకుందాం..
ఆర్థిక శ్రేయస్సు కోసం
ఆర్థిక పరిస్థితులు మెరుగవడం కోసం ఇంటి ఉత్తర దిశకు జేడ్ ముక్కను ఉంచడం శుభప్రదం. ఈ దిక్కు కుబేరుడితో ముడిపడి ఉంటుంది. ఈ దిశలో ఉంచడం ద్వారా ఆర్థిక వృద్ధి, శ్రేయస్సుకి అనుకూలమైన శక్తి లభిస్తుంది. ఈ మొక్కకు తగినంత సూర్యరశ్మి అందేలా చూడాలి. ఆకులకు దుమ్ము అంటకుండా, ఆరోగ్యకరంగా పెంచాలి.
వృత్తి, వ్యాపారం
ఉద్యోగం, వ్యాపారం ఇలా కెరీర్‌లో పురోగతి సాధించాలని కోరుకునే వారు తమ ఇంట్లో లేదా ఆఫీస్‌లో జేడ్ మొక్కను ఉంచుకోవాలి. ఉత్తర, తూర్పు దిశల్లో ఉంచడం ప్రయోజనకరం. ఈ దిక్కులు సానుకూలమైన వాతావరణాన్ని కలిగించేందుకు దోహదపడతాయి. సహజంగా సూర్యరశ్మి తగిలేలా చూడాలి.

కుటుంబం కోసం
ఇంట్లో ఆహ్లాదకరమైన, ఉత్సాహభరితమైన వాతావరణం ఉండటం కోసం జేడ్ మొక్కను ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇంట్లో కుటుంబీకులు కలిసి ఎక్కువగా సమయం గడిపే ప్రదేశంలో జేడ్ మొక్కను ఉంచవచ్చు. ఈ మొక్క ఇంట్లో సానుకూల శక్తిని అందించడంతో పాటు ప్రేమను పెంపొందిస్తుంది. అయితే కుటుంబంలో సమస్యలకు ఈ మొక్కే పరిష్కారం అనుకోవద్దని వాస్తు శాస్త్రం చెబుతోంది.
జేడ్ మొక్క ఆకులు దట్టంగా, ఆకుపచ్చగా ఉంటూ ఆకర్షణీయంగా ఉంటాయి. దీని ఉత్తర, తూర్పు, ఈశాన్య దిశంలో ఉంచడం శుభప్రదం. అంతేకాకుండా ఈ మొక్కను సంరక్షించడం కూడా సులభం. తరచుగా నీళ్లు పెట్టాల్సిన అవసరం లేదు. సంపద, అదృష్టానికి ఈ మొక్క ముడిపడి ఉన్న కారణంగా.. ఈ మొక్కను బెడ్‌రూమ్, బాత్‌రూమ్, టాయ్‌లెట్, వంటగది ప్రదేశాల్లో ఉంచకూడదు. తగినంత గాలి, వెలుతుర లభించే చోట ఉంచాలి. క్రమం తప్పకుండా జేడ్ మొక్కను సంరక్షిస్తూ ఉండటం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
