పుట్టుకతోనే అదృష్టవంతులు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాజ యోగం ఉన్న రాశులు ఇవే!

జీవితంలో కొందరిని చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. వాళ్లు ఏ పని స్టార్ట్ చేసినా చాలా ఈజీగా విజయం సాధిస్తారు, పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇదంతా ఎలా సాధ్యం అని ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి సమాధానం జ్యోతిష్య శాస్త్రంలో ఉంది.

గ్రహాలు, నక్షత్రాల అనుగ్రహం పుష్కలంగా ఉన్న కొన్ని రాశుల వారు పుట్టుకతోనే అదృష్టవంతులుగా పరిగణించబడతారు. సంపద, పేరుప్రఖ్యాతులు, విలాసవంతమైన జీవితం వీరికి సునాయాసంగా దక్కుతాయి. ఆ అదృష్ట రాశులు ఏవో చూడండి.

Born Lucky The 4 Most Powerfully Blessed Zodiac Signs

వృషభ రాశి

వృషభ రాశికి అధిపతి శుక్రుడు. జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని అందం, ఆనందం, ఐశ్వర్యం, విలాసాలకు ప్రతీక. అందుకే ఈ రాశిలో జన్మించిన వారి జీవితంలో సుఖసంతోషాలకు, భౌతిక వసతులకు ఎలాంటి లోటూ ఉండదు. వీరికి ఖరీదైన బట్టలు, ఆభరణాలు, అందమైన వస్తువులంటే ఎంతో ఇష్టం.

వీరు కేవలం ఖర్చు చేయడమే కాదు, డబ్బు సంపాదించడంలోనూ, భవిష్యత్తు కోసం పొదుపు చేయడంలోనూ దిట్టలు. ఆర్థిక విషయాలలో వీరు తీసుకునే ఆచితూచి అడుగులు వీరిని ఎప్పుడూ సంపన్నుల జాబితాలో ఉంచుతాయి.

కన్నయ్య కరుణ: శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు నుంచి ఈ రాశులకు కుబేర యోగమే! కన్నయ్య కరుణ: శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు నుంచి ఈ రాశులకు కుబేర యోగమే!

కుంభ రాశి

కుంభ రాశి కర్మ ఫలదాత అయిన శని భగవానుడి ప్రభావంలో ఉంటుంది. వీరు బయటకు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు కానీ వీరి బ్రెయిన్ చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది. ఎప్పుడూ పాజిటివ్ దృక్పథంతో ఉండే ఈ రాశి వారి జాతకంలో రాజయోగం పట్టే అవకాశాలు మెండుగా ఉంటాయని జ్యోతిష్యం చెబుతోంది. తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి వీరు తమ అద్భుతమైన తెలివితేటలను ఉపయోగిస్తారు. అకుంఠిత దీక్షకు తోడు అదృష్టం కూడా వెన్నంటి ఉండటం వల్ల విజయ శిఖరాలను సులభంగా చేరుకుంటారు.

సింహ రాశి

రాశిచక్రంలో ఐదవ రాశి, సూర్య భగవానుడు అధిపతిగా ఉన్న రాశి సింహ రాశి. పేరుకు తగ్గట్టుగానే వీరు తమ జీవితానికి తామే రారాజులు. సింహ రాశి వారిలో పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు, అపారమైన ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటాయి. తమ మాట తీరుతో, అద్భుతమైన వ్యక్తిత్వంతో ఎదుటివారిని ఇట్టే ఆకర్షించగలరు, ఇట్టే ప్రభావితం చేయగలరు. ఫలితంగా సమాజంలో పేరు, గౌరవం, పరపతి వీరికి చాలా త్వరగా లభిస్తాయి. ఎంతటి కష్టమైన పనినైనా తమ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో చిటికెలో పూర్తి చేసే సత్తా వీరి సొంతం.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు చాలా తెలివైన వారు, చురుకైన వారు, బలమైన సంకల్ప శక్తి కలవారు. కష్టపడి పనిచేయడం కంటే, తమ బుద్ధిబలాన్ని ఉపయోగించి స్మార్ట్ వర్క్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. కొత్త అవకాశాలను పసిగట్టి, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో వీరికి వీరే సాటి. జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం వీరికి అకస్మాత్తుగా ధనలాభం కలిగే యోగాలు ఎక్కువగా ఉంటాయి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడమే వీరి విజయ రహస్యం.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Tuesday, September 1, 2026, 7:12 [IST]
Desktop Bottom Promotion