Latest Updates
-
చట్నీ కూడా అవసరం లేని అద్భుతమైన టిఫిన్.. పోషకాలు నిండిన ముల్లంగి అటుకుల దోసె ఇంట్లోనే ఇలా చేయండి! -
ఇంటిల్లిపాదీ ఫిదా అయ్యే మినుముల చట్నీ..ఇడ్లీ, దోసెలతోనే కాదు అన్నానికి కూడా పర్ఫెక్ట్! -
ఫుడ్ ప్యాకెట్లపై కొత్త రూల్స్.. FSSAIకి సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు -
చలికాలంలో ఆరోగ్యాన్నిచ్చే హై ప్రోటీన్ వేరుశెనగ బెల్లం లడ్డు..ఈజీగా చేసుకోండిలా.. -
భారతదేశపు అతి పొడవైన రైలు జర్నీ ఇదే..కాలు కింద పెట్టకుండానే 12 రాష్ట్రాలను చూడొచ్చు! -
చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే, కీళ్ల నొప్పులు పోగొట్టే మునగాకు డ్రై ఫ్రూట్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
సొంత జెండా, కరెన్సీ ఉన్నా.. వరల్డ్ మ్యాప్ లో లేని రహస్య దేశాలు ఇవే! -
బరువు తగ్గించే రుచికరమైన ఓట్స్ ఉప్మా.. 10 నిమిషాల్లో రెడీ చేసుకోండిలా.. -
భారతే బెటర్.. అమెరికా పర్యటనపై భారతీయ యువతి షాకింగ్ అనుభవాలు! -
కూర లేకుండానే కడుపునిండా తినేయొచ్చు..రోజూ తినే చపాతీకి బదులు ఇలా క్యారెట్ రోటీ చేసి చూడండి
మాత్రలు వేసుకున్నా విటమిన్ D లోపం తగ్గడం లేదా? డాక్టర్ సలహా ఇదే!
ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య విటమిన్ D లోపం. ఎప్పుడూ విపరీతమైన అలసటగా ఉండటం, ఒళ్లంతా నొప్పులు, ఎముకలు బలహీనపడటం వంటి లక్షణాలు కనిపిస్తుంటే అది విటమిన్ D లోపం వల్లే కావచ్చని డాక్టర్లు చెబుతుంటారు. ఈ సమస్యను అధిగమించడానికి చాలా మంది ప్రతిరోజూ ఉదయం ఎండలో నిలబడటం, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం, డాక్టర్ సలహా మేరకు విటమిన్ D సప్లిమెంట్లను క్రమం తప్పకుండా వేసుకోవడం వంటివి చేస్తుంటారు.
అయినప్పటికీ కొందరిలో నెలల తరబడి ఇవన్నీ చేసినా రక్త పరీక్షల్లో విటమిన్ D స్థాయిలు మాత్రం ఏమాత్రం పెరగవు. అన్నీ సరిగ్గానే చేస్తున్నా, నా ఆరోగ్య పరిస్థితి ఎందుకు మారడం లేదు? అని మీరు కూడా ఆందోళన చెందుతున్నారా? అయితే దీనికి గల అసలు కారణాన్ని ఎయిమ్స్, హార్వర్డ్ లో శిక్షణ పొందిన ప్రముఖ డాక్టర్ సౌరభ్ సేథి వివరిస్తున్నారు.

విటమిన్-డి లోపం ఎందుకు తగ్గదు?
తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన ఒక వీడియోలో డాక్టర్ సౌరభ్ సేథి.. విటమిన్ D లోపాన్ని అధిగమించే సరైన పద్ధతిని వివరించారు. మనం సూర్యరశ్మి ద్వారా కానీ, ఆహారం లేదా ట్యాబ్లెట్ల రూపంలో కానీ విటమిన్ Dని శరీరంలోకి పంపితే మాత్రమే సరిపోదని, అది లోపల యాక్టివ్ గా మారడం కూడా చాలా అవసరమని ఆయన స్పష్టం చేశారు.
సులభంగా చెప్పాలంటే మనం తీసుకునే విటమిన్ D అనేక ప్రక్రియల తర్వాత మాత్రమే శరీరానికి ఉపయోగపడేలా మారుతుంది. ఈ మార్పిడి ప్రక్రియలో మన లివర్, కిడ్నీలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. అయితే వీటన్నింటితో పాటు విటమిన్ D ని క్రియాశీలం చేయడానికి శరీరానికి మెగ్నీషియం అనే ఖనిజం కూడా తప్పనిసరిగా అవసరం. మీ శరీరంలో మెగ్నీషియం లోపం ఉన్నట్లయితే, మీరు ఎంత ఎండలో ఉన్నా, ఎన్ని సప్లిమెంట్లు తీసుకున్నా శరీరం ఆ విటమిన్ Dని సరిగ్గా ఉపయోగించుకోలేదు. అందువల్లే చాలా మందికి దీని పూర్తి ప్రయోజనం అందడం లేదు.
మెగ్నీషియం లోపాన్ని ఎలా అధిగమించాలి?
శరీరంలో విటమిన్ D సమర్థవంతంగా పనిచేయాలంటే ముందుగా మెగ్నీషియం లోపాన్ని సరిదిద్దుకోవడం ముఖ్యం. ఇందుకోసం మీ రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన పోషకాహారాలను చేర్చుకోవాలని డాక్టర్లు సిఫార్సు చేస్తున్నారు.
డ్రై ఫ్రూట్స్: బాదం, జీడిపప్పు వంటి వాటిని ప్రతిరోజూ మితంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన మెగ్నీషియం లభిస్తుంది.
విత్తనాలు: గుమ్మడికాయ గింజలు మరియు పొద్దుతిరుగుడు విత్తనాల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.
ఆకుకూరలు: ముఖ్యంగా పాలకూరతో పాటు ఇతర ఆకుపచ్చని కూరగాయలను మీ భోజనంలో తప్పనిసరిగా భాగం చేసుకోవాలి.
పప్పుధాన్యాలు: శనగలు, చిక్కుళ్లు మరియు ఇతర పప్పుధాన్యాలను తరచుగా తినడం ఎంతో మేలు చేస్తుంది.
తృణధాన్యాలు, బీన్స్: వివిధ రకాల తృణధాన్యాలు, బీన్స్ ను ఆహారంలో చేర్చుకోవడం వల్ల మెగ్నీషియం స్థాయులు సహజంగానే మెరుగుపడతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications

