Latest Updates
-
చలికాలంలో జీర్ణశక్తిని పెంచే క్యారెట్ పచ్చిమిర్చి పచ్చడి..ఇలా చేస్తే పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ! -
మెరిసే చర్మం కావాలా? ఇంట్లోనే సబ్బును ఈజీగా తయారు చేసుకోండిలా.. -
మాత్రలు వేసుకున్నా విటమిన్ D లోపం తగ్గడం లేదా? డాక్టర్ సలహా ఇదే! -
చట్నీ కూడా అవసరం లేని అద్భుతమైన టిఫిన్.. పోషకాలు నిండిన ముల్లంగి అటుకుల దోసె ఇంట్లోనే ఇలా చేయండి! -
ఇంటిల్లిపాదీ ఫిదా అయ్యే మినుముల చట్నీ..ఇడ్లీ, దోసెలతోనే కాదు అన్నానికి కూడా పర్ఫెక్ట్! -
ఫుడ్ ప్యాకెట్లపై కొత్త రూల్స్.. FSSAIకి సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు -
చలికాలంలో ఆరోగ్యాన్నిచ్చే హై ప్రోటీన్ వేరుశెనగ బెల్లం లడ్డు..ఈజీగా చేసుకోండిలా.. -
భారతదేశపు అతి పొడవైన రైలు జర్నీ ఇదే..కాలు కింద పెట్టకుండానే 12 రాష్ట్రాలను చూడొచ్చు! -
చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే, కీళ్ల నొప్పులు పోగొట్టే మునగాకు డ్రై ఫ్రూట్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
సొంత జెండా, కరెన్సీ ఉన్నా.. వరల్డ్ మ్యాప్ లో లేని రహస్య దేశాలు ఇవే!
ఆరు కోట్ల బిజినెస్, రూ. 2 కోట్ల ఇన్సూరెన్స్ కోసం భర్తకు ఫుడ్ లో విషం.. కన్నకొడుకునూ వదలని కిరాతక తల్లి!
డబ్బు, ఆస్తిపై వ్యామోహం మనుషుల మధ్య బంధాలను ఎంతలా చిదిమేస్తుందో చెప్పడానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ లో జరిగిన ఈ ఘటన ఒక సజీవ సాక్ష్యం. కట్టుకున్న భర్త, కన్న కొడుకు, మేనల్లుడిని ఏడాది పాటు ఆహారంలో విషం కలిపి చంపాలని చూసిన ఓ కిరాతక మహిళ ఉదంతం స్థానికంగా పెను కలకలం రేపుతోంది.
వసుంధర ప్రాంతానికి చెందిన 42 ఏళ్ల రేణు, తన భర్త సుశీల్ కుమార్ భట్నాగర్ (45) నిర్వహిస్తున్న రూ. 6 కోట్ల టర్నోవర్ గల ట్రావెల్ ఏజెన్సీ వ్యాపారాన్ని పూర్తిగా చేజిక్కించుకోవాలని, అతను చనిపోతే 2 కోట్ల రూపాయలు ఇన్య్యూరెన్స్ డబ్బులు వస్తాయని కుట్ర పన్నింది. ఇందుకోసం ఆమె స్లో పాయిజన్ మార్గాన్ని ఎంచుకుంది. సుమారు 12 నెలల పాటు భర్త, 16 ఏళ్ల కుమారుడు వంశ్, 21 ఏళ్ల మేనల్లుడు దేవ్ భట్నాగర్ తినే ఆహారంలో రోజూ కొద్దికొద్దిగా సీసం (Lead) కలుపుతూ వచ్చింది.

అనారోగ్యంతో మొదలైన అనుమానం
గత ఏడాది ఆగస్టు 21న సుశీల్ తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో ఈ వ్యవహారం మొదలైంది. వైద్య పరీక్షల్లో ఆయన రక్తంలో అత్యధిక స్థాయిలో సీసం ఉన్నట్లు తేలింది. హాస్పిటల్ లో రెండు నెలలు ట్రీట్మెంట్ పొందినా, ఆ తర్వాత మళ్లీ అనారోగ్యం పాలయ్యారు. కొద్ది రోజులకే కొడుకు, మేనల్లుడి ఆరోగ్యం కూడా క్షీణించి, మెడికల్ రిపోర్టుల్లో అందరికీ క్రానిక్ లెడ్ పాయిజనింగ్ అని తేలడంతో సుశీల్ కు బలమైన అనుమానం కలిగింది.
కూతురు చెప్పిన నిజంతో బట్టబయలు
సరైన ఆధారాలు లేక సతమతమవుతున్న సుశీల్ కు సెప్టెంబర్లో తన 12 ఏళ్ల కుమార్తె చెప్పిన నిజం షాక్ ఇచ్చింది. అమ్మ తనకు, తన తల్లికి (అమ్మమ్మకు) ఆహారాన్ని పక్కన పెట్టి, మిగిలిన అందరి భోజనంపై ఏదో స్ప్రే చేసేది అని ఆ చిన్నారి చెప్పింది. దీనిపై నిలదీయగా రేణు సమాధానం చెప్పకుండా ఢిల్లీలోని తన సోదరి ఇంటికి పారిపోయింది.

వ్యాపారం, ఇన్సూరెన్స్ కోసమే..
సెప్టెంబర్ 24న సుశీల్ ఇందిరాపురం పోలీసులకు కంప్లెయింట్ చేయడంతో డీసీపీ రిజుల్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. నవంబర్ 23న ఢిల్లీలోని జిల్మిల్ కాలనీలో రేణును అరెస్ట్ చేశారు. విచారణలో ఆమె విస్తుపోయే నిజాలు ఒప్పుకుంది. వ్యాపారాన్ని చూసుకుంటున్న భర్త, మేనల్లుడిని అడ్డు తొలగించుకోవడంతో పాటు, తండ్రికి మద్దతుగా ఉన్నాడనే కక్షతో కన్నకొడుకును కూడా చంపాలనుకున్నట్లు తెలిపింది. భర్త పేరుపై ఉన్న రూ. 2 కోట్ల లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీకి రేణుయే నామినీగా ఉండటం గమనార్హం. ఈ కుట్రలో సహకరించిన రేణు తల్లి లతా సక్సేనా, సోదరుడు రవి, బావ సుశీల్ గిర్ధార్, మరో వ్యక్తి బబ్లూపైనా కేసులు నమోదయ్యాయి.



Click it and Unblock the Notifications
