Latest Updates
-
చలికాలంలో ఆరోగ్యాన్నిచ్చే హై ప్రోటీన్ వేరుశెనగ బెల్లం లడ్డు..ఈజీగా చేసుకోండిలా.. -
భారతదేశపు అతి పొడవైన రైలు జర్నీ ఇదే..కాలు కింద పెట్టకుండానే 12 రాష్ట్రాలను చూడొచ్చు! -
చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే, కీళ్ల నొప్పులు పోగొట్టే మునగాకు డ్రై ఫ్రూట్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
సొంత జెండా, కరెన్సీ ఉన్నా.. వరల్డ్ మ్యాప్ లో లేని రహస్య దేశాలు ఇవే! -
బరువు తగ్గించే రుచికరమైన ఓట్స్ ఉప్మా.. 10 నిమిషాల్లో రెడీ చేసుకోండిలా.. -
భారతే బెటర్.. అమెరికా పర్యటనపై భారతీయ యువతి షాకింగ్ అనుభవాలు! -
కూర లేకుండానే కడుపునిండా తినేయొచ్చు..రోజూ తినే చపాతీకి బదులు ఇలా క్యారెట్ రోటీ చేసి చూడండి -
చికెన్ కబాబ్ బిర్యానీ..ఇంత రుచికరమైన చికెన్ బిర్యానీ ఎప్పుడూ తిని ఉండరు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
మూత్ర విసర్జన చేసిన వెంటనే మళ్లీ టాయిలెట్ కు వెళ్లాల్సి వస్తోందా? అసలు కారణాలు ఇవే! -
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే
ఫుడ్ ప్యాకెట్లపై కొత్త రూల్స్.. FSSAIకి సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
మనం ప్రతిరోజూ సూపర్ మార్కెట్లలో, కిరాణా షాపుల్లో కొనుగోలు చేసే ప్యాక్ చేసిన ఆహార పదార్థాల్లో ఆరోగ్యానికి హాని చేసే కొవ్వు, చక్కెర, ఉప్పు ఎంత మోతాదులో ఉన్నాయో ఇకపై చూసిన వెంటనే గుర్తించవచ్చు. వినియోగదారులు పోషకాహార సమాచారాన్ని సులభంగా అర్థం చేసుకుని, సమాచారంతో కూడిన సరైన ఆహార ఎంపికలు చేసుకునేందుకు సహాయపడేలా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI)కు కీలక ఆదేశాలు జారీ చేసింది.
అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు కలిగిన ఉత్పత్తుల ప్యాకేజింగ్ ముందు భాగంలో ప్రత్యేకంగా, స్పష్టంగా కనిపించే హెచ్చరిక చిహ్నాలను తప్పనిసరి చేయాలని జస్టిస్‌లు జె.బి. పర్దివాలా, కె.వి. విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

మూడు వేర్వేరు ఎరుపు రంగు గుర్తులు
వినియోగదారులు షాపింగ్ చేసే ముందే అనారోగ్యకరమైన పదార్థాలను త్వరగా గుర్తించేలా, ప్యాక్ చేసిన ఆహార ఉత్పత్తుల ముందు భాగంలో ఎరుపు రంగు షడ్భుజి (హెక్సాగాన్) ఆకారంలో హెచ్చరిక లేబుళ్లను ముద్రించాలి. అధిక కొవ్వు, అధిక చక్కెర, అధిక ఉప్పు కోసం మూడు వేర్వేరు లేబుళ్లు ఉండాలని కోర్టు తెలిపింది. ఈ మూడింటిని కలిపి ఒకే చిహ్నం ఉంచితే సరిపోదని స్పష్టం చేసింది.
ఒక పదార్థంలో ఈ మూడు నిర్దేశిత పరిమితికి మించి ఉంటే, సంబంధిత సమాచారం, ఫొటోతో కూడిన మూడు ప్రత్యేక గుర్తులను ఉంచాలి. సాధారణ కాంతిలోనూ అక్షరాలు స్పష్టంగా చదవగలిగేలా, ప్యాకెట్ ప్రధాన ప్రదర్శన ప్రాంతంలో ప్రతి చిహ్నం 4 నుండి 5 శాతం స్థలాన్ని ఆక్రమించాలని నిర్దేశించింది. షాపింగ్ చేసేటప్పుడు ఆరోగ్యకరమైన ఫుడ్స్ వేగంగా ఎంచుకోవడానికి ఇది సహాయపడుతుంది.
శాస్త్రీయ ప్రమాణాలు
హెచ్చరిక పరిమితులను నిర్ధారించేటప్పుడు కేవలం అదనంగా కలిపే పదార్థాలనే కాకుండా, ఆ ప్రొడక్ట్ లోని మొత్తం చక్కెర, సంతృప్త కొవ్వును పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఈ ప్రమాణాలను రూపొందించేటప్పుడు శాస్త్రీయ ఆధారాలు, పరిశోధనలతో కూడిన సమతుల్య విధానం అవసరమని సూచించింది. పరిమితులు మరీ తక్కువగా ఉంటే దాదాపు ప్రతి ఫుడ్ ప్రొడక్ట్ పై హెచ్చరికలు వచ్చి వాటి ప్రభావం తగ్గుతుందని, మరీ ఎక్కువగా ఉంటే హానికర స్థాయిలో ఉన్న ప్రొడక్టులు తప్పించుకునే అవకాశం ఉందని ధర్మాసనం హెచ్చరించింది.

పిల్లల్లో అవగాహన, తదుపరి విచారణ
కేవలం ప్యాకెట్లపై లేబుళ్లతోనే సరిపెట్టకుండా, పిల్లల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన పెంచాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. ప్రజారోగ్య పరిరక్షణలో పారదర్శకతను పెంచేందుకు సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం ఒక కీలక ముందడుగుగా చెప్పవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
