Latest Updates
-
గురు గ్రహం నక్షత్ర మార్పు: ఈ నాలుగు రాశుల వారికి చదువు, ఉద్యోగాల్లో మహర్దశ ప్రారంభం.! -
ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
చికెన్ కర్రీలోకి అదిరిపోయే కాంబినేషన్.. కేరళ మలబార్ పరోటా ఇలా చేస్తే పొరలు పొరలుగా వస్తుంది! -
అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో కరకరలాడే పంచ్ మెల్ దాల్ పకోడా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? గుండె జబ్బులకు ఇది ముందస్తు సంకేతమా! -
ఆకు కూరల కంటే ఎక్కువ బలం: మోకాళ్లలో గుజ్జు రప్పించి, ఎముకల్ని గట్టిగా చేసే నల్లేరు రోటి పచ్చడి -
Fridge Vastu: మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 3 వస్తువులు పెడితే పట్టిందల్లా బంగారమే! -
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.!
వాస్తు ప్రకారం తులసి మొక్క వద్ద ఏ వస్తువులు ఉంచకూడదో తెలుసా.. లేదంటే అరిష్టాలు తప్పవు.!
హిందూ మతంలో తులసి మొక్కను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే ఎప్పుడూ తులసి మొక్కకి జలాభిషేకం, దీపారాధన, పూజలు తప్పనిసరిగా పాటిస్తారు. ఇక శ్రావణ మాసంలో లక్ష్మీదేవి స్వరూపిణిగా తులసిని పూజిస్తారు. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన తులసిని శుభానికి, శ్రేయస్సుకి, పాజిటివ్ ఎనర్జీకి చిహ్నంగా భావిస్తారు. ఈ క్రమంలో వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క చుట్టూ కొన్ని వస్తువులు ఉంచడం అశుభంగా భావిస్తారు. మరి అవేంటో చూద్దాం..

చెత్త వేయకూడదు
వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క చుట్టూ చెత్త కుండీలు గాని, చెత్తాచెదారం కానీ పేరుకుపోకుండా చూడాలి. మొక్క చుట్టూ ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తులసి చుట్టూ చెత్త వేయడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా నివారిస్తుంది. ఫలితంగా మానసిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
పాద రక్షలు
తులసి మొక్క సమీపంలో బూట్లు, చెప్పులు కానీ పెట్టకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. సాధారణంగా తులసి మొక్కను ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచుతారు. ఈ క్రమంలో మీ ఇంట్లో కూడా అలాగే ఉంటే.. తులసి సమీపంలో పాదరక్షలు పెట్టకుండా చూసుకోండి. లేదంటే వాస్తు దోషాలు కలగవచ్చు. బయట నుంచి వచ్చే దుమ్ము, మురికి పాదరక్షలకి అంటుకోవడం ద్వారా ఆ గాలి తులసి మొక్కకు పారే ప్రమాదం ఉంది. అందుకే ఆ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి.
ముళ్ల మొక్కలు
తులసి మొక్క దగ్గర ముళ్ల మొక్కలను నాటడం అశుభంగా వాస్తు శాస్త్రం పరిగణిస్తోంది. తులసి సమీపంలో ముళ్ల మొక్కలు ఉంటే అది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీపై ప్రభావం చూపిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం సరైన దిశ, ప్రదేశంలో తులసి మొక్కను ఉంచాలి.

పాత వస్తువులు
పాత వస్తువులు, వాడని వస్తువులను తులసి కుండీ దగ్గర ఉంచకూడదు. ఇది ప్రతికూల ప్రభావాన్ని కలుగజేస్తుంది. శుభ్రమైన, మంచి ప్రదేశంలో మాత్రమే తులసీ మొక్కను ఉంచి కాపాడుకోవాలి. ఆ ప్రదేశంలో చీపురు, తుడుపు కర్ర, చెత్త బుట్ట, ఇంకా ఇంటిని, వాకిలిని శుభ్రపరిచే ఇతర వస్తువులను ఉంచకూడదు. దీని వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ తగ్గిపోయి నెగిటివ్ ఎనర్జీ పడుతుంది.
వాస్తు సలహాలు
ఎప్పుడైనా తులసి మొక్క ఎండిపోయినా, వాడిపోయినా వెంటనే వాస్తు ప్రకారం మంచి రోజు చూసి కొత్త మొక్కను నాటడం శ్రేయస్కరం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
