Latest Updates
-
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే! -
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్ స్వీట్.. వీటిని కలిపారంటే టేస్ట్ ఎవర్ గ్రీన్.! -
పంద్రాగ్రస్ట్ స్పెషల్.. బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ పాత్రలో చాలా ఈజీగా తిరంగా కేక్.! -
ప్రాణాల మీదకు తెచ్చిన మొబైల్ పిచ్చి.. షకీలాకు మెడ సర్జరీ, కారణం తెలిస్తే షాక్! -
80వ స్వాతంత్ర్య దినోత్సవం.. వాట్సప్ స్టేటస్, కోట్స్.. మన భారతీయులకు ఇలా విషెస్ తెలియజేయండి! -
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన ఆవ నూనె తయారీ.. మిక్సీ ఉంటే చాలు! -
ఆగస్టు 15 స్పెషల్..పక్కా స్వీట్ షాప్ స్టైల్ మోతీచూర్ లడ్డూ.. మీ ఇంట్లోనే ఇలా సింపుల్ గా చేసేయండి -
రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా.. మీ ఫ్యామిలీలో ఈ సమస్యలు రావడం పక్కా.! -
మన ఇంట్లో పెరిగే ఈ చెట్టు పండ్లే కాదు.. ఆకులు సైతం రోగాలతో పోరాడతాయని తెలుసా.!
గజలక్ష్మీ రాజయోగం 2023 ఈ రాశుల వారికి కలిసిరానున్న అదృష్టం, ధనలాభం
వేద జ్యోతిష్యం ప్రకారం శుక్రుడు కర్కాటక రాశిలో తిరోగమనం చెంది, గజలక్ష్మీ రాజయోగాన్ని ఏర్పరుస్తాడు. ఈ 3 రాశుల వారు లక్ష్మీదేవి ఆశీస్సులతో అపారమైన సంపదను, విజయాన్ని, కీర్తిని, అదృష్టాన్ని పొందుతారు.

గజలక్ష్మీ రాజయోగం అంటే ఏంటి?
ప్రస్తుతం రాహువు మేషరాశిలో సంచరిస్తున్నాడు. ఇదే సమయంలో బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ గ్రహ సంచారం గజలక్ష్మీ రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. ఈ యోగంతో కొన్ని రాశుల వారు లాభపడనున్నారు. జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు, సంపద, విలాసం లభించనున్నాయి. హిందూ పురాణాల్లో ఏనుగును అత్యంత పవిత్రమైన జీవిగా పరిగణిస్తారు. అలాగే లక్ష్మీదేవి సానుకూలత, డబ్బు, సంపద, శ్రేయస్సుకు అధిపతి. లక్ష్మీదేవి పక్కన ఉంటుంది ఏనుగు.
ఈసారి శుక్రుడు కర్కాటక రాశిలో తిరోగమనంలో ఉన్నాడు. ఇది గజలక్ష్మీ రాజయోగం ఏర్పడటానికి దారితీస్తుంది ఈ రాజయోగ ప్రభావం అన్ని రాశుల వారిలోనూ కనిపిస్తుంది. అయితే ఈ 3 రాశులకు అనుకోని విధంగా ధనలాభ యోగం ఏర్పడుతుంది. వారి అదృష్టం పెరుగుతుంది. అష్టక్కులు గజలక్ష్మీ రాజయోగం ద్వారా ఎవరికి అదృష్టం కలుగుతుందో తెలుసుకుందాం.
తులారాశి
తులారాశి వారికి గజలక్ష్మీ రాజయోగం శుభప్రదమని చెబుతారు. శుక్రుడు కర్మ ఇంటిపై రాశి నుంచి తిరోగమనంలో ఉన్నాడు. ఈ కారణంగా వ్యాపారంలో వృద్ధి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీ ప్రణాళికలు విజయవంతం అవుతాయి. సహోద్యోగులతో సంబంధం మెరుగుపడుతుంది. ఉన్నత స్థాయి ఉద్యోగుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. అలాగే ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భౌతిక ఆనందం మరియు వనరులు కూడా పెరుగుతాయి. వ్యాపారాన్ని నడుపుతున్న వారు తమ తమ వ్యాపారాల్లో భారీ లాభాలు పొందుతారు.
మిథునరాశి
మిథునరాశి వారికి గజలక్ష్మీ రాజయోగం అనుకూలతను తీసుకురానుంది. మిథున రాశి వారికి శుక్రుడు తిరోగమం వల్ల లాభం చేకూరనుంది. తద్వారా మిథునరాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. డబ్బుపై నియంత్రణ లభిస్తుంది. అనవసర ఖర్చులు తగ్గిస్తారు. డబ్బును పెట్టుబడిగా పెడతారు లేదా సేవింగ్స్ చేసుకుంటారు. మీడియా, మార్కెటింగ్, విద్య, కమ్యూనికేషన్లకు సంబంధించిన రంగాల్లో ఉన్న వారికి మంచి ఫలితాలు లభిస్తాయి.
కన్యరాశి
కన్య రాశి వారికి గజలక్ష్మీ రాజయోగం ఏర్పడటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆదాయ గృహంలో కన్య రాశి నుంచి శుక్రుడు తిరోగమనంలో ఉన్నాడు. ఈ కాలంలో కన్యరాశి వారు పెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందుతారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications