Latest Updates
-
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే..
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహ గోచారం ఎంతో కీలకమైనది భావిస్తారు. ఈ గ్రహ సంచారం వివిధ రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులను తీసుకువస్తుంది. తెలివి, వాక్చాతుర్యం, వ్యాపారం, వృత్తి, ధనానికి అధిపతిగా భావించే బుధుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశి చక్రం వారితో పాటు ఇతర రాశుల వారిపైనా వరాల జల్లు కురిపిస్తుంది. ఈ క్రమంలో ఈ నెల 7న బుధుడు కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. దాదాపు 20 రోజుల పాటు అక్కడే ఉంటుండటంతో ఈ నాలుగు రాశి వారి జీవితాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరి ఏయే రాశుల వారి దశ తిరగనుంది.. ఆ అదృష్ట రాశుల్లో మీరు ఉన్నారా.. చూద్దాం..

మేష రాశి
కన్యా రాశిలోకి బుధ గ్రహ సంచారంతో మేష రాశి వారికి ప్రధానంగా వృత్తిపరంగా కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు. సెప్టెంబర్ 7 నుంచి 26 వరకు కన్యా రాశిలోనే ఉండనున్నాడు. ఫలితంగా వీరికి ఉద్యోగం చేసే ప్రదేశంలో కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు. ఆదాయం పెంచుకోవడానికి కొత్త అవకాశాలు అందుకుంటారు. వ్యాపార రంగంలో కొత్త ఒప్పందాలు, ప్రాజెక్టుల నుంచి ప్రయోజనం పొందుతారు. మునుపటి కంటే కూడా ఆర్థిక పరిస్థితులు బలపడతాయి.

కన్యా రాశి
బుధ గ్రహ గోచారం కన్యా రాశిలోనే ఉండటంతో వీరు ప్రత్యేక ప్రయోజనాలు అందుకోనున్నారు. ఉద్యోగ అన్వేషణలో ఉన్న వారు శుభవార్త అందుకునే సూచనలు ఉన్నాయి. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నవారు కొత్త బాధ్యతలు అందుకోవచ్చు. పదోన్నతి పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సమాజంలో ప్రతిష్ఠ, గౌరవం పెరుగుతాయి. వ్యాపారం చేస్తున్న వారికి కూడా విస్తరణకు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి.
తులా రాశి

బుధ గ్రహ సంచారం తులా రాశి వారికి విలాసవంతమైన జీవితంతో పాటు సౌకర్యాలను అందించనుంది. ఆస్తి కొనుగోళ్లు లేదా వాహన కొనుగోళ్లకి సంబంధించి ప్రణాళికలు పూర్తవుతాయి. పెండింగ్ పనుల్లో వేగం పెరుగుతుంది. ఆకస్మికంగా ఆర్థిక లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనుబంధం పెరుగుతాయి.

కుంభరాశి
కుంభ రాశి వారికి బుధ గ్రహ గోచారంతో ప్రత్యేకంగా అదృష్టం కలిసి రానుంది. పనిలో ఉన్న అడ్డంగులు తొలగిపోతాయి. కొత్త అవకాశాలు అందుకునే సూచనలు ఉన్నాయి. వ్యాపారం చేస్తున్న వారికి లాభదాయకమైన ఒప్పందాలు అందుకుంటారు. దీంతో భవిష్యత్తులో ప్రయోజనం అందుకుంటారు. మీరు పెట్టిన పెట్టుబడికి సానుకూల ఫలితం కనిపించి ఆర్థిక లాభాలు అందుకుంటారు. కీలక పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. చేస్తున్న పనుల్లో విజయం అందుకుంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications