Latest Updates
-
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా.. -
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం!
శుక్ర-శని కలయికతో ఖప్పర్ యోగం, వచ్చే నెల రోజులు ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే
వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహాల కదలికలు శుభ, అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. ఈ యోగాల ప్రభావం ప్రతి ఒక్కరిపై ఉంటుంది. నిర్మాణాత్మక యోగాల ప్రభావం అన్ని రాశుల వారి జీవితాలపై కనిపిస్తుంది. బుధుడు, శుక్రుడు, సూర్యుడు మూడు గ్రహాలు జులై నెలలో లక్ష్మీనారాయణ యోగాన్ని, బుదాదిత్య యోగాన్ని ఏర్పరుస్తాయి. ఈ రెండు యోగాలు శుభ యోగాలు.
ఇదే సమయంలో శని, శుక్ర వక్ర స్థానం వల్ల ఖప్పర్ యోగం ఏర్పడుతుంది. దీనిని అశుభ యోగంగా పరిగణిస్తారు. ఈ యోగం ప్రభావం అన్ని రాశులపైనా కనిపిస్తుంది. అయితే 3 రాశుల వారు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. వచ్చే 30 రోజుల పాటు ఈ 3 రాశుల వారు ఏ పని చేసినా ఓటమే ఎదురవుతుంది. అందుకే ఆచితూచి అడుగులు వేయాలని జ్యోతిషశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఏ రాశులు వారి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారు ఖప్పర్ యోగం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగు, వ్యాపార వృత్తుల్లో ఉన్న వారు కొన్ని రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ 30 రోజుల పాటు ఖర్చులను అదుపులో ఉంచుకోవడం చాలా చాలా కీలకం. లేదంటే అప్పులు పెరిగి ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. ఉద్యోగాల్లో ఉన్న వారు సహోద్యోగులతో సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు కూడా బాధిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పెరుగుతాయి. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారు కొన్ని రోజులు ఆగడం మంచిది. ఉద్యోగ మార్పు చెడు ఫలితాన్ని ఇస్తుంది.
కన్య రాశి:
ఖప్పర్ యోగం కన్యారాశి వారికి సమస్యలు కలిగించే అవకాశాలు ఉన్నాయి. వివాహం అయిన వారికి దాంపత్య బంధంలో సమస్యలు వస్తాయి. దంపతుల మధ్య సాన్నిహిత్యం కొరవడుతుంది. అనవసర ఖర్చులు పెరిగిపోతాయి. దీని వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయి. ఉద్యోగులు సహోద్యోగులకు, ఉన్నత ఉద్యోగులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. గాసిప్స్ కు దూరంగా ఉండాలి. వేరొకర చెప్పినవి కూడా మీపైనే ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి సంబంధిత సమస్యలు ఎదురవుతాయి.
మీనరాశి:
మీన రాశి వారు ఖప్పర్ యోగం వల్ల చెడు ప్రభావాలను ఎదుర్కొంటారు. ఈ 30 రోజుల పాటు మీన రాశి వారికి గ్రహాల కదలియ, సంచారం, కలయిక ఏమాత్రం కలిసి రావడం లేదు. అందుకే జాగ్రత్తగా ఉండాలని జ్యోతిషశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. వీలైనంత వరకు డబ్బులు ఆదా చేయడానికి ప్రయత్నించాలి. అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. ప్రతి రూపాయిని మిగిలడానికే ప్రయత్నించాలి. ఉద్యోగులు, వ్యాపారస్థులకు కష్టాలు తప్పవు. జాగ్రత్తతో నష్టాన్ని తగ్గించుకోవచ్చు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications
