Latest Updates
-
వంట చేసే ఓపిక లేదా? కేవలం 10 నిమిషాల్లో ఈ పచ్చిమిర్చి నువ్వుల రైస్ చేసి చూడండి, టేస్ట్ అదుర్స్! -
కుజ-గురు కలయికతో ద్విద్వాదశ యోగం..ఈ 4 రాశులకు అడుగడుగునా అదృష్టమే! -
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద జిల్లా ఏదో తెలుసా?.. 90% మంది తప్పుగానే చెప్తారు! -
Jeera Biscuits Recipe:హెల్తీ, టేస్టీ జీరా బిస్కెట్స్..బేకరీని మించిన రుచితో ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
బ్రకోలీ, బాదంతో సూపర్ హెల్తీ పాస్తా..రుచి చూస్తే వదిలిపెట్టరు! -
3 నిమిషాల మ్యాజిక్..ఈ చిన్న పనితో 13 రకాల క్యాన్సర్లకు చెక్! -
ఈ ఐదు లక్షణాలు ఉంటే మీ భర్త బంగారమే.. మరి మీవారిలో ఈ గుణాలు ఉన్నాయా.? -
కర్ణాటక స్పెషల్ వాంగి బాత్ పొడి..ఒక్కసారి చేస్తే 4 నెలలు నిల్వ..బోర్ కొట్టించే కూరలు కూడా అమృతమైపోతాయ్.. -
కృష్ణాష్టమి స్పెషల్: చిన్ని కన్నయ్యకి ఎంతో ప్రీతికరమైన అటుకుల లడ్డూ.. చక్కెర లేకుండా భలే రుచిగా.! -
పుట్టుకతోనే అదృష్టవంతులు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాజ యోగం ఉన్న రాశులు ఇవే!
ఈరోజు శనిత్రయోదశి, ఇలా చేస్తే శనిదోషం తొలగిపోయి లక్ష్మీ తాండవం ఖాయం, ఈ వస్తువులను అస్సలే కొనకూడదు
ఇవాళ (జులై 1, 2023) శనిత్రయోదశి. త్రయోదశి శనివారం రోజు వస్తే శని త్రయోదశిగా వ్యవహరిస్తారు. ఈ రోజు శని దేవుడికి చెందినది. అలాగే ఈ రోజు మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైనది. శని గ్రహం దోషాలతో బాధపడే వారు ఈ రోజు కొన్ని పరిహారాలు చేస్తే దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. శనిదేవుని ఆధీనంలో ఉండే తిథి, నక్షత్రం, వారం, మాసం శనివారం నాడు వస్తుంది కాబట్టి శనిత్రయోదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది.

అర్ధాష్టమి శని, అష్టమ శని కాలంలో ఉన్న వ్యక్తులు శని ప్రతికూల ప్రభావాన్ని తొలగించడానికి ఈ రోజు చేసే నివారణలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ రోజు శనిరోజు అలాగే మహావిష్ణువుకు ఇష్టమైన రోజు శనివారం, త్రయోదశి అంటే పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైనది. అందుకే ఈ రోజు శనిదేవునితో పాటు శివకేశవులను ప్రార్థిస్తే మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
పసుపు నీటితో చేసే ఈ పరిహారంలో దోషాలు తొలగిపోతాయి:
శనిత్రయోదశి రోజు తెల్లవారుజామునే నిద్ర లేవాలి. సూర్యోదయానికి ముందే స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. ఏదైనా ఆలయంలో నవగ్రహాల వద్దకు వెళ్లి పశ్చిమ ముఖంగా ఉన్న విగ్రహానికి పూజలు చేయాలి. నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. నల్ల వస్త్రాన్ని సమర్పించాలి. పూలు, మేకు ఇతరాలను సమర్పించుకోవాలి.
కుంకుమ, పసుపు చల్లి అగరబత్తిలు వెలిగించాలి. శనిత్రయోదసి రోజు పసుపు నీటితో పరిహారం చేస్తే ఏలినాటి శని పోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. పగటి పూట గ్లాసులో పసుపు కలిపిన నీటితో ఇల్లంతా తిరగాలి. ఆ తర్వాత ఆ గ్లాసుని ఇష్టదైవం ముందు ఉంచి మొక్కాలి. తర్వాత ఓం కాకధ్వజయః విగ్నహే, కడ్గహస్త ధీమహీ తన్మోమంతప్రచోదయాత్ అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి.
మంత్ర పఠనం తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చేయాలి. కాసేపు ఇంటి బయటే ఉండి తిరిగి ఇంట్లోకి వెళ్లాలి. ఒక గంట సేపటి వరకు పసుపు నీటి గ్లాసును ఇష్ట దైవం ముందే ఉంచాలి. ఆ తర్వాత పసుపు నీటిని పారే నీటిలో కానీ, చెట్లకు గానీ పోయాలి. శనిత్రయోదశి రోజు ఇలా చేయడం ద్వారా ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
శనిత్రయోదశి రోజు చేయాల్సిన పనులు:
శనిత్రయోదశి రోజు శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఉపవాసం ఉండాలి. శని త్రయోదశి పూజలో భాగంగా భక్తులు తైలాభిషేకం చేయాలి. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి నల్ల నువ్వులు కొన్ని, నువ్వుల నూనె ప్యాకెట్, కిలో బొగ్గులు, నల్ల రిబ్బన్, 8 ఇనుప మేకులు, కొన్ని నవధాన్యాలు కట్టి ఆలయ పూజారికి దానం చేయండి లేదా ప్రవహించే నీటిలో వేయండి. అలాగే శనిత్రయోదశి రోజు కాకికి ఆహారం పెడితే మంచి జరుగుతంది. ఇంట్లో అన్నపూర్ణ వెలుస్తుందని.
శనిత్రయోదశి రోజు ఈ వస్తువులు కొనవద్దు:
శనిత్రయోదశి రోజు ఉప్పు, ఇనుము, ఆవనూనె, ఆవాలు, నల్లటి గింజలు, గొడుగు, నల్లటి వస్తువులు ఎట్టిపరిస్థితుల్లో కొనకూడదు. ఈ రోజు ఉప్పు కొంటే ఇల్లంతా నెగెటివిటీ పాకుతుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications