Latest Updates
-
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి!
వ్యాయామం చేసటప్పుడు విపరీతంగా చెమట.. కొవ్వు కరిగిపోతుందని అస్సలు సంబరపడొద్దు.!
బరువు తగ్గే క్రమంలో వ్యాయామాలు చేసేటప్పుడు చెమట పడితే కొవ్వు వేగంగా తగ్గుతుందని కొందరు అభిప్రాయపడుతుంటారు. అయితే ఇది నిజమా లేక కేవలం అపోహలు మాత్రమేనా.. చెమట పడితే కొవ్వు కరిగి క్రమంగా బరువు తగ్గుతారా.. డైటీషియన్ నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం..

ఈ రోజుల్లో అధిక బరువు ప్రధాన సమస్యగా మారింది. కొందరు ఫుడ్ విషయంలో కంట్రోల్‌లో ఉన్నా జీవనశైలిలో మార్పుల కారణంగా బరువు పెరుగుతుంటారు. మరికొందరు జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, ఆయిల్ ఫుడ్, ఆలస్యంగా నిద్రపోవడం, పనివేళల్లో మార్పులు, ఒత్తిడి ఇలా పలు కారణాల వల్ల అకస్మాత్తుగా వారిలో ఊబకాయం వచ్చేస్తుంది. దీంతో పొట్ట చుట్టూ కొవ్వు పెరిగి అవస్థలు పడుతుంటారు. ఈ క్రమంలో ఆరోగ్యమూ దెబ్బతింటోంది. అధిక బరువు కారణంగా డయాబెటిస్, అధిక రక్తపోటు, గుండెకి సంబంధించి వ్యాధులు చిన్న వయసులోనే వస్తున్నాయి. దీంతో బరువు తగ్గేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
బరువు తగ్గడానికి చేసే ప్రణాళికలో ప్రధానమైనవి జిమ్ వర్కౌట్స్, వ్యాయామాలు, డైట్, సమతుల్య ఆహారం. సరైన భోజనం తీసుకుంటూ శారీరక దృఢత్వంపై దృష్టి సారించాల్సి ఉంటుంది. బాడీలో అనారోగ్యకర కొవ్వులు తగ్గితే ఆటోమేటిక్‌గా బరువూ తగ్గుతారు. ఈ క్రమంలో ఫ్యాట్ బర్న్, వెయిట్ లాస్ గురించి జనంలో చాలా అపోహలు ఉన్నాయి. ఫ్యాట్ బర్న్ వర్కౌట్స్ సమయంలో అధికంగా చెమట పడితే కొవ్వు వేగంగా తగ్గుతుందని చాలా మంది భావిస్తుంటారు.
అయితే అధికంగా చెమట పట్టడం వల్ల కొవ్వు వేగంగా కరుగుతుందనేది కేవలం అపోహ మాత్రమేనని డైటీషియన్ నిపుణులు అంటున్నారు. అసలు చెమట పట్టడానికి, కొవ్వు తగ్గడానికి ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. శరీరంలో చెమట పట్టడం అనేది సహజంగా జరిగే కూలింగ్ మెకానిజం అని.. ఇది కేవలం శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో దోహదపడుతుంది.
వ్యాయామం చేసే సమయంలో కానీ, వేడి వాతావరణంలో ఉన్నా.. లేదంటే మసాలా ఫుడ్స్ ఎక్కువగా తింటున్నప్పుడు చెమట పట్టవచ్చు. కానీ దీనికి శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడానికి ఎలాంటి సంబంధం లేదు. చెమట పట్టడం ద్వారా శరీరం నుంచి నీరు, కొద్ది మొత్తంలో ఉప్పు బయటకు వస్తుంది. ఈ క్రమంలో వ్యాయామం చేస్తున్నప్పుడు మీకు ఇలా చెమట పట్టినట్లయితే మీరు కొంచం బరువు తగ్గినట్లు అనిపిస్తారు. ఇందుకు కారణం కొవ్వు కరగడం కాదు.. కేవలం శరీరంలో నీరు బయటకు వెళ్లిపోవడం ద్వారా ఇలా జరుగుతుందని.. నీరు తాగిన తర్వాత మళ్లీ బరువు సాధారణ స్థితికి వస్తుందని నిపుణులు అంటున్నారు.

అయితే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ఎప్పుడు తగ్గుతుందనే దానిపై నిపుణులు స్పష్టత ఇస్తున్నారు. మన బాడీలో అదనంగా నిల్వ ఉన్న కేలరీలను శక్తిగా వినియోగించుకున్నట్లయితే కొవ్వు క్రమంగా కరిగిపోతుంది. ఫ్యాట్ బర్న్ అనేది ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, తగినంత నిద్ర పోవడం, నిరంతరం ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా సాధ్యమవుతుంది.
ఈ క్రమంలో మీరు ఎంత కొవ్వును కోల్పోతారనేది మీ ఫిట్‌నెస్, కేలరీల సమతుల్యతపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేగానీ మీ నుంచి వచ్చేవి చెమట ద్వారా ఫ్యాట్ బర్న్ అవడం, బరువు తగ్గడం లాంటివి జరగవని స్పష్టం చేస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
