Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
కుంభ రాశిలో శని వక్రి: జూన్ 29 నుండి రాబోయే 139 రోజులు ఈ 4 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
కుంభరాశిలో శని తిరోగమనం 2024: ప్రతి నెలలో గ్రహాలు తమ స్థానాన్ని మార్చుకుంటాయి. అలా ఈ నెల 29 తేదీనా శని తిరోగమనంలో కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ తిరోగమన ప్రయాణం వల్ల కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం చూపబోతున్నాడు. ఇలా కుంభరాశిలో ప్రవేశించిన శని నవంబర్ 15 వరకు ఆ స్థితిలో ఉంటాడు . దాదాపు 5 నెలల ాటు అదే రాశిలో ఉంటూ కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంటాడు.
అందుకు కారణం రాహు, కేతు, శని వంటి క్రూరమైన గ్రహాలు తిరోగమనంలో ప్రయాణించడం వల్ల వారి క్రూరత్వం మరింత పెరుగుతుందని జోతిష్యశాస్త్రంలో చెప్పబడినది. ఒక వ్యక్తి మంచి చేస్తే వారికి ఎల్లప్పుడూ శని సహాయపడతాడు, చెడు చేసే వారిని మాత్రమే శిక్షిస్తాడు. కష్టాలపాలు చేస్తాడు. అలాంటి శనీశ్వరుడు కుంభ మరియు మకర రాశి వారికి అధిపతిగా సుమారు రెండున్న సంవత్సరాలు ఒకేరాశిలో ఉంటాడు.

ఈ సమయంలో శనిని శాంతింపచేయడానికి రాబోవు 5 నెలల పాటు శాంతింప చేయడానికి కొన్ని నివారణలు మరియు పరిహారాలు చేసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల శని వల్ల ఎదురయ్యే అశుభ ప్రభావాలు తగ్గుతాయి. ఈ పరిహారాల వల్ల శనీశ్వరుడు ఆశీర్వాదం వల్ల జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోతాయి. అయితే కొందరికి మాత్రం ఏం చేసిన కొంత ప్రభావం ఉండనే ఉంటుంది. కాబట్టి, శని దేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నందున ఏ రాశి వారు ఏయే రాశులవారు జాగ్రత్త వహించాలో ఇక్కడ తెలుసుకుందాం.
మేషరాశి
మేషరాశిపై శని దేవుడు తృతీయ దర్శనం చేయబోతున్నాడు. మేషరాశికి 11వ ఇంటిలో శని తిరోగమనంలో ఉంటాడు. ఈ కారణంగా, ఈ రాశి వారు వ్యక్తిగత ,వృత్తి మరియు ఆర్థిక స్థితి కొద్దిగా ప్రభావితమవుతుంది. చిన్న పనులకే ఆటంకాలు ఎదురవుతుంటాయి. వ్యాపార్తలు కష్టపడాలి. వ్యాపార నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. డబ్బు లావాదేవీలకు దూరంగా ఉండాలి. కొత్తగా అప్పులు చేయాల్సి వస్తే మీ పరిమితికి బట్టి తీసుకోండి. లేదంటే భవిష్యత్తులో సమస్యలు ఎదురౌతాయి. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.జీవితంలో సంతృప్తి కనుమరుగవుతుంది.
సింహ రాశి
సింహరాశికి 7వ ఇంట్లో శని తిరోగమనంలో ఉంటాడు. దీని వల్ల ఈ రాశుల వారు అనేక సమస్యలను ఎదుర్కొంటారు.ముఖ్యంగా ఉద్యోగస్తులు కేరీర్ కు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాపారస్తులు మరింత కష్టపాడాల్సి వస్తుంది. పోటీ దారుల నుండి గట్టిపోటీ ఉంటుంది. దాంతో మానసిక ఒత్తిడికి గురి అవుతారు. ఆర్థిక స్థితి అంతంత మాత్రంగా ఉండటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఖర్చులను నియంత్రించుకోవాలి. బాధ్యతల భారం పెరుగుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు, డ్రైవింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
కర్కాటకం మరియు వృశ్చికరాశిపై శని ప్రభావం
కర్కాటకం మరియు వృశ్చిక రాశివారి మీద కూడా శని ప్రభావం ఉంటుంది, శని తిరోగమన సమయంలో, ఈ రాశిచక్ర గుర్తులు తమ ఆలోచనలను మార్చుకోవాలి. ముఖ్యంగా వివాదాలకు దూరంగా ఉండాలి. అలాగే, కుటుంబంలో ఒక రకమైన వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంది, ఇది ఇంటి వాతావరణాన్ని పాడుచేయవచ్చు. మీరు పెట్టుబడులపై శ్రద్ధ వహించాలి మరియు డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయాలి లేకపోతే అప్పు తీసుకునే పరిస్థితి ఉంటుంది
కన్య
కన్యారాశికి 6వ ఇంట్లో శని తిరోగమనంలో ఉంటాడు. ఈ కారణంగా, ఈ రాశికి సంబంధించిన వారు జూన్ 29 నుండి వచ్చే 139 రోజుల పాటు ఏ పని చేసినా మంచి ఫలితం ఉండదు. ఏ చిన్న పనులను పూర్తి చేయడానికి కూడా కష్టపడవలసి ఉంటుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు ఎలాంటి ఫలితం ఉండదు. శత్రువులు పెరుగుతారు. మీపై పెత్తనం చెలాయిస్తారు. ఒత్తిడి తగ్గించుకోండి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరిస్థితి కూడా కొద్దిగా ప్రభావితం అవుతుంది. అనవసరమైన విషయ్యాల్లో జోక్యం చేసుకోకండి.
శని సడేసతి కోసం జ్యోతిష్య నివారణలు
- శనివారం నాడు శనిదేవుని పూజించి 'ఓం ప్రాణ్ ప్రీన్ ప్రాణ్ స: శనిశ్చరాయ నమః' అనే మంత్రాన్ని మూడుసార్లు జపించండి.
- మీ కుడి చేతి మధ్య వేలికి ఇనుప ఉంగరాన్ని ధరించండి, ఈ ఉంగరం గుర్రపు షూతో తయారు చేయబడిందని గుర్తుంచుకోండి.
- శనివారం నాడు, పేద మరియు అనాదలకు ఆహారం, బట్టలు, పండ్లు మొదలైన నిత్యావసర వస్తువులను ఇవ్వండి. నల్ల శనగలు, ఇనుప వస్తువులు, నల్ల బూట్లు, నల్ల బట్టలు, ఆవనూనె మొదలైన వాటిని కూడా దానం చేయండి.
- ప్రతి శనివారం రాగి, నువ్వులు లేదా ఆవనూనె సమర్పించండి. అలాగే ప్రతిరోజూ 'శని స్తోత్రం' పఠించండి.
- ప్రతి రోజు నల్ల చీమలకు తేనె మరియు పంచదార ఆహారంగా వేయాలి మరియు రామచరిత్ మానస్ యొక్క సుందర్‌కాండ్ మరియు హనుమాన్ చాలీసాను పఠించాలి.
(నిరాకరణ: పైన ఇవ్వబడిన సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న ఊహలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది మరియు విశ్వసనీయతకు హామీ లేదు. తెలుగుబోల్డ్ స్కై కథనానికి సంబంధించిన సమాచారాన్ని నిర్ధారించలేదు. మరియు సమాచారాన్ని అందించడమే మా ఉద్దేశ్యం. ఇది ఇలా తీసుకోవాలి. ఏదైనా సమాచారం లేదా ఊహను సాధన చేయడానికి లేదా అమలు చేయడానికి ముందు, దయచేసి సంబంధిత నిపుణులను సంప్రదించండి.)
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications











